E-Paper
Advertisement

Lokesh Kanagaraj: అల్లు అర్జున్ సినిమాకు లోకేష్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనరేషన్?

Lokesh Kanagaraj: అల్లు అర్జున్ సినిమాకు లోకేష్ దిమ్మ తిరిగిపోయే రెమ్యూనరేషన్?
Advertisement

Lokesh kanagaraj: టాలీవుడ్ స్టార్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ తమిళ్ హీరో అట్లీ(Atlee) డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్ బ్యానర్ పై ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను శర వేగంగా జరుపుకుంటుంది. ఇక ఈ సినిమానికి వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అట్లీ సినిమాతో అల్లు అర్జున్

అట్లీ సినిమా అనంతరం అల్లు అర్జున్ వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలకు సంబంధించి అధికారక ప్రకటన త్వరలోనే వెల్లడి కానుంది. ఇకపోతే  గత కొద్దికొద్ది రోజులుగా అల్లు అర్జున్ మరొక తమిళ హీరో లోకేష్ కనగ రాజ్ తో సినిమా చేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా ఫైనల్ అయిందని త్వరలోనే షూటింగ్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని తెలుస్తుంది . ఈ సినిమానే అత్యంత భారీ బడ్జెట్ సినిమాలో మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు.

సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా

Advertisement

ఇందులో అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నారని, తన కుడి చేతిని కోల్పోయి సూపర్ పవర్స్ ఉన్న వ్యక్తిగా కనిపించబోతున్నారు అంటూ ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉన్నాయి. లోకేష్ కనగ రాజ్ అల్లు అర్జున్ కాంబోలో రాబోతున్న సినిమాకు సంబంధించి ఈ నెలలో అధికారక ప్రకటన రాబోతుందని సమాచారం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమా కోసం లోకేష్ రెమ్యూనరేషన్  గురించి ఒక వార్త హల్చల్ చేస్తుంది.

రూ.75 కోట్ల రెమ్యూనరేషన్

Advertisement

ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ ఏకంగా 75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్టు సమాచారం. ఒక దర్శకుడికి 75 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇలా లోకేష్ రెమ్యూనరేషన్ గురించి ఈ వార్తలు వైరల్ గా మారడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక లోకేష్ కనగారాజ్ కేవలం దర్శకుడిగా మాత్రమే కాకుండా హీరోగా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈయన ‘ DC’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది.

Also Read: Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే స్పిరిట్ రిలీజ్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×