E-Paper
Advertisement

Jayam movie: సదాకు ఇంకా పెళ్లే కాలేదు.. ఆమె చెల్లెలు మాత్రం రెండుసార్లు తల్లైంది..!

Jayam movie:  సదాకు ఇంకా పెళ్లే కాలేదు.. ఆమె చెల్లెలు మాత్రం రెండుసార్లు తల్లైంది..!
Advertisement

Jayam movie: వెండితెరపై కొందరు బాలనటులు తమ అమాయకపు నటనతో, క్యూట్ హావభావాలతో ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంటారు. కాలం గడిచినా వారి పాత్రలు మాత్రం అలాగే గుర్తుండిపోతాయి. ‘జయం’ సినిమాలో అక్షరాలు తిరగరాస్తూ, తనదైన మేనరిజంతో అలరించిన ఆ చిన్నారి గుర్తుందిగా? ఆ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు యామిని శ్వేత.

ఒకే ఒక్క సినిమా..
తేజ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ ‘జయం’లో హీరోయిన్ సదా చెల్లిగా నటించిన యామిని శ్వేత నాయుడు అప్పట్లో పెద్ద సెన్సేషన్. సీనియర్ నటి జయలక్ష్మి కుమార్తె అయిన యామిని, అంతకుముందే పలు సీరియల్స్‌లో నటించి మెప్పించింది. అయితే ‘జయం’ సినిమాలో అక్షరాలు తిరగరాసే అలవాటున్న అమ్మాయిగా ఆమె చేసిన అల్లరి, క్యూట్ నటనకు ఏకంగా నంది అవార్డు వరించింది.

Advertisement

హీరోయిన్ అయ్యే అవకాశం ఉన్నా..
‘జయం’ తర్వాత యామిని శ్వేతకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఆమె పదో తరగతిలో ఉన్నప్పుడే హీరోయిన్‌గా నటించే అవకాశాలు వచ్చాయట. కానీ, గ్లామర్ ప్రపంచం కంటే చదువే ముఖ్యమని భావించిన యామిని, సినిమాలకు స్వస్తి పలికింది. డిగ్రీ పూర్తి చేసి, తన భవిష్యత్తును వెతుక్కుంది.

అమెరికాలో సెటిల్..
చదువు ముగించిన యామిని, పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలో తన కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తోంది. ఆమెకు ఇద్దరు సంతానం. మొదటి సంతానంగా ఓ పాపకు జన్మనిచ్చింది యామిని శ్వేత. 2025లో తాను మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది. అక్కగా నటించిన సదా మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఒంటరిగా జీవిస్తుండగా, చెల్లులుగా నటించిన యామిని శ్వేత మాత్రం ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చింది. యామిని శ్వేత తన భర్త, పిల్లలతో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. జీవితంలోని ఈ అందమైన దశను ఎంజాయ్ చేస్తోంది.

Advertisement

సినిమాలకు దూరమైనా..
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీ ఫోటోలతో అభిమానులను అలరిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో జయం ఫేమ్, నంది అవార్డ్ విన్నర్ అని గర్వంగా రాసుకున్న యామినిని చూసి నెటిజన్లు అప్పుడే ఇంత పెద్దదైపోయిందా.. అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×