E-Paper
Advertisement

Mega 158: 2027 సంక్రాంతి బరిలో చిరు… మెగా 158 సినిమా పై అప్డేట్!

Mega 158: 2027 సంక్రాంతి బరిలో చిరు… మెగా 158 సినిమా పై అప్డేట్!
Advertisement

Mega 158: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తాజాగా మన శంకర వరప్రసాద్ గారు(MSVPG) అనే సినిమా ద్వారా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు విపరీతమైన ఆదరణ లభించిన నేపథ్యంలో అభిమానులు , చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా జనవరి 12వ తేదీ విడుదల కాగా, కేవలం మూడు రోజుల వ్యవధిలోనే సుమారు 150 కోట్లకు పైగా కలెక్షన్లను రాబడుతూ సంచలనాలను సృష్టించింది. ఇలా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిరంజీవి తదుపరి సినిమాల గురించి కూడా అభిమానులలో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే చిరంజీవి తదుపరి సినిమాపై పెద్ద ఎత్తున ఓ వార్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్..

చిరంజీవి తన తదుపరి సినిమాని డైరెక్టర్ బాబి దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరొక స్టార్ హీరో క్యామియో కూడా ఉండబోతుందని తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పనులు ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. ఇకపోతే తాజాగా ఈ సినిమా షూటింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.

2027 సంక్రాంతి రిలీజ్..

Advertisement

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పనులు ఫిబ్రవరి నుంచి ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. అయితే ఈ సినిమాని ముందుగా అక్టోబర్ నెలలో దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలని నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ భావించారు. అయితే ఈ సంక్రాంతికి చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా బాబి డైరెక్షన్లో రాబోతున్న సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. ఇలా 2027 సంక్రాంతిని టార్గెట్ చేశారని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే అధికారకంగా రాబోతున్నాయని తెలుస్తుంది.

వాల్తేరు వీరయ్యతో సక్సెస్..

Advertisement

చిరంజీవి బాబి కాంబినేషన్లో ఇదివరకు వాల్తేరు వీరయ్య సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా 2023 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న నేపథ్యంలో మరోసారి చిరంజీవి బాబి డైరెక్షన్లో సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది. ఇక తాజాగా మన శంకర వరప్రసాద్ గారు సినిమా మంచి సక్సెస్ కావడంతో చిరు బాబి కాంబినేషన్లో రాబోతున్న సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

Also Read: Shambhala OTT: ఓటీటీలోకి ఆది శంభాల.. స్ట్రీమింగ్ డేట్ లాక్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×