E-Paper
Advertisement

జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ

జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్ ..మధ్యలో శ్రష్టి వర్మ
Advertisement

Johnny Controversy:జానీ మాస్టర్ వర్సెస్ శేఖర్ మాస్టర్..ఇదీ గత రెండు రోజులుగా మీడియాలో హైలెట్ అవుతున్న పదం.అయితే తాజాగా వీరిద్దరి మధ్యలోకి ఎంట్రీ ఇచ్చింది శ్రష్టి వర్మ.ఇంతకీ ఈవిడ ఎవరనుకుంటున్నారా ..?ఆ మధ్య మన జానీ మాస్టర్ పోక్సో కేసులో జైలు ఊచలని లెక్కెట్టింది ఈమె విషయంలోనే .మొన్నటి వరకు జానీ భార్య , డాన్స్ మాస్టర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షురాలు అయిన సుమలత ఏకపక్షంగా వ్యవహరిస్తుందని,ఎవరికీ తెలీకుండా యూనియన్ లో బై ఎలక్షన్స్ పెట్టె ప్రయత్నం చేస్తుందంటూ ఏకంగా 10 మంది సీనియర్ డాన్సర్స్ రాజీనామా చేయడం తెల్సిందే.

వివాదంలోకి ఎంట్రీ ఇచ్చిన బీబీ జోడి విన్నర్ శ్రష్టి వర్మ

Advertisement

ఇక దాన్ని కవరప్ చేసేందుకు సుమలత, జానీ మాస్టర్ కలిసి అబ్బే అదేమంత పెద్ద ఇష్యూ కాదు, అసలు శేఖర్ మాస్టర్ తో వివాదమే లేదు, అంతా టీ కప్పులో తుఫాను, పైగా చిరు ఎంట్రీ ఇచ్చి అంత సమసిపోయేలా చేశారంటూ ప్రెస్ మీట్ పెట్టి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టె ప్రయత్నం చేశారు.కానీ అబ్బే మీరు ఊరుకుంటే నేను ఊరుకోవాలా అంటూ ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చింది బీబీ జోడి విన్నర్ శ్రష్టి వర్మ.దీంతో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయింది.

also read :కళ్లలో నీళ్లు లేకపోతే గుండెల్లో బాధ లేనట్టేనా? ఎస్. జానకి మనవరాలి ఆవేదన!

Advertisement

అసలు గొడవలు జరగలేదంటే అది అబద్దమని,అసోసియేషన్ మీటింగ్‌లో జానీ మాస్టర్ అనుచరులు జనరల్ సెక్రటరీ ఏడుకొండల శ్రీనుతో పాటు సీనియర్ డ్యాన్సర్ నాగేశ్‌లపై ఫిజికల్ గా అటాక్ చేశారని, అక్కడ గొడవలు జరగలేదని చెప్తున్న మాటలు పూర్తిగా అబద్దమని బాంబు పేల్చింది.పైగా దానికి సంబందించిన వీడియో పుటేజ్ కూడా ఉందంటూ సవాల్ విసిరింది.

అది మసులో పెట్టుకుని ఇలా కక్ష

అయితే చల్లబడింది అనుకుంటున్న వివాదాన్ని ఇపుడు శ్రష్టి వర్మ తన భుజాల మీదికి ఎత్తుకోవడానికి ఒక కారణం ఉందని వినిపిస్తుంది. అదే ఆమెని సన్మానించకపోవడం.అవును ..బీబీ జోడి’ డాన్స్ రియాలిటీ షోలో శ్రష్టి వర్మ విన్నర్ అయినందున అసోసియేషన్ తరఫున ఆమెను సన్మానించాలని సెక్రటరీ చెప్పడం,దానికి జానీ మాస్టర్ వాళ్ళు అడ్డుతగలడం తో ఇలా మండిపడుతుందట శ్రష్టి వర్మ .తన వల్లే జైలు కి వెళ్లినందున అది మసులో పెట్టుకుని ఇలా కక్ష తీర్చుకుంటున్నారని తెగ బాధ పడిపోతుంది .

ముందు ముందు ఎటు దారితీస్తుందో !

జానీ కేసు విషయానికి వస్తే.. 2024 సెప్టెంబర్ నెలలో జానీ మాస్టర్‌ తనని వేదిస్తున్నాడంటూ శ్రష్టి వర్మ ‘పోక్సో’ (POCSO) కేసు పెట్టిన సంగతి తెల్సిందే. అప్పట్లో ఈ వివాదం కారణంగా ధనుష్ సినిమా పాటకు రావాల్సిన జాతీయ అవార్డు హోల్డ్‌లో పడటం, ఆ తర్వాత జానీని గోవాలో అదుపులోకి తీసుకుని చంచల్‌గూడ జైలుకు తరలించడం, ఆపై అక్టోబర్ 2024లో తెలంగాణ… హైకోర్టు కండిషన్స్‌తో బెయిల్ ఇవ్వడం అందరికీ తెలిసిందే.చూడాలి మరి జానీమాస్టర్ vs శేఖర్ మాస్టర్ అనుకున్న వివాదం కాస్తా జానీమాస్టర్ vsశ్రష్టి వర్మ లా మారి ముందు ముందు ఎటు దారితీస్తుందో !

also read :తారక్ ,బన్నీలు సీఎం సీటుపై కన్నేశారా ? ఏపీలో సరికొత్త ‘పొలిటికల్ మల్టీస్టారర్’!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×