E-Paper
Advertisement

Kavya Maran – Anirudh Ravichander Wedding Rumours: కావ్యా మారన్ – అనిరుధ్ లవ్ స్టోరీ… పెళ్లి దాకా వచ్చిందా?

Kavya Maran – Anirudh Ravichander Wedding Rumours: కావ్యా మారన్ – అనిరుధ్ లవ్ స్టోరీ… పెళ్లి దాకా వచ్చిందా?
Advertisement

Kavya Maran – Anirudh Ravichander Wedding Rumours:

”కావ్యా మారన్..అనిరుధ్ రవిచందర్ కలిసి పెళ్లి చేసుకోబోతున్నారు ”
ఈ న్యూసే ఇపుడు నెట్టింటిని తెగ షేక్ చేస్తుంది.మ్యాటర్ లోకి వెళ్తే.. ఐపీఎల్ వేలం పాటల్లోనూ, స్టేడియంలోనూ తన ఎక్స్‌ప్రెషన్స్‌తో యూత్ ని ఫిదా చేసే కావ్యా మారన్, ఇప్పుడు తన పర్సనల్ లైఫ్ తో మీడియాలో హైలెట్ అయ్యారు. స్టార్ కంపోజర్ అనిరుధ్‌తో ఆమె పెళ్లి ఫిక్స్ అయిందని ,ఇక త్వరలోనే వీరు ఒక ఇంటివారు కాబోతున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. అయితే గత కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య ఏదో ఉందంటూ రూమర్స్ వచ్చిన సంగతి తెల్సిందే.ఆ రూమర్స్ కాస్తా ఇపుడు పెళ్లి పీటలదాకా రావడం గమనార్హం. ముఖ్యంగా కోలీవుడ్ సర్కిల్స్ లో ఈ పెళ్లికి సంబంధించిన న్యూస్ తెగ చక్కర్లు కొడుతుండటంతో అసలిందులో నిజమెంత అంటూ అటు క్రికెట్ ఫ్యాన్స్, ఇటు మ్యూజిక్ లవర్స్ తెగ డిబేట్లు పెట్టేస్తున్నారు .

Advertisement

also read:Swayambhu: ఓటీటీ డీల్ అటకెక్కిందా? డైలమాలో స్వయం భూ రిలీజ్ ..

అయితే వీరి మధ్య ఈ లవ్ స్టోరీ ఇప్పటిది కాదట. సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కోసం అనిరుధ్ ప్రత్యేకంగా థీమ్ సాంగ్ కంపోజ్ చేయడం, పలు సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించడం ఈ రూమర్లకు మరింత బూస్టప్ నిచ్చాయ్.ఇక ఇదివరకు ఇలా సర్క్యులేట్ అయిన వార్తల్ని అనిరుధ్ ఖండించినప్పటికీ, తాజాగా మరోసారి వీరిద్దరూ పెద్దల సమక్షంలో తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నారన్న వార్త మరోసారి హైలెట్ అవ్వడం గమనార్హం.

Advertisement

కావ్యా మారన్ విషయానికి వస్తే సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అన్న సంగతి తెలిసిందే. ఇక తను కేవలం బిజినెస్ ఉమెన్ గానే కాకుండా ఐపీఎల్ లో కూడా తనకంటూ స్పెషల్ క్రేజ్ కొట్టేసిన సంగతి తెల్సిందే.మరోవైపు అనిరుధ్ రవిచందర్ ప్రస్తుతం ఇండియాలోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ఇక వరుస పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కూడా . సో ..ఇంతటి పేరున్న ఇద్దరు వ్యక్తులు ఒక్కటవుతున్నారంటే, ఆ వివాహం ఎంత గ్రాండ్‌గా ఉంటుందో మనం ఊహించవచ్చు.

అయితే ఇద్దరూ పెళ్లి చేసుకుంటున్నారన్న వార్త నెట్టింట్లో వైరల్ అవ్వడమె కాని కావ్యా మారన్ వైపు నుంచి కానీ, అనిరుధ్ నుంచి కాని ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇప్పటి వరకైతే రాలేదు. అయితే ఇలాగే పలు సెలబ్రిటీలు పెళ్ళిళ్ళు చేసుకోబోతున్నారనే వార్తలు మనమూ ఎప్పటి నుండో వింటూనే ఉన్నాం.మరి ఇదీ అలాంటి పుకారేనా లేక నిజంగానే ఇద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అన్న విషయం వాళ్ళ నోటి నుండి వస్తే కాని కన్ఫం అయ్యేలా లేదు.ఏది ఏమైనా ఈ వార్త నిజమైతే మాత్రం, ఇది ఖచ్చితంగా ఈ ఏడాదిలోనే అతిపెద్ద సెలబ్రిటీ వెడ్డింగ్‌గా నిలుస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు !

also read:Mega158 Launch: పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా158 లాంచ్… సంక్రాంతి 2027 టార్గెట్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×