E-Paper
Advertisement

Lenin Bharathi: అప్పుడు ఎక్కడికి వెళ్లారు? స్వీపర్ పద్మ విషయంలో రజినీను తప్పు పట్టిన డైరెక్టర్!

Lenin Bharathi: అప్పుడు ఎక్కడికి వెళ్లారు? స్వీపర్ పద్మ విషయంలో రజినీను తప్పు పట్టిన డైరెక్టర్!
Advertisement

Lenin Bharathi: ఇటీవల తమిళనాడులో పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ(Padma) తన నీతి నిజాయితీతో ఎంతోమందిని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తున్న పద్మ గత కొద్ది రోజుల క్రితం తన విధులను నిర్వహిస్తుండగా తనకు సుమారు 45 తులాల బంగారం ఉన్న ఒక బ్యాగ్ దొరికింది. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో ఎవరైనా బంగారం దొరికితే గుట్టు చప్పుడు కాకుండా వాటిని సొమ్ము చేసుకుంటారు కానీ పద్మ మాత్రం తన మంచి మనసును బయట పెడుతూ ఆ 45 తులాల బంగారం ఉన్న బ్యాగ్ ఆమె పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు.

పద్మను సత్కరించిన రజనీకాంత్..

ఈ విధంగా గొప్ప మనసు చాటుకున్న పద్మ పేరు కోలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతుంది. ఇక ఈమెకు లలిత జ్యువెలరీ అధినేత ఇంటికి పిలిపించుకొని ఆమెను సన్మానించారు. అలాగే ఈ విషయం కాస్త సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) చెంతకు చేరడంతో ఆయన కూడా స్వీపర్ పద్మను తన ఇంటికి ఆహ్వానించి ఆమెను ప్రశంసించడమే కాకుండా తనకు ఒక బంగారు గొలుసును కూడా బహుమతిగా ఇచ్చారు. ఇలా సూపర్ స్టార్ రజనీకాంత్ పద్మ విషయంలో వ్యవహరించిన తీరుపై నేటిజన్లు పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ గొప్ప వాళ్ళు ఎక్కడున్నారు?

Advertisement

ఈ నేపథ్యంలోనే మరో డైరెక్టర్ మాత్రం తీవ్రస్థాయిలో ఈ చర్యలను ఖండిస్తూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడుగా కొనసాగుతున్న లెనిన్ భారతి(Lenin Bharathi) రజినీకాంత్ స్వీపర్ పద్మను సత్కరించడం గురించి స్పందిస్తూ… కొద్దిరోజుల క్రితం పారిశుద్ధ కార్మికులు తమ కనీస హక్కుల కోసం అలాగే నెలవారి జీతాల కోసం చెన్నై కార్పొరేషన్ ముందు పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. ఈ గొప్ప మనసున్న వాళ్ళందరూ ఆ సమయంలో ఎక్కడ ఉన్నారు అంటూ ప్రశ్నించారు.

సామాజిక వివక్షత..

Advertisement

పద్మను రజనీకాంత్ సత్కరించే సమయంలో కూడా ఆమె తన యూనిఫామ్ లోనే ఉన్నారు. ఆ సమయంలో రజనీకాంత్ ఫోటోలు దిగడాన్ని ఆయన తప్పు పట్టారు ఆమెను ఒక వ్యక్తిగా కాకుండా ఒక సేవకురాలు అనే ముద్రతోనే చూస్తున్నారని ఇది ఒక విధమైన సామాజిక వివక్షత అంటూ లెనిన్ భారతి అభిప్రాయపడ్డారు. ఇలా రజనీకాంత్ చర్యలను తప్పు పట్టిన లెనిన్ భారతి వ్యాఖ్యలపై రజినీకాంత్ అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ గారు ఆమె నిజాయితీని గౌరవించడం తప్పా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం లెనిన్ భారతి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొనే ఇబ్బందుల పై సెలబ్రిటీల మౌనాన్ని ప్రశ్నించడానికి ఇదే సరైన సమయం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Sreeleela: పవన్ పైనే శ్రీ లీల ఆశలు..అప్పుడు శృతి హాసన్..ఇప్పుడు శ్రీలీల

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×