// // Kishkindhapuri First Review - కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ... ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా.. -->
E-Paper
Advertisement

Kishkindhapuri First Review: కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ… ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా..

Kishkindhapuri First Review: కిష్కింధపురి ఫస్ట్ రివ్యూ… ఈసారైన బెల్లంకొండ హిట్ కొడతాడా..
Advertisement

Kishkindhapuri First Review: కోండ సాయి శ్రీనివాస్‌ హీరోగా కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కిష్కింధపూరి. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం పీరియాడికల్‌ యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. గతంలో వీరిద్దరి కాంబో వచ్చిన రాక్షసుడు మూవీ మంచి విజయం సాధించింది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్న ఈ సినిమా సెప్టెంబర్‌ 12న థియేటర్లలో వచ్చేందుకు సిద్దమౌతోంది. దీంతో మూవీ టీం ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌ మూవీ మంచి బజ్‌ క్రియేట్‌ చేశాయి. టీజర్‌, ట్రైలర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి.

హారర్‌ ఎలిమెంట్స్, విజువల్స్ సూపర్..

Advertisement

ఇక మరో రెండు రోజుల్లో మూవీ రిలీజ్ ఉండటంతో మంగళవారం రాత్రి ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో మూవీ ప్రీవ్యూ వేశారు. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తన స్నేహితులతో కలిసి ఈ చిత్రం చూశారు. కిష్కిందపూరి చూసి వారు మూవీ బాగుందని పాజిటివ్‌ రివ్యూ ఇచ్చారు. సినిమా బాగుందంటూ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మూవీలో హారర్‌ ఎలిమెంట్స్‌ థ్రిల్లింగ్ గా‌ ఉన్నాయని, విజువల్స్‌ అయితే వండర్‌ అంటూ కొనియాడారట. విజువల్స్‌ కూడా అద్బుతంగా ఉన్నాయన్నారు. ఇక సెకండాఫ్‌లో వచ్చే థ్రిల్లర్‌ సీన్స్‌ సూపర్‌ అంటూ మూవీపై తమ ఫీడ్‌ బ్యాక్‌ ఇచ్చారు. బిగ్‌ స్క్రీన్‌పై థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్స్‌ అందించే అంశాలు బాగానే ఉన్నాయంటున్నారు.

సెన్సార్ జీరో కట్స్

హారర్‌తో పాటు కామెడీకి కూడా దర్శకుడు పెద్దపీట వేశాడు. హైప్‌ర్‌ అది, సుదర్శన్‌ల కామెడీ బాగా ఆకట్టుకుంటుందట. మొత్తం సినిమా నిడివి 2 గంటల 5 నిమిషాలే ఉంది. కానీ, గంటల పాటు ఆడియన్స్‌ని ఈ సినిమా చూపు తిప్పుకోనివ్వదంటున్నారు. మూవీలో భయపెట్టే అంశాలు చాలా ఉన్నాయని, నెక్ట్స్‌ ఏమౌతుందా ప్రీడిక్ట్‌ చేస్తూ.. ఆడియన్స్‌ ఉత్కంఠకు గురి చేస్తుందట. టెకన్నికల్‌ టీం కృష్టి ఈ చిత్రంలో కనిపిస్తోంది. చేతన్‌ భరద్వాజ్‌ బ్యాగ్రౌండ్‌ స్కోర్‌ మూవీకి హైలెట్‌ అని, సీన్‌ మూడ్‌ కి తగ్గట్టుగా కంపోజ్ చేసిన సౌండింగ్‌ గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉందట. ఇందులో అనుపమ పరమేశ్వరన్‌, శ్రీనివాస్‌ తమ నటనతో పాత్రలకు ప్రాణం పోశారట. ఫైనల్‌గా ‘కిష్కింధపూరి’ మంచి థియేటర్‌ ఎక్స్‌పీరియస్‌ మూవీ అంటున్నారు. మూవీకి వస్తున్న టాక్‌ చూస్తుంటే ఈసారి ఈ బెల్లంకోండ హీరో మంచి హిట్‌ కొట్టేస్తాడనిపిస్తోంది.

Advertisement

Also Read: Bigg Boss 9 Telugu Day 2 Episode: బ్యాక్‌ బిచ్చింగ్‌లో అంత బూతుందా.. సంజన ఓవరాక్షన్‌, నామినేషన్‌లో టార్గెటైన హీరోయిన్‌

కిష్కింధపూరి.. మంచి థ్రియేట్రికల్ ఎక్స్ పీరియన్స్..

అంతేకాదు టీజర్‌, ట్రైలర్లకు ఆడియన్స్‌ నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మూవీకి ఉన్న బజ్‌ చూస్తుంటే కిష్కింధపూరి హిట్‌ కొట్టడం ఖాయం అనిపిస్తోంది. అలాగే.. సెన్సార్‌ బోర్డు కూడా కిష్కింధపూరిపై ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. ఇటీవల సెన్సార్‌ కి వెళ్లిన ఈ సినిమాను బోర్డు సభ్యులు చూసి ప్రశసించారు. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దని విధానంపై సంతృప్తిని వ్యక్తం చేశారట. జీరో కట్స్‌తో క్లీన్‌ ఫిలింగ్‌గా సినిమాను సర్టిఫై చేశారు. ఇది హారర్‌ మూవీ కావడంతో సినిమాలో చూపించిన భయానక దృశ్యాలు, హారర్ ఎలిమెంట్స్ దృష్ట్యా మూవీకి A కేటగిరి సర్టిఫికేట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది. కాగా షైన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×