// // War 2 PreRelease Eventవామ్మో.. వార్‌ 2 ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఖర్చు అన్ని కోట్లా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే! -->
E-Paper
Advertisement

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..

War 2 PreRelease Event: వార్ 2 ప్రీ రిలీజ్ వెంట్ బడ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా? యష్‌ రాజ్ ఫిల్మ్స్ భారీగానే ఖర్చుచేసిందే..
Advertisement

Jr NTR War 2 Pre Release Event Budget: మ్యాన్‌ ఆఫ్‌ మాసెస్‌ ఎన్టీఆర్‌ వార్‌ 2 మూవీ విడుదలకు సిద్దమౌతోంది. బాలీవుడ్ దర్శకుడు అయాన్‌ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 14న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతోంది. హిందీ,తెలుగు, తమిళ్‌ భాషల్లో పాన్‌ ఇండియాగా వార్‌ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆర్‌ఆర్‌ఆర్, దేవర వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ తర్వాత తారక్‌ నటించిన చిత్రమిది. అలాగే అతడు బాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తోన్న మూవీ కావడంతో వార్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Advertisement

స్టేజ్ పై హీరోల సందడి

నిన్న జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌తో మూవీపై మరింత బజ్‌ పెరిగింది. ఈ కార్యక్రమంలో గ్రీక్‌ గాడ్‌ హృతిక్‌తో కలిసి తారక్‌ చేసిన సందడి అంతా ఇంత కాదు. ఇద్దరు బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌లో వచ్చి.. స్టేజ్‌పై కాలర్‌ ఎగిరేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. ముఖ్యంగా హృతిక్ తెలుగులో మాట్లాడి ఫ్యాన్స్‌ని ఫిదా చేశాడు. ఇక ఎన్టీఆర్‌ రెండు చేతులతో కాలర్‌ ఎగిరేసి.. వార్‌ 2తో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొడుతున్నామంటూ ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు ఇద్దరు హీరోలు ఒకరిపై ఒకరు అభిమానం చూపించు ఇచ్చిన స్పీచ్‌ ఆడియన్స్‌, ఫ్యాన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. ముందునుంచి వార్‌ 2 ప్రమోషన్స్‌ ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు.

Advertisement

షాకిస్తున్న వార్ 2 బడ్జెట్

ఎంతో హడావుడి చేస్తారనుకుంటే ట్విటర్‌లో ఇద్దరు హీరోలు సవాళ్లతో వినూత్నంగా ప్రమోషన్స్‌ చేశారు. దీంతో వార్‌ 2కి సంబంధించిన ఎలాంటి ఈవెంట్స్‌ ఉండవా? అంతా డిసప్పాయింట్‌ అయ్యారు. ముఖ్యంగా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ వార్‌ 2కి సంబంధించిన ఏదైనా ఈవెంట్‌ హైదరాబాద్‌ పెడితె బాగుండని ఆశగా ఎదురుచూశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌ నిన్న ఆదివారం(ఆగష్టు 10) మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం నిర్మాత యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్య చోప్రా భారీగా ఖర్చు పెట్టారట. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌ కోసం ఆయన కోటి డెభై లక్షలు రూపాయలు బడ్జెట్‌ కేటాయించారట.

వార్‌ 2 ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌కి అయిన ఖర్చు చూసి అంతా షాక్‌ అవుతున్నారు. కాగా YRF స్పై యూనివర్స్ నుంచి వస్తున్న చిత్రమిది. వార్‌ ఫస్ట్ పార్ట్‌ భారీ విజయం సాధించింది. దీంతో పార్ట్‌ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో కియార అద్వాని హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార పోస్టర్స్‌, టీజర్‌, ట్రైలర్‌లు మూవీ మరింత బజ్‌ పెంచాయి. ముఖ్యంగా ట్రైలర్‌లో తారక్‌ మెకోవర్‌ ఫ్యాన్స్‌ ఫిదా అయ్యారు. బీస్ట్‌ మోడ్‌లో తారక్‌ని చూసి నందమూరి అభిమానులు మురిసిపోతున్నారు. కాగా వార్‌ 2 తెలుగు రైట్స్‌ని నిర్మాత నాగవంశీ తీసుకున్న సంగతి తెలిసిందే. వార్ 2 సినిమాకు రూ. 210 కోట్ల వరకు బడ్జెట్‌ పెట్టినట్టు తెలుస్తోంది.

Also Read: Nidhhi Agerwal: అయ్యో.. పాపం నిధిని ఎంతగా ఆడుకున్నారు.. అది ప్రభుత్వ వాహనం కాదా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×