E-Paper
Advertisement

‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ లాక్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే!

‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ లాక్.. అఫీషియల్ అనౌన్స్మెంట్ అప్పుడే!
Advertisement

Kiran Abbavaram: ప్రముఖ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran abbavaram) జోరు మీద ఉన్నారు. ఒకవైపు వ్యక్తిగతంగా వరుస శుభవార్తలు చెబుతూనే.. మరొకవైపు వృత్తిపరంగా మరింత విజయాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు. ఒకవైపు హీరోగా మరొకవైపు నిర్మాతగా సత్తా చాటుతున్న ఈ యువ హీరో నటిస్తున్న చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’. కిరణ్ అబ్బవరం హీరోగా, శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్గా ఎస్కేఎన్, సాయి రాజేష్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి సాయి రాజేష్ కథను అందించారు. రవి నంబూరి దర్శకత్వం వహించగా.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా ఎప్పుడు రిలీజ్ చేస్తారు అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

చెన్నై లవ్ స్టోరీ రిలీజ్ డేట్ లాక్.. అనౌన్స్మెంట్ అప్పుడే!

చెన్నై లవ్ స్టోరీ సినిమాను జూన్ 12 లేదా 19వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం సమ్మర్ కావడంతో ఫ్యామిలీతో కలిసి సాయి రాజేష్ సింగపూర్ కి వెకేషన్ కి వెళ్లారు. ఇక ఆయన ఇండియాకి వచ్చిన తర్వాత డేట్ అనౌన్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం ఈ విషయం అభిమానులలో సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకసారి సాయి రాజేష్ ఇండియాకి వచ్చారు అంటే వెంటనే అనౌన్స్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మరి ఈ సినిమా జూన్ 12న వస్తుందా లేక 19 వస్తుందా అన్నది తెలియాల్సి ఉంది.

ఆకట్టుకున్న సాంగ్..

Advertisement

ఇకపోతే మార్చి 31 సోమవారం నాడు ఈ సినిమా నుండి “గుర్తుందా” అంటూ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు లిరిక్స్ అందించిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ..” అహాన్ని మరిచి ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం పనిచేశారు. ఎవరు ఏం చేసినా ..ఏం చెప్పినా అంతా సినిమా కోసమే అనుకున్నారు. అందుకే ఈ సినిమా ప్రతి విషయంలో కూడా గెలుస్తుందని మేము స్పష్టంగా చెప్పగలం. ఈ సాంగ్ కోసం నేను పల్లవి రాశాక మణిశర్మ సంగీతాన్ని అందించారు. చరణం మణిశర్మ కంపోజ్ చేశాక నేను లిరిక్స్ రాశాను. ఎలాంటి ఈగో లేకుండా మేమంతా కలిసి పని చేసాము” అంటూ అనంత శ్రీరామ్ తెలిపారు. ఇకపోతే సాయి రాజేష్ మాట్లాడుతూ..” బేబీ సినిమా తర్వాత డబ్బుల వెనక పరుగు పెట్టలేదు. ఒక మంచి కథతో మళ్ళీ రావాలనుకున్నాను. మనసుకు నచ్చిన ఒక కథను రాసుకున్నాను ..ఆ కథ రచయిత దగ్గర నుంచి దర్శకుడు వరకు వెళ్లి.. స్క్రీన్ మీదకు వచ్చేసరికి అందులోని ఒరిజినాలిటీ ఎంతోకొంత పోతుంది.కానీ ఈ సినిమాను నేను అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా తెరకెక్కించాము. కొంత భాగం చూశాక కన్నీలాపుకోలేకపోయాను అంటూ సినిమాపై అంచనాలు పెంచేశారు. మరి ఈ సినిమా థియేటర్లలోకి వస్తే ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

 

Advertisement

also read: తల్లి కాబోతున్న శ్రీ విష్ణు హీరోయిన్.. బేబీ బంప్ ఫొటోస్ వైరల్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×