E-Paper
Advertisement

Leader Teaser: శరవరణ్ ‘లీడర్’ టీజర్ వచ్చేసింది చూశారా?.. కూతురు సెంటిమెంట్ అదిరిందిగా..

Leader Teaser: శరవరణ్ ‘లీడర్’ టీజర్ వచ్చేసింది చూశారా?.. కూతురు సెంటిమెంట్ అదిరిందిగా..
Advertisement

Leader Teaser: ‘ది లెజెండ్’ చిత్రంతో వెండితెరకు పరిచయమై, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు లెజెండ్ శరవణన్ తాజాగా ‘లీడర్’ (Leader) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. యాక్షన్, ఎమోషన్ మాస్ ఎలిమెంట్స్‌తో నిండిన ఈ టీజర్ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read also-Prison Drama OTT : గత 32 సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆదరణ.. ప్రపంచంలోనే బెస్ట్ మూవీగా గుర్తింపు… ఐయండిబిలో 9.3 రేటింగ్

తండ్రీకూతుళ్ల అనుబంధం..

Advertisement

టీజర్ ప్రారంభంలోనే దర్శకుడు సినిమాలోని ప్రధాన ఆత్మను ఆవిష్కరించారు. “నా కూతురితో పాటే నేను ఉండాలి.. దాని కోసం ఈ ప్రపంచాన్ని ఎదిరించమన్నా ఎదిరించి గెలుస్తా” అనే డైలాగ్‌తో శరవణన్ పాత్రలోని తీవ్రతను చూపించారు. తన బిడ్డ కోసం ఒక సామాన్యుడు వ్యవస్థను లేదా శక్తివంతులను ఎలా ఎదురించాడు అనే పాయింట్ చుట్టూ కథ తిరుగుతుందని అర్థమవుతోంది. ఈ ఎమోషనల్ యాంగిల్ సినిమాకు పెద్ద అసెట్ కానుంది. ఈ సినిమాలో శరవణన్ పాత్ర చాలా వైవిధ్యంగా ఉండబోతోందని టీజర్ ద్వారా తెలుస్తోంది. ఒకవైపు ఖాకీ దుస్తుల్లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా, మరోవైపు జైలులో ఖైదీగా ఉన్న దృశ్యాలు కథపై ఆసక్తిని పెంచుతున్నాయి. ముఖ్యంగా ట్రైన్ ఫైట్ సీక్వెన్స్ భారీ యాక్షన్ బ్లాక్స్ హై-వోల్టేజ్ మాస్ ఎంటర్టైనర్‌ను తలపిస్తున్నాయి.

Read also-Horror movie OTT : వెన్నులో వణుకు పుట్టించే బామ్మ ఆత్మ… నెల రోజుల తర్వాత ఓటీటీలోకి తమిళ హారర్ థ్రిల్లర్

సాంకేతిక హంగులు

Advertisement

ప్రముఖ సంగీత దర్శకుడు గిబ్రాన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రతి సీన్‌ను తన మ్యూజిక్‌తో ఎలివేట్ చేశారు. విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి, సినిమాటోగ్రఫీ సినిమా రిచ్‌నెస్‌ను ప్రతిబింబిస్తోంది. ‘కాకి సట్టై’, ‘కోడి’ వంటి మాస్ హిట్లు ఇచ్చిన దురై సెంథిల్ కుమార్, ఈ చిత్రాన్ని కూడా అదే స్థాయిలో మలిచినట్లు కనిపిస్తోంది. లెజెండ్ శరవణన్ స్టోర్స్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం ఏప్రిల్ 2026లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ది లెజెండ్’ తర్వాత శరవణన్ తన నటనలో మరియు మేకోవర్‌లో చాలా మార్పులు చూపించారు. మరి ఈ ‘లీడర్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాడో చూడాలి. మొత్తానికి, ‘లీడర్’ టీజర్ మాస్ ఆడియన్స్‌కు కావాల్సిన అన్ని అంశాలతో నిండి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×