// // Karan Johar Instagram: బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ఏమైంది.. -->
E-Paper
Advertisement

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ఏమైంది.. అసలు ఆ పనులు ఏంటి.. దానికోసమేనా?

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్‌కు ఏమైంది.. అసలు ఆ పనులు ఏంటి.. దానికోసమేనా?
Advertisement

Karan Johar Instagram: బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కరణ్ జోహార్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన ఒక సంచలన మార్పు ఇండస్ట్రీ వర్గాల్లో మరియు నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీసింది. తన ప్రాణ స్నేహితులైన షారుఖ్ ఖాన్, అలియా భట్ వంటి టాప్ స్టార్లను కరణ్ అన్‌ఫాలో చేయడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Read also-ఏడేళ్ల వయసులోపు పిల్లలకు ఇంట్లో నేర్పించాల్సిన స్కిల్స్.. ఈ రోజు నుంచే శిక్షణ ప్రారంభించండి

అసలేం జరిగింది?

Advertisement

కరణ్ జోహార్‌కు ఇండస్ట్రీలో ఎంతోమంది సన్నిహిత మిత్రులు ఉన్నారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ కుటుంబంతో ఆయనకు దశాబ్దాల అనుబంధం ఉంది. అలాగే అలియా భట్‌ను ఆయన తన సొంత కూతురిలా భావిస్తుంటారు. అలాంటిది, కరణ్ జోహార్ తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ లిస్ట్ నుండి షారుఖ్ ఖాన్, అలియా భట్, కరీనా కపూర్ ఖాన్, కాజోల్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా వంటి స్టార్లందరినీ ఒక్కసారిగా అన్‌ఫాలో చేశారు.

వీరితో పాటు తన కాంపౌండ్ హీరోలైన వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, అలాగే అనన్యా పాండే, మలైకా అరోరాలను కూడా ఆయన లిస్ట్ నుండి తొలగించారు. చివరికి ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో త్వరలో రాబోతున్న ‘నాగ్‌జిల్లా’ సినిమాలో నటిస్తున్న కార్తీక్ ఆర్యన్‌ను కూడా ఆయన అన్‌ఫాలో చేయడం గమనార్హం.

ప్రియాంకా చోప్రాను మాత్రమే ఎందుకు ఫాలో అవుతున్నారు?

Advertisement

ఈ భారీ అన్‌ఫాలో రౌండ్ తర్వాత, బాలీవుడ్ నటీమణులలో కరణ్ జోహార్ ఫాలో అవుతున్న ఏకైక టాప్ స్టార్‌గా గ్లోబల్ ఐకాన్ ప్రియాంకా చోప్రా జోనస్ మాత్రమే మిగిలారు. గతంలో వీరిద్దరి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగిన నేపథ్యంలో, ఇప్పుడు మిగతా అందరినీ వదిలేసి ప్రియాంకను మాత్రమే కరణ్ ఫాలో అవుతుండటం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Read also-Illu Illalu Pillalu Today Episodes: వేరే కాపురం పెట్టిన అన్నయ్యకు కష్టాలు.. నిజం తెలుసుకున్న నర్మదా..భాగ్యంకు షాక్..

అసలు కారణం ఇదేనా?

ఈ అన్‌ఫాలో వ్యవహారంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు, వివాదాలు చెలరేగుతున్నప్పటికీ.. దీని వెనుక ఎలాంటి వ్యక్తిగత గొడవలు లేవని పరిశ్రమ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇండస్ట్రీ నివేదికల ప్రకారం.. ఇది కరణ్ జోహార్ టీమ్ ప్లాన్ చేసిన సరికొత్త “సోషల్ మీడియా స్ట్రాటజీ” (వ్యూహం) లో భాగం మాత్రమే. తన అకౌంట్‌ను రీ-బ్రాండ్ చేయడంలో భాగంగానే ఈ డిజిటల్ క్లీన్-అప్ ప్రక్రియను చేపట్టారని సమాచారం. కాబట్టి కేవలం ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఆధారంగా సెలబ్రిటీల మధ్య ఉన్న వ్యక్తిగత బంధాలను అంచనా వేయలేమని ఈ ఘటన నిరూపిస్తోంది.

కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఇటీవల అనన్యా పాండే, లక్ష్య ప్రధాన పాత్రల్లో నటించిన రొమాంటిక్ డ్రామా ‘చాంద్ మేరా దిల్’ థియేటర్లలో విడుదలైంది. వివేక్ సోని దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రస్తుతం మిశ్రమ స్పందనతో రన్ అవుతోంది. దీనితో పాటు పలు క్రేజీ ప్రాజెక్టులను కరణ్ లైన్లో పెట్టారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×