// // Jr NTR Dragan- మళ్లీ సెట్స్ కి డ్రాగన్.. నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే? -->
E-Paper
Advertisement

Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?

Jr NTR Dragan: గొడవలు పక్కన పెట్టి.. మళ్లీ సెట్స్‌లోకి… నెక్ట్స్ షెడ్యూల్ ఎప్పుడంటే?
Advertisement

Jr NTR Dragan Next Schedule: మ్యాన్‌ ఆఫ్ మాసెస్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్‌-నీల్‌ (NTRNeel) అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది రూపొందుతోంది. దీనికి డ్రాగన్‌ అనే టైటిల్‌ ప్రచారంలో ఉంది. దేవర, వార్‌ 2 చిత్రాల తర్వాత ఎన్టీఆర్‌ నటిస్తున్న ఈ చిత్రమిది. అలాగే కేజీయఫ్‌, సలార్‌ వంటి బ్లాక్‌బస్టర్స్‌ తర్వాత ప్రశాంత్‌ దర్శకత్వంలో వహిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక సెట్స్‌పైకి వచ్చాక మూవీపై బజ్‌ పెంచుతున్నాయి. ఈ చిత్రం నుంచి వస్తున్న అప్‌డేట్స్‌ కూడా మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తున్నాయి.

ఫస్ట్ షెడ్యూల్ తారక్ లేకుండానే

Advertisement

కొన్ని రోజులుగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్స్‌ రావడం లేదు. ఫిబ్రవరిలో సెట్స్‌ పైకి వచ్చిన సినిమా మొదటి రెండు షెడ్యూల్‌ని తారక్‌ లేకుండనే చిత్రీకరించారు. మేలో జరిగిన షెడ్యూల్‌ నుంచి ఎన్టీఆర్‌ జాయిన్‌ అయ్యారు. అయితే రీసెంట్ షెడ్యూల్‌ తర్వాత షూటింగ్‌కి గ్యాప్‌ వచ్చింది. అప్పటి నుంచి మూవీ సెట్స్‌కి రాలేదు. దీనికి కారణం హీరో, డైరెక్టర్‌ మధ్య గ్యాప్‌ వచ్చిందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ లేటెస్ట్‌ బజ్‌ ప్రకారం.. డైరెక్షన్‌ విషయంలో తారక్, నీల్‌ మధ్య విభేదాలు తలెత్తాయట. మొదటి షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత వచ్చిన అవుట్‌ పుట్‌ ఎన్టీఆర్‌కు నచ్చలేదట.

హీరో-డైరెక్టర్ మధ్య మనస్పర్థలు

దీంతో కథ నరేషన్‌ టైం ఫస్ట్‌ షెడ్యూల్‌లో ఉన్న సీన్స్ ఫైనల్‌ షూట్‌కి మారాయట. ఈ విషయంలో తారక్‌ అసంతృప్తితో ఉన్నాడట. దీంతో స్క్రిప్ట్‌ లో మార్పులు చేయాలని ప్రశాంత్‌ నీల్‌కి ఎన్టీఆర్‌ సూచించాడట. అది ప్రశాంత్‌ నీల్‌కి నచ్చలేదట. దీంతో తారక్‌ చెప్పిన మార్పులు ప్రశాంత్‌ నీల్‌ నచ్చకపోవడంతో చేయనని చెప్పాడట. దీంతో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో షూటింగ్ కి బ్రేక్‌ పడింది. ఇక డ్రాగన్‌ ఆగిపోతుందా? అని ప్రచారం కూడా జరుగుతుంది. ఈ వార్తలతో తారక్‌ ఫ్యాన్స్‌ ఆందోళనలో ఉన్నారు. నిజంగానే డ్రాగన్‌ ఆగిపోయిందా? అనే సందేహాలు కూడా వస్తున్నాయి. ఈ క్రమంలోకి వారందరికి గుడ్‌న్యూస్‌ వచ్చింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రారంభం కానుందట. ఇప్పుడు హీరో–డైరెక్టర్‌ మధ్య మనస్పర్థలు తొలిగిపోయాయట.

Advertisement

Also Read: Lokesh Kanagaraj : కూలీ కూలిన ఎఫెక్ట్… చివరికి కార్తీ కూడా హ్యాండ్ ఇచ్చాడా?

కోల్ కత్తా బ్యాక్డ్రాప్ లో

నెక్ట్స్‌ షెడ్యూల్‌ ని అతి త్వరలోనే ప్లాన్‌ చేశారట. ఈ అప్‌డేట్‌తో నందమూరి అభిమానులు ఫుల్‌ ఖుష్‌ అవుతున్నారు. కాగా ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ మేకోవర్‌ అయ్యారు. బాడీ షేప్‌ పూర్తి మార్చుకని బరువు తగ్గాడు. తారక్‌ లుక్‌ పూర్తిగా మారి కొత్తగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎపిక్‌ యాక్షన్‌ డ్రామా రూపొందుతున్న ఈ సినిమా జగపతి బాబు ప్రతి కథానాయకుడిగా కనిపించబోతున్నాడు. ఇది కోల్‌కత్తా బ్యాక్‌డ్రాప్‌లో డ్రగ్స్ మాఫీయా చూట్టూ ఈ సినిమా సాగనుందట. చైనాకు డ్రగ్స్‌ మాఫీయాకు మధ్య సత్ససంబంధాల నేపథ్యంలో మూవీ ఉంటుందని సమాచారం. అందుకే ఈ చిత్రానికి డ్రాగన్‌ టైటిల్‌ని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ‌

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×