// // Monalisa Bhosle: ప్రియుడితో ఏడడుగులు నడిచిన మోనాలిసా.. - Staging.BigTvLive -->
E-Paper
Advertisement

Monalisa Bhosle Wedding:  ఫైనల్లీ ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఫోటోలు వైరల్!

Monalisa Bhosle Wedding:  ఫైనల్లీ ప్రియుడిని పెళ్లాడిన కుంభమేళా బ్యూటీ మోనాలిసా.. ఫోటోలు వైరల్!
Advertisement

Monalisa Bhosle Wedding: మోనాలిసా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2025 లో జరిగిన ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఈమె పూసలు అమ్ముతూ కనిపించారు .ఇలా పూసలముకుంటూ జీవనం గడుపుతున్న మోనాలిసా రాత్రికి రాత్రి సెలబ్రిటీగా మారిపోయారు . ఈమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెను ఏకంగా హీరోయిన్ ను చేసేసారు. పలువురు దర్శక నిర్మాతలు మోనాలిసాను కలిసి ఆమెకు సినిమా అవకాశాలు కల్పించడంతో ప్రస్తుతం ఈమె తెలుగు , మలయాళ బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్న మోనాలిసా తాజాగా కేరళలోని పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా..

ఈమె సినిమా ఇండస్ట్రీ లోకి రాకముందు నుంచి ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఫర్మాన్ ఖాన్(Farmaan Khan) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నారు. ఇలా ఏడాదిన్నర పాటు ప్రేమలో ఉన్న వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ పెళ్లికి మోనాలిసా తండ్రి అడ్డుపడడంతో ఆమె తన తల్లితండ్రులు తనకు ఇష్టం లేకుండా బలవంతపు పెళ్లి చేస్తున్నారంటూ కేరళ పోలీసులను ఆశ్రయించారు. తన కుటుంబం నుంచి తనకు హాని ఉందని రక్షణ కల్పించాలి అంటూ ఈమె పోలీసులను కోరారు.

ప్రియుడిని పెళ్లాడిన మోనాలిసా…

Advertisement

ఇలా కేరళలోని తిరువనంతపురంలోని తప్పనూరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించి ఫిర్యాదు చేసిన ఈమె పలువురి సమక్షంలో కేరళలోని ఒక ఆలయంలో తన ప్రియుడితో కలిసి ఏడడుగులు నడిచారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఉన్నఫలంగా మోనాలిసా పెళ్లి చేసుకోవడంతో అందరూ షాక్ అవుతున్నారు. మరి పెళ్లి తర్వాత మోనాలిసా  సినిమాలలో కొనసాగుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈమె  ది డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అదేవిధంగా మలయాళంలో నాగమ్మ అనే సినిమాలో కూడా నటించారు. ఇక తెలుగులో కూడా ఒక సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.

బాలికల పాఠశాల కోసం ఫస్ట్ రెమ్యూనరేషన్..

Advertisement

మోనాలిసా తెలుగులో నటుడు సాయి చరణ్ హీరోగా లైఫ్ అనే సినిమాలో కూడా నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఇటీవల పూజా కార్యక్రమాలతో ఘనంగా షూటింగ్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. మోనాలిసా పలు సినిమాలకు కమిట్ అయినప్పటికీ ఇప్పటివరకు ఈ ఒక సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇక మోనాలిసా పూసలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఈమె సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ హోదా అనుభవిస్తున్నారు. ఇక ఈమె హీరోయిన్ గా సినిమా అవకాశాలు అందుకున్న తర్వాత ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు అదేవిధంగా తన మొదటి రెమ్యూనరేషన్ మొత్తం సొంత గ్రామంలోని బాలికల పాఠశాల కోసం ఆ డబ్బును ఖర్చు చేసి అందరి మనసును గెలుచుకున్నారు.

Also Read: Harish shankar: ఆ హీరోని ఏమైనా అంటే కళ్ళు పోతాయి.. వివరణ ఇచ్చిన హరీష్ శంకర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×