E-Paper
Advertisement

Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!

Mega 158: చిరు-బాబీ మూవీలో కోలీవుడ్ స్టార్.. కళ్ళుచెదిరే రెమ్యునరేషన్!
Advertisement

Mega 158: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) ఏడు పదుల వయసులో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఒకవైపు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమా చేసి.. ఈ సినిమాను ఇంకా విడుదల చేయలేదు. వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే సినిమా చేస్తున్నారు.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇందులో నయనతార(Nayanthara ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే మరొకవైపు బాబి దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు చిరంజీవి. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో వాల్తేరు వీరయ్య సినిమా వచ్చి మంచి విజయం అందుకుంది.

చిరు కొత్త మూవీలో కోలీవుడ్ స్టార్..

అందుకే ఇప్పుడు అదే ఆశలతో #మెగా 158 అనే వర్కింగ్ టైటిల్ తో కొత్త సినిమా ప్రారంభించబోతున్నారు. డిసెంబర్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కార్తి (Karthi) ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చిరంజీవి – బాబి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో చిరంజీవితో కార్తి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు తమిళ మీడియా చెబుతోంది. ముఖ్యంగా ఇందులో కార్తి ది గెస్ట్ పాత్ర కాదు అని.. ఫుల్ లెన్త్ పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు అని సమాచారం. చిరంజీవి ప్రధాన పాత్ర పోషిస్తూ ఉండగా .. చిరంజీవితో పాటు కార్తీ కూడా కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది.

కళ్ళు చెదిరే రెమ్యునరేషన్..

Advertisement

అంతేకాదు ఈ సినిమా కోసం కార్తీ తీసుకోబోతున్న రెమ్యూనరేషన్ అక్షరాల 23 కోట్లని సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇదిలా ఉండగా హీరో కార్తీ ఇది వరకే నాగార్జున లీడ్ రోల్ పోషించిన ఊపిరి సినిమాలో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ పోషించి తన నటనతో అబ్బురపరిచిన విషయం తెలిసిందే. ఇకపోతే ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ హీరోయిన్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా తీసుకోబోతున్నట్లు సమాచారం.

బాలీవుడ్ నటుడు కూడా..

అంతేకాదు ఇందులో బాలీవుడ్ నటుడు, డైరెక్టర్గా పేరు సొంతం చేసుకున్న అనురాగ్ కశ్యప్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కే నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. బ్లడీ బెంచ్ మార్క్ సెట్ చేసిన బ్లేడ్ అంటూ రక్తం కారుతున్న చిలుక ఆకారము, ఒక పదునైన గొడ్డలి చూపిస్తూ ప్రాజెక్టు పై అంచనాలు క్రియేట్ చేశారు. రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామా అని హింట్ ఇచ్చారు. మరి ఈ సినిమాతో బాబి ఇంకెలాంటి సక్సెస్ చిరంజీవికి అందిస్తారో చూడాలి.

Advertisement

also read: Naresh: నరేష్ కొత్త మూవీ రిలీజ్ డేట్ లాక్.. ఈసారైనా హిట్టు కొడతాడా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×