E-Paper
Advertisement

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత

6 వేల పాటలు పాడిన గాయని.. కె. జమునారాణి కన్నుమూత
Advertisement

koka Jamuna Rani: తెలుగు సినీ సంగీత ప్రపంచంలో మరో విషాదం చోటుచేసుకుంది. మొన్నటికి మొన్న ప్రముఖ గాయని యస్.జానకి కన్నుమూయగా,తాజాగా  తన మధురమైన గొంతుతో ఎన్నో తరాల ప్రేక్షకులను  మెప్పించిన  ప్రముఖ నేపథ్య గాయని కె. జమునారాణి(కోకా జమునా రాణి) కన్నుమూశారు.

ఈరోజు తెల్లవారుజామున సుమారు 5:30 గంటలకు బెంగళూరులో ఆమె తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆమె మరణ వార్తతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమలతో పాటు సంగీతాభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దశాబ్దాల పాటు వేలాది పాటలతో  చిరస్థాయిగా నిలిచిన ఓ అధ్బుతమైన గాత్రం ఇక మూగబోయిందంటూ పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

also read :ఎట్టకేలకు కొట్టేశాడు.. అఖిల్ కెరీర్‌లో తొలి 100 కోట్ల సినిమా..!

1938 మే నెలలో ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన కె. జమునారాణి చిన్న వయసులోనే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె తండ్రి వరదరాజులు నాయుడు ప్రైవేట్ ఉద్యోగి , తల్లి ద్రౌపది వాయులీన విద్వాంసురాలు. కుటుంబం లోనే సంగీత వాతావరణం ఉండటంతో  ఏడేళ్ల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ప్రముఖ నటుడు, దర్శకుడు చిత్తూరు వి. నాగయ్య తాసిన ‘త్యాగయ్య’ చిత్రంలో బాల నటుల కోసం పాట పాడడం ద్వారా ఆమె సినీ ప్రయాణాన్ని మొదలెట్టింది. అనంతరం కేవలం 13 ఏళ్ల వయసులోనే కథానాయికలకు నేపథ్య గాయని‌గా అవకాశాలు అందుకోవడం ఆమె ప్రతిభకు గుర్తింపు అనే చెప్పాలి.

Advertisement

1952లో మాడ్రన్ థియేటర్స్ నిర్మించిన ‘వలయపతి’సినిమాతో హీరోయిన్‌కు పూర్తి స్థాయిలో పాట పాడిన జమునారాణి, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగు మాత్రమే కాదు… తమిళం, కన్నడం, మలయాళం, సింహళం భాషల్లో కలిపి సుమారు ఆరు వేలకుపైగా పాటలు పాడటం విశేషం..

తెలుగు సినీ చరిత్రలో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలకి ఆమె తన గొంతుని అందించారు.’ద్రోహి’, ‘భాగ్యదేవత’, ‘శభాష్ రాముడు’, ‘సౌభాగ్యవతి’ వంటి ఎన్నో క్లాసిక్ చిత్రాల్లో ఆమె పాడిన పాటలు ఇప్పటికీ అడపాదడపా వినిపిస్తూనే ఉంటాయి.ఇక సంగీత రంగంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 1998లో ప్రతిష్ఠాత్మక కళైమామణి పురస్కారంతో సత్కరించింది. ఆ తర్వాత  2002లో అరిన్యర్ అన్నాదురై అవార్డును కూడా అందజేసింది తమిళ సర్కార్. అయితే జీవితాంతం సంగీతానికే అంకితమైన జమునారాణి వివాహం చేసుకోకుండా బ్రహ్మచారిణిగానే జీవించడం గమనార్హం.

also read :జగపతిబాబు మొహానికి సర్జరీ..? అసలు ఏమైంది..!

ఇక ఆమె అంత్యక్రియలు ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరులోని కల్లహళ్లి క్రిమేటోరియంలో నిర్వహించారని సమాచారం.ఏది ఏమైనా ఎన్నో గొప్పపాటలు పాడిన కోకా జమునా రాణి గారు కన్ను మూయడం సినీ సంగీత ప్రపంచానికి తీరని లోటని చెప్పకతప్పదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×