E-Paper
Advertisement

ఆ ‘మహాభావుడు’ ముసుగు తొలగించిన జేడీ.. భార్యను వదిలేసి గర్ల్‌ఫ్రెండ్‌తో కాపురం! సెట్స్‌కి ఫుల్లుగా తాగొచ్చి..!

ఆ ‘మహాభావుడు’ ముసుగు తొలగించిన జేడీ.. భార్యను వదిలేసి గర్ల్‌ఫ్రెండ్‌తో కాపురం! సెట్స్‌కి ఫుల్లుగా తాగొచ్చి..!
Advertisement

JD Controversy : జేడీ చక్రవర్తి….నేను గనుక నోరు తెరిచానంటే నెట్టింట్లో మంటలే అన్నట్టుగా ఉంది ఈయన గారి వాలకం.మొన్నటికి మొన్న ఒక ముసలి ప్రొడ్యూసర్ చీకటి కోణాన్ని ఆవిష్కరించిన జేడీ తాజాగా సినీ ఇండస్ట్రీలోని టాప్ హీరో అసలు రంగుని బయటపెట్టేశాడు.

అగ్గి రాజేస్తున్న కామెంట్స్

Advertisement

కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో, తరుణ్ భాస్కర్ హీరోగా వస్తున్న ‘గాయపడ్డ సింహం’ (Gaaya Padda Simham) సినిమాలో ‘బ్రూటల్ ధర్మ’ కీలకపాత్రలో నటించిన సంగతి తెల్సిందే. ఇక ఈ సినిమా రేపే అంటే మే 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న సందర్భంగా వరుస ఇంటర్వ్యూలతో హోరేత్తిస్తున్నాడు జేడీ. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇపుడు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తున్నాయ్.

అసలు విషయాలు తెలిసి మైండ్ బ్లాక్

Advertisement

జేడీ మాట్లాడుతూ ఇండస్ట్రీలో మహానుభావుడు అని చెప్పుకునే ఒక హీరోకి చాలా రెస్పెక్ట్ ఇస్తానని,కాని అతడి గురించి అసలు విషయాలు తెలిసి నా మైండ్ బ్లాక్ అయిందని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ కి తను లేట్ గా ఎందుకొస్తారని కనుక్కుంటే అతను రాత్రి బాగా తాగుతాడని, ఆమత్తు దిగకపోవడం వల్లే అలా లేట్ గా వస్తారని చెప్పడంతో షాక్ అయ్యానని తెలిపారు.అసలు అంత స్టార్ డమ్ ఉండి ఈ వయసులో అలా రెస్పాన్సిబులిటీ లేకుండా ఉండటం తనను ఆశ్చర్యపరిచిందన్నాడు.

also read :పుష్పరాజ్‌ను మించిన ‘రాకా’.. బీహార్ గడ్డపై బన్నీ రచ్చ!

భార్యని వదిలి గర్ల్ ఫ్రెండ్ తోనే కాపురం

ఇక అంతేకాదని ఆ మహానుభావుడు తన భార్యని వదిలిపెట్టి గర్ల్ ఫ్రెండ్ తోనే కాపురం పెట్టేశాడని, హోటళ్ళలో కూడా ఉండట్లేదన్న విషయం తెల్సి స్టన్ అయ్యానని తెలిపాడు. పేరుకేమో పెద్ద హీరో, నోరు తెరిస్తే చెవులకి చిల్లులు పడేలా సూక్తులని చెప్పే ఈ మహానుభావుడికి ఇంత వీక్ నెస్ ఉండటం ఏంటో అంటూ వాపోయాడు జేడీ. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆ మహానుభావుడి పేరు చెప్పకపోయినా జేడీ ఇచ్చిన హింట్స్ బట్టి ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు నెటిజన్లు.

జేడీ విషయానికి వస్తే

ఇక జేడీ చక్రవర్తి విషయానికి వస్తే ఈయన అసలు పేరు గులివాడ చక్రవర్తి. 1989 లో శివలో జేడీ గా నటించి ఆ పేరుతోనే ఇండస్ట్రీలో స్థిరపడిపోయాడు.ఇక 90s లో ఆయన కెరీర్ మంచి పీక్ చూసిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన చేసిన ‘మనీ’, ‘గులాబి’, ‘అనగనగా ఒక రోజు’ వంటి సినిమాలు అప్పట్లో ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచాయి.ఇక రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ముంబై వరల్డ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ‘సత్య’ సినిమా ఇండియన్ సినీ హిస్టరీలో ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది.

ఇక నటనతో పాటు మెగా ఫోన్ పట్టి ‘హోమం’, ‘సిద్ధం’ వంటి క్రైమ్ థ్రిల్లర్లతో డైరెక్టర్ గానూ నిరూపించుకున్నాడు.ఇక 2016లో నటి అనుకృతి శర్మను పెళ్లి చేసుకున్న ఆయన ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టి బిజీ అయ్యేందుకు ట్రై చేస్తున్నాడు.

చూడాలి మరి ఇప్పటికే వరుస కాంట్రవర్సీ స్టేట్మెంట్లతో వైరల్ అవుతున్న జేడీ ముందు ముందు ఇంకెన్ని మంటల్ని రాజేస్తాడో ! ఇది కూడా

also read :వడదెబ్బకు చెక్ పెట్టే సూపర్ డ్రింక్స్: ఒక్క గ్లాసు తాగితే చాలు.. రోజంతా ఫుల్ ఎనర్జీ!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×