E-Paper
Advertisement

జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!

జాన్వీ కపూర్ దక్షిణాదిలోనే స్థిరపడనుందా.. మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ!
Advertisement

Janhvi Kapoor:దివంగత నటీమణి శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ సినీ రంగంలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) అక్కడి ఆడియన్స్ ను తన అద్భుతమైన నటనతో విపరీతంగా ఆకట్టుకుంది. సాధారణంగా ఒక భాష ఇండస్ట్రీలో ఉనికిని చాటుకున్నాము అంటే తమ ప్రయత్నాన్ని పక్క భాషల్లో మొదలు పెడతారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అందరిలాగే జాన్వీ కపూర్ కూడా తన నటనను తెలుగు రాష్ట్రం వైపు మళ్ళించింది. అలా తొలిసారి కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర చిత్రంలో హీరోయిన్ గా నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించింది . ముఖ్యంగా ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవ్వడమే కాకుండా తన తల్లి కోరికను కూడా నెరవేర్చింది ఈ ముద్దుగుమ్మ.

దక్షిణాదిలో మరో అవకాశం..

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ మనవడితో తన కూతురి తెలుగు సినీ ఎంట్రీ పూర్తవ్వాలని గతంలో శ్రీదేవి కోరగా.. ఆ కోరికను జూనియర్ ఎన్టీఆర్ ద్వారా నెరవేర్చుకుంది. అలా తల్లి కోరిక మేరకు తొలిసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఇందులో పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది కానీ కాస్త విమర్శలు కూడా ఎదుర్కొంది.
ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పెద్ది సినిమాలో అచ్చియమ్మ పాత్రతో మరోసారి అలరించింది. రాంచరణ్ హీరోగా నటించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది.

కోలీవుడ్ అరంగేట్రం..

ఇకపోతే ఈ రెండు చిత్రాల తర్వాత ఈమెకు మళ్ళీ తెలుగులో అవకాశాలు లేవు. ఇక బాలీవుడ్ కి మకాం మార్చనుంది అనే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో సడన్గా ఈమెకు మరో దక్షిణాది చిత్రంలో అవకాశం లభించడం విశేషం . తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. పెద్ది సినిమా తర్వాత ఇప్పుడు ఈమె కోలీవుడ్ లో అరంగేట్రం చేయనుంది. ఇప్పటికే పెద్ద సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న జాన్వీ కపూర్ కోసం ఎంతోమంది దర్శక రచయితలు సంప్రదించగా.. చివరికి ఈమె కోలీవుడ్ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సర్గుణం జాన్వీని కోలీవుడ్లోకి పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

also read:పక్కదేశంలో జక్కన్నకి అరుదైన గౌరవం.. గ్లోబల్ స్టేజ్ పై ఘర్జన!

వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు..

కలవాణి, వాగై చుడవా తదితర చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన ఎగ్జామ్ అనే వెబ్ సిరీస్ తీశారు. ఇప్పుడు మరొక వెబ్ సిరీస్ తీయడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో జాన్వీ కపూర్ ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ దర్శకుడు పా.రంజిత్ కి చెందిన నీలం ప్రొడక్షన్స్ నిర్మించినట్లు సమాచారం. కురత్తి అనే టైటిల్ కూడా ఈ వెబ్ సిరీస్ కి నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే జాన్వీ కపూర్ నటించడానికి ఒప్పుకున్న వేళ త్వరలోనే అధికారిక అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారు. మొత్తానికైతే అటు దేవర ఇటు పెద్ది చిత్రాలతో విమర్శలు అందుకున్న ఈమెను.. కోలీవుడ్ ఆడియన్స్ ఆదరిస్తారా? కనీసం అక్కడైనా తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి తమిళంలో ఎలాంటి ఫలితాలను దక్కించుకుంటుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×