E-Paper
Advertisement

Annagaru Vostaru Release: డిసెంబర్లోనే ‘ అన్నగారు వస్తారు’ రిలీజ్ డేట్ లాక్!

Annagaru Vostaru Release: డిసెంబర్లోనే ‘ అన్నగారు వస్తారు’ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Annagaru Vostaru Release: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ (Karthi)త్వరలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. కార్తీ, కృతి శెట్టి(Kriti Shetty) హీరో హీరోయిన్లుగా నల్లన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అన్నగారు వస్తారు”(Annagaru vostaru).ఈ సినిమా తమిళంలో”వా వాతియార్” అనే పేరిట ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలా ఈ సినిమా రెండు విభిన్న టైటిల్స్ తో తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.. నిజానికి ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది.

పోలీస్ ఆఫీసర్ గా కార్తీ…

తాజాగా చిత్ర బృందం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ అధికారకంగా విడుదల చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కార్తీ అన్నగారు వస్తారు. సినిమాని డిసెంబర్ 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం తెలియ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో కార్తీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవల సినిమా నుంచి విడుదల చేసిన ట్రైలర్ అమాంతం ప్రేక్షకులను ఆకట్టుకొని సినిమాపై మంచి అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించారు.

డిసెంబర్ 12న అన్నగారు వస్తారు..

Advertisement

నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఇదివరకు వార్తలు వచ్చాయి కానీ అప్పటికే ఈ సినిమా బిజినెస్ పూర్తి కానీ నేపథ్యంలో వాయిదా పడుతూ డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే డిసెంబర్ 12వ తేదీ తెలుగులో పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలోనే కార్తీ అన్నగారు వస్తారు సినిమాని కూడా అదే రోజున విడుదల చేస్తున్న నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద గట్టి పోటీనే ఉండబోతుందని తెలుస్తుంది.

తమిళంలో నైనా సక్సెస్ వచ్చేనా..

Advertisement

ఇక ఈ సినిమా ద్వారా నటి కృతి శెట్టి తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయ్యారు. ఉప్పెన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్ గా వచ్చిన కృతి శెట్టి అనంతరం వరుస సినిమాలలో నటించారు కానీ ఏ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం తమిళంలో కూడా పలు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .ఇక కార్తి సరసన నటించిన అన్నగారు వస్తున్నారు సినిమాతో పాటు ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ సినిమా డిసెంబర్ 18వ తేదీ విడుదల కానుంది. మరి తమిళ సినిమాల ద్వారా కృతి శెట్టికి ఎలాంటి విజయం వరిస్తుందో తెలియాల్సి ఉంది.

Also Read: Rana Daggubati: నటన ఉద్యోగం కాదు.. సమయ పరిమితులు ఉండవు.. దీపికాకు రానా కౌంటర్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×