E-Paper
Advertisement

మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

మంచు విష్ణు ‘కన్నప్ప’ రీ-రిలీజ్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
Advertisement

Kannappa Re Release: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాణంలో, మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన విజువల్ వండర్ ‘కన్నప్ప’ (Kannappa). గతేడాది జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై, అద్భుతమైన భక్తిరస చిత్రంగా ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా.. ఇప్పుడు సరికొత్త రికార్డులు సృష్టించేందుకు మళ్లీ థియేటర్లలోకి అడుగుపెడుతోంది. సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా, మేకర్స్ ఈ చిత్రాన్ని జూన్ 27న గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Read also-Podarillu Today Episode : మహా కోసం చక్రీ గిఫ్ట్.. దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన మహా.. హమ్మయ్య.. చక్రీ కోరిక తీరిందా..?

స్టార్ స్టడెడ్ క్యాస్టింగ్

Advertisement

‘కన్నప్ప’ సినిమాకు ప్రధాన బలం ఇందులోని భారీ తారాగణమే. పరమశివుని పరమ భక్తుడైన కన్నప్పగా మంచు విష్ణు తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (శివుడి పాత్రలో) బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సీనియర్ నటులు శరత్ కుమార్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో మెరిశారు. ఇంతమంది స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది.

Read also-Brahmamudi Serial Today Episode June 18th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: లక్కీతో పెళ్లి గురించి నిజం చెప్పిన రాజు  

సాంకేతిక నిపుణులు

Advertisement

భారీ బడ్జెట్‌తో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు AVA ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై డా. ఎం. మోహన్ బాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ దర్శకుడు ముకేష్ కుమార్ సింగ్ అత్యున్నత విజువల్ వాల్యూస్‌తో ఈ భక్తిరస కథను తెరకెక్కించారు. స్టీఫెన్ దేవస్సి మరియు మణిశర్మ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ డివోషనల్ ఫీల్‌ను అందించాయి. గతంలో థియేటర్లలో ఈ విజువల్ ట్రీట్‌ను మిస్ అయిన వారికి, అలాగే మళ్లీ ఆ భక్తి సాగరంలో ఓలలాడాలనుకునే సినీ ప్రియులకు ఈ జూన్ 27న రాబోతున్న ‘కన్నప్ప’ రీ-రిలీజ్ ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×