E-Paper
Advertisement

30 ఏళ్ల నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్.. లిప్ లాక్ చేయడంపై నిజం బయటపెట్టిన కాజోల్!

30 ఏళ్ల నో కిస్సింగ్ పాలసీకి బ్రేక్.. లిప్ లాక్ చేయడంపై నిజం బయటపెట్టిన కాజోల్!
Advertisement

Kajol: సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టేటప్పుడు లేదా అడుగు పెట్టిన తర్వాత కొన్ని కొన్ని కారణాల చేత కొన్ని నియమాలను పెట్టుకుంటూ ఉంటారు సెలబ్రిటీలు ఇక దశాబ్దాల తరబడి అదే నియమాలను ఫాలో అవుతూ ఉంటారు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు తాము కట్టుబడిన నియమాలకు పులిస్టాప్ పెట్టాల్సి వస్తుంది. అలా ఇప్పటికే నయనతార లాంటి హీరోయిన్లు ప్రమోషన్స్ కి హాజరుకాము అని దశాబ్దాల తరబడి భీష్మించుకు కూర్చున్న విషయం తెలిసిందే. కానీ అలాంటి ఆమె ఈ మధ్యకాలంలో తరచూ తన సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. ముఖ్యంగా మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా ప్రమోషన్స్ లో సందడి చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.

అందుకే నేను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేశా?

అలాంటి దారిలోనే ఇప్పుడు మరొక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కూడా ఏకంగా మూడు దశాబ్దాల నాటి నియమాలను ఒక వెబ్ సిరీస్ కోసం బ్రేక్ చేసింది. అయితే అలా బ్రేక్ చేయడానికి గల కారణాన్ని ఇప్పుడు బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ. ఈమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్.. తాజాగా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజోల్ మాట్లాడుతూ..” 30 ఏళ్లుగా నేను పెట్టుకున్న నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేయడానికి కారణం.. నేను పోషించిన పాత్ర. ఆ పాత్ర ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఆమె ఏం కోరుకుంటుంది? అనే దానితో ఆ సీన్ కి చాలా సంబంధం ఉంది. కేవలం అది ఒక ముద్దు మాత్రమే కాదు స్క్రీన్ ప్లే లో అది ఒక అంతర్భాగం కూడా.. ఆ సీన్ తీసేస్తే ఆ పాత్రలోని ఎమోషన్ పూర్తిగా దెబ్బతింటుంది. అందుకే ప్రొఫెషనల్ గానే నేను ఆ నిర్ణయం తీసుకున్నాను” అంటూ తన నియమాలను పక్కన పెట్టడానికి గల కారణాన్ని తెలిపి నటన పట్ల తనకున్న నిబద్ధతను మరోసారి నిరూపించుకుంది ఈ ముద్దుగుమ్మ.

మొదట్లో భయం వేసింది.. కానీ..

Advertisement

ఇదే విషయంపై ఆమె మాట్లాడుతూ..” ముద్దు సీన్ చేసేటప్పుడు షూటింగ్ సమయంలో నేను చాలా అసౌకర్యానికి గురయ్యాను . థియరీ పరంగా ఆ సీన్ బాగుంటుందని అనిపించింది. కానీ సెట్ మీద నిలబడే వరకు నేను నిజంగా ఇది చేయగలనా? అనే అనుమానాలు నాలో కలిగాయి. కానీ ఒక నటిగా ఆ సీన్ అవసరమని గుర్తించి, నా భయాన్ని నేను అధిగమించాను” అంటూ తెలిపింది.

ALSO READ:2వేలకు పైగా పాటలు.. జాను ఒక్క పాట కోసం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో తెలుసా?

తొలి ఓటీటీ సీరీస్ తో…

Advertisement

కజోల్ తన నియమాలను బ్రేక్ చేసిన వెబ్ సిరీస్ విషయానికి వస్తే. అదేదో కాదు ద ట్రయల్. ఒకప్పుడు బాలీవుడ్ లో ఎన్నో ఐకానిక్ చిత్రాలలో నటించిన ఈమె తొలిసారి 2023లో ‘ద ట్రయల్ – ప్యార్, కానూన్, ధోఖా’ సిరీస్ తో ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇందులో తన కోస్టార్ జిషు సేన్ గుప్తా తో లిప్ లాక్ సీన్లో నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక దీంతో 30 ఏళ్ల నాటి నియమాలను బ్రేక్ చేసింది అంటూ గత మూడు సంవత్సరాలుగా ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుండగా తాజాగా లిల్లీ సింగ్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈమె అసలు విషయాన్ని బయటపెట్టింది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×