E-Paper
Advertisement

Thalaivar 173 : లీగ్ లోకి కార్తీక్ సుబ్బరాజ్, ఇది ఇంకా పెద్ద రిస్క్ 

Thalaivar 173 : లీగ్ లోకి కార్తీక్ సుబ్బరాజ్, ఇది ఇంకా పెద్ద రిస్క్ 
Advertisement

Thalaivar 173 : సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రత్యేకమైన దర్శకులలో కార్తీక్ సుబ్బరాజు ఒకడు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టి పిజ్జా సినిమాతో ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. కార్తీక్ సుబ్బరాజు తీసిన పిజ్జా సినిమా అప్పట్లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ తర్వాత తీసిన జిగర్తాండ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

షార్ట్ ఫిలిం స్టేజ్ నుంచే చాలామందిని ఆశ్చర్యపరిచాడు కార్తీక్. కార్తీక్ టేకింగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కొన్ని సీన్స్ ను కార్తీక్ డిజైన్ చేసే విధానం చాలామందికి థ్రిల్ ఇస్తుంది. కార్తీక్ సుబ్బరాజ్ తీసిన పెట్ట సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అయింది. రజనీకాంత్ హీరోగా చేసిన ఆ సినిమాకు అనిరుద్ సంగీతం అందించాడు. రజినీకాంత్ నుంచి ప్రేక్షకులు ఎటువంటి అంశాలు అయితే కోరుకుంటారో వాటిని సినిమాలో పొందుపరిచాడు కార్తీక్.

లీగ్ లోకి కార్తీక్ 

Advertisement

రజనీకాంత్ ప్రస్తుతం 172 సినిమాలు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన కూలి సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా కొంతమేరకు మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ హై రేంజ్ లో ఉండేసరికి ఆ స్థాయి ఎక్స్పెక్టేషన్ సినిమా అందుకోలేకపోయింది.

లోకేష్ దర్శకత్వంలో కమల్ హాసన్ మరియు రజినీకాంత్ హీరోలుగా సినిమా రాబోతున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కూలి సినిమా ఫలితం వలన ఆ ప్రాజెక్టు తప్పిపోయింది. వాళ్ళిద్దరినీ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడం మానేశాడు లోకేష్.

Advertisement

సుందర్ దర్శకత్వంలో రజనీకాంత్ 173 వ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ముహూర్తం కూడా జరిగిపోయింది. అయితే ప్రస్తుతం సుందర్ ఆ సినిమాకి దర్శకత్వం చేయట్లేదు అని అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు కార్తీక్ సుబ్బరాజ్ రజనీకాంత్ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అది ఇంకా రిస్క్

కార్తీక్ సుబ్బరాజు స్టార్ డైరెక్టర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు బాక్సాఫీస్ వద్ద తను తీసిన సినిమాలు మంచి సక్సెస్ కూడా సాధించాయి. కాన్సెప్ట్ బేస్ సినిమాలు కూడా కార్తీక్ ఎన్నో తీశాడు.

ఇకపోతే కార్తీక్ సినిమాలో ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఊహించిన స్థాయిలో సక్సెస్ కావడం లేదు. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన రెట్రో సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది.

సూర్య హీరోగా నటించిన ఆ సినిమా మంచి కం బ్యాక్ అవుతుంది అని అందరూ ఊహించారు. మరోవైపు పూజా హెగ్డే కు కూడా ఆ సినిమా ప్లస్ అవుతుంది అని అందరూ అనుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఫైనల్ గా ఆ సినిమా కూడా డిజాస్టర్ అయింది. వరుస డిజాస్టర్ సినిమాలు అందుకుంటున్న కార్తీక్ తో ఇప్పుడు రజనీకాంత్ సినిమా చేయడం అనేది రిస్క్ అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Ritesh Rana : సత్య టైమింగ్ అదిరింది, నిజంగానే పిచ్చెక్కిస్తాడా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×