E-Paper
Advertisement

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !

మా ఆయనకే లేని నొప్పి మీకెందుకురా నాయనా?.. సాలిడ్ పంచ్ ఇచ్చిన వెటరన్ బ్యూటీ !
Advertisement

Kishwer Merchant:సెలబ్రిటీలు ఏం చేసినా స్పెషలే..అది తుమ్మినా..దగ్గినా ..అలాంటిది ఒక ప్రముఖ బుల్లి తెర నటి బరువు మారిపోతే సోషల్ మీడియా ఊరుకుంటుందా …ట్రోలింగ్ తో చీల్చి చెండాడేయదూ …ఇదిగో ఇపుడు అచ్చంగా అదే పరిస్థితిని ఫేస్ చేస్తుంది ప్రముఖ హిందీ టీవీ నటి కిష్వర్ మర్చంట్.అయితే ట్రోలింగ్ చేశారు కదా అని గుక్క పెట్టి ఎడవలేదండోయ్.ఆ కామెంట్స్ కి గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.ఇంతకీ ట్రోలింగ్ పై అసలేం జరిగిందో ఆమె మాటల్లోనే విందాం.

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న కిష్వర్ మర్చంట్ ఈ విషయంపై అసలు విషయం చెబుతూ ఎమోషనల్ అయింది.. ప్రెగ్నెన్సీ టైమ్‌లో తనకు థైరాయిడ్ తో చాల బాధ పడిపోయానని,ఇక దాని వల్లే ఊహించని విధంగా బరువు తగ్గిపోయానని, ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు అలా బరువు పెరగడం ఎంత నరకం అనేది అనుభవించే వారికే తెలుస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

చాలా నీచమైన ప్రవర్తన

అసలు ఒకరి వెనుక ఉన్న సమస్య ఏంటో తెలుసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు ఒకరి శరీరంపై కామెంట్లు చేయడం చాలా నీచమైన ప్రవర్తన అని మండిపడింది. మతం పేరుతో, కులం పేరుతో కొట్టుకుచచ్చే బదులు.. ముందు మనుషుల్లా మారి ఇతరుల పట్ల దయ చూపించడం నేర్చుకోమని గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

Advertisement

“నా భర్తకు, నా కంటికి రెప్పలా చూసుకునే నా పేరెంట్స్‌కు, నా బిడ్డకు లేని నొప్పు మీకెందుకు? మేం సెలబ్రిటీలమైనంత మాత్రాన మమ్మల్ని కొనేశారా ఏంటి? ఏది పడితే అది మాట్లాడటానికి?” అంటూ ట్రోలర్స్‌ను కడిగిపారేసింది కిష్వర్ మర్చంట్.

కెరీర్ విషయానికి వస్తే

కిష్వర్ మర్చంట్ కెరీర్ విషయానికి వస్తే 1998లో వచ్చిన ‘హిప్ హిప్ హుర్రే’ సీరియల్‌తో నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన కిష్వర్, ‘ప్యార్ కీ యే ఏక్ కహానీ’, ‘ఏక్ హసీనా థీ’ లాంటి హిట్ షోలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇక 2011లో వచ్చిన ‘భేజా ఫ్రై 2’ సినిమాలోనూ నటించి మెప్పించింది కూడా.

also read:“అయ్యగారు” అంటూ పార్టీల్లో ఆటపట్టించేవారు.. అఖిల్ షాకింగ్ కామెంట్స్!

ఇక ఆమెకి ఫుల్ క్రేజ్ తెచ్చింది మాత్రం 2015లో ప్రసారమైన ‘బిగ్ బాస్ 9’ షోనే .ఇక అదే షోలో పరిచయమైన నటుడు సుయాష్ రాయ్‌తో ప్రేమలో పడి, డిసెంబర్ 16, 2016న పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లైన ఐదేళ్లకు,అంటే ఆగస్టు 27, 2021న 40 ఏళ్ల వయసులో వీరికి నిర్వైర్ అనే అబ్బాయి పుట్టడంతో వీరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మర్చంట్ ఇచ్చిన వార్నింగ్ ఒక చెంప దెబ్బే

నిజానికి ప్రెగ్నెన్సీ తర్వాత తన బాడీలో వచ్చిన మార్పుల గురించి కిష్వర్ ఎప్పుడూ దాచడానికి ట్రై చేయలేదు. గతంలో కూడా సోషల్ మీడియాలో ఓ ఓపెన్ పోస్ట్ పెడుతూ.. ప్రెగ్నెన్సీకి ముందు తాను 68 కేజీలు ఉండేదాన్నని, బాబు పుట్టాక ఏడాది పాటు తెగ వర్కవుట్లు చేసినా 72 కేజీలు ఉన్నానని చెప్పింది. కానీ ఆ వేయింగ్ మిషన్ మీద కనిపించే నంబర్లతో తనకేం పనిలేదని, రోజంతా తానెంత యాక్టివ్‌గా, ఫిట్‌గా ఉన్నాననేదే ముఖ్యాంశమని స్పష్టం చేసింది. మొత్తంగా బాడీ షేమింగ్ చేస్తూ హేళన చేసే వారికి కిష్వర్ మర్చంట్ ఇచ్చిన వార్నింగ్ ఒక చెంప దెబ్బే అని చెప్పాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×