E-Paper
Advertisement

రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?

రెబలోడి ఫ్యాన్స్ కి పెద్ద షాక్ .. సీక్వెల్ లో ‘కల్కి’ ఉండడా?
Advertisement

Kalki Sequel : కల్కి 2898 AD.. ప్రభాస్ ఇమేజ్ ని ఆకాశమంత ఎత్తుకి చేర్చిన సినిమా ఇది .బాహుబలి తర్వాత వచ్చిన సాహో,రాదేశ్యాం, ఆదిపురుష్ అంటూ పడుతూ లేస్తున్న డార్లింగ్ ఇండస్ట్రీలో టాప్ హీరోలకి అందనంత దూరంగా పెట్టేసిన సినిమా ఇది.ఇక బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల పై చిలుకు కొట్టి ప్రభాస్ క్రేజ్ గాలివాటం కాదు అని నిరూపించిన సినిమా .అలాంటి సినిమా సీక్వెల్ చుట్టూ ఇప్పుడు వినిపిస్తున్న కొన్ని నెగెటివ్ టాక్స్ రెబలోడి ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయ్.

ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్

Advertisement

అవును ..ఈ సినిమా సీక్వెల్ విషయంలో మేకర్స్ తీసుకుంటున్న డిసీషన్స్ ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. నాగ్ అశ్విన్ మళ్ళీ ఎదో మిరాకిల్ చేస్తాడన్న కాన్ఫిడెన్స్ ఉన్నా మరోపక్క వినిపిస్తున్న ఈ నెగటివ్ టాక్ సినిమా ని రిస్క్ లో పడేస్తుందా అన్న డౌట్స్ రైజ్ అవుతున్నాయ్.అన్నింటికన్నా ముఖ్యంగా ఫస్ట్ పార్ట్ లో ప్రభాస్ ఆడుతూ పాడుతూ కాస్త కామెడీ చేస్తూ అలరించినప్పటికీ క్లైమాక్స్‌లో వచ్చిన కర్ణ పాత్రనే సినిమాని నెక్స్ట్ లెవల్ లో పెట్టేసింది. అయితే, ఇప్పుడు సీక్వెల్‌లో దాదాపు అరగంట పాటు కర్ణుడి పాత్రను చూపించాలని ప్లాన్ చేస్తున్నారన్న టాక్ సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ లకి కారణం అవుతుంది.

భైరవ, కర్ణ అంటూ రెండు వేరియేషన్స్

Advertisement

ఇక ఇప్పటికే ఫస్ట్ పార్ట్ లో భైరవ, కర్ణ అంటూ రెండు వేరియేషన్స్ చూపించాడు నాగ అశ్విన్. ఇక ఇప్పుడు సీక్వెల్‌లో ప్రభాస్ నుంచి మూడో లుక్ ఉంటుందన్న వార్త తెగ సర్క్యులేట్ అవుతుంది.అసలే ప్రభాస్ లుక్స్ మీద నెట్టింట్లో ట్రోల్స్ ఏరకంగా ఉంటాయో చెప్పక్కర్లేదు.మరి ఇపుడు నాగ అశ్విన్ చేస్తున్న ఈ ఎక్స్పెరిమెంట్ సర్ప్రైజ్‌ ఇస్తుందా లేక మళ్ళీ ట్రోల్సర్స్ కి మాంచి స్టఫ్ అవుతుందా అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయ్.

also read :పవన్ కళ్యాణ్ కి, శివాజీ రాజాకి మధ్య ఏం జరిగింది? ‘మా’ ఆఫీస్ లో జరిగిన ఆ గొడవ సీక్రెట్స్ ఇవే

‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌

ఇదిలా ఉంటె సినిమా టైటిల్ విషయంలో వినిపిస్తున్న అప్‌డేట్ అయితే ఫ్యాన్స్‌కు పెద్ద షాక్ ఇస్తుందనే చెప్పాలి. వినిపిస్తున్న టాక్స్ ప్రకారం ఈ సీక్వెల్‌కు ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్‌ ని అనుకుంటున్నాడట నాగ అశ్విన్.సినిమా పేరు ‘కల్కి’ అని పెట్టి, సీక్వెల్ కి వచ్చేసరికి హీరో క్యారెక్టర్ పేరు మీద టైటిల్ మార్చడం అంటే సినిమా బ్రాండ్ దెబ్బతీసినట్టే కదా అన్నది  కొందరి వాదన.ఇక అసలు సినిమాలో కల్కి పుడతాడా లేక కేవలం కర్ణుడి ఫ్లాష్ బ్యాక్ కథతోనే సినిమాను లాగించేస్తారా అంటూ సరికొత్త డౌట్స్ రైజ్ చేస్తున్నారు మరికొంతమంది.

ఇదే షెడ్యూల్ లో డార్లింగ్ కూడా ఎంట్రీ

ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో అమితాబ్, కమల్ హాసన్‌లపై క్రూషియల్ సీన్స్ షూట్ చేస్తున్నారని సమాచారం. ఇక ఇదే షెడ్యూల్ లో డార్లింగ్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. అసలే ప్రభాస్ చేతిలో స్పిరిట్, ఫౌజీ వంటి బడా సినిమాలున్నాయ్. మరి ఒకేసారి ఇన్ని సినిమాలకి డేట్స్ కేటాయించడం అంటే అంత ఆషామాషీ కాదు.క్వాలిటీ మీద ఈ డేట్స్ ఇష్యూ ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపేదే.మరి డేట్స్ కారణంగా చుట్టేస్తారా లేంటి అన్న అనుమానాలు కూడా లేకపోలేదు. చూడాలి మరి నెట్టింట వినిపిస్తున్న ఈ ప్రశ్నల పరంపరకి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో !

also read :అమీర్ ఖాన్ ‘డెత్ నోట్’ రహస్యం…విమానం ఎక్కేముందు ఆ దర్శకుడికి సీక్రెట్ మెసేజ్..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×