E-Paper
Advertisement

‘జన నాయగన్’ సెన్సార్ అప్‌డేట్‌.. ఆ రూమర్స్ నమ్మొద్దన్న నిర్మాతలు!

‘జన నాయగన్’ సెన్సార్ అప్‌డేట్‌.. ఆ రూమర్స్ నమ్మొద్దన్న నిర్మాతలు!
Advertisement

Jana Nayagan: ఇక ఇదే నా చివరి సినిమా అంటూ అఫీషియల్ గా జననాయగన్ ని అనౌన్స్ చేశాడు దళపతి విజయ్. దాంతో మా హీరో చివరి సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్ లోకి వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ కళ్ళలో వత్తులు వేసుకొని ఈగర్ గా వెయిట్ చేశారు ఫ్యాన్స్ . కానీ దళపతి రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వడం, ఏకంగా భారీ మెజారిటీతో సీయం అవడం చక చక జరిగిపోయాయి,కానీ ఈ సినిమా చుట్టూ జరుగుతున్న సెన్సార్ రచ్చ మాత్రం ఎండ్ కార్డ్ లేకుండా సీరియల్ లా సాగుతూనే ఉంది.

అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ అప్ డేట్ కి సంబందించిన ఒక క్రేజీ న్యూస్స్ సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అవుతుంది. అవును..ఈ సినిమాకి సెన్సార్ బోర్డ్ ఇప్పటికే ‘A’ (అడల్ట్) సర్టిఫికెట్ ఇచ్చిందని,ఇక త్వరలోనే అంటే వచ్చే జులై 23న రిలీజ్ కూడా కాబోతుంది అంటూ ఊదరగొట్టేస్తున్నారు నెటిజన్లు. ఇక ఇలా ఈ సినిమాకి సంబందించిన న్యూస్ విపరీతంగా సర్క్యులేట్ అవడంతో అసలు ఇదెప్పుడు అనౌన్స్ అయిందా అంటూ డైలమాలో పడిపోయారు విజయ్ ఫ్యాన్స్.

Advertisement

అసలు విషయం చెప్పుకొచ్చిన మూవీ టీమ్

దీంతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పుకార్లకి ఎండ్ కార్డ్ వేస్తూ అసలు విషయం చెప్పుకొచ్చింది మూవీ టీమ్ .అసలు ‘జన నాయగన్’ సినిమాకి సెన్సార్ అవ్వలేదని ,ఎవరైనా ఇలాంటి రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తే వెంటనే ఖండించాలని అఫీషియల్ గా చెప్పుకొచ్చింది. అయితే సినిమాని సెన్సార్ బోర్డ్ వాళ్ళు చూసి కట్స్ చేయమని చెప్పారని ,ఇక టీమ్ కూడా ప్రస్తుతం వాటిని తొలగించే పనిలోనే ఉందని ,ఒకసారి చెప్పిన కట్స్ కంప్లీట్ అయితే మళ్ళీ అఫీషియల్ గా సెన్సార్ కి పంపుతామని క్లారిటీ ఇచ్చారు.

Advertisement

also read:800 సినిమాలు.. కోట్ల ఆస్తి.. కానీ చివరికి ఆ నటి జీవితం ఎందుకలా ?

నిజానికి ఈ సినిమా ఈ ఏడాది పొంగల్ బరిలో రాజాసాబ్ కి పోటీగా దిగాల్సిన సినిమా. ఇక మేకర్స్ కూడా విజయ్ గత హిట్స్ అయిన ‘లియో’ (2023),‘వారిసు’ (2023)ల రేంజ్ లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కూడా.కానీ సినిమాలో వివాస్పద అంశాలు ఉన్నాయని,పొలిటికల్ గా టార్గెట్ చేసేలా సీన్స్ ఉన్నాయని సెన్సార్ బోర్డ్ అబ్జెక్షన్ చెప్పడంతో మొదలైన వాయిదాల పర్వం ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది.

అసలు డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో !

హెచ్. వినోద్ దర్శకత్వంలో వస్తున్న తెరకెక్కుతున్న ఈ సినిమాలో దళపతి విజయ్ కి జోడీగా పూజాహెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే. ఇక గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బీస్ట్ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ‘జన నాయగన్’పై అంచనాలు మాత్రం భారీగానే ఉన్నాయి, ఇక ఈ సినిమాలో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ వంటి ఇంటెన్స్ సీన్స్ భగవంత్ కేసరి సినిమా నుండి తీసుకున్నారని టాక్ . చూడాలి మరి అబ్బే ఇది కాదు అసలు రిలీజ్ డేట్ అంటూ క్లారిటీ ఇచ్చిన మేకర్స్ అసలు డేట్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×