E-Paper
Advertisement

James cameron :మీ థియేటర్స్ జాగ్రత్త… ఓనర్స్‌కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ వార్నింగ్

James cameron :మీ థియేటర్స్ జాగ్రత్త… ఓనర్స్‌కి అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ వార్నింగ్
Advertisement

James cameron: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ (James cameron: ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు. జేమ్స్ కామెరున్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలలో అవతార్ ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భాషతో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. ఇప్పటికే ఈ సినిమా రెండు భాగాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకోగా త్వరలోనే మూడవ భాగం కూడా విడుదలకు సిద్ధమైంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ డిసెంబర్ 19వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

థియేటర్ టెక్నీషియన్లకు డైరెక్టర్ సలహాలు..

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.. ఇక ఈ మూడో భాగంలో ఫండోరా ప్రపంచానికి సరికొత్త విలన్ వరాంగ్ ను పరిచయం చేయబోతున్నారు. ఇక ఈ సినిమా విడుదలకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో థియేటర్ టెక్నీషియన్లకు దర్శకుడు జేమ్స్ కామెరూన్ థియేటర్ టెక్నీషియన్లకు కొన్ని ప్రత్యేకమైన సూచనలను తెలియజేస్తూ ఒక లెటర్ రాశారు ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్క్రీన్లు జాగ్రత్త..

Advertisement

అవతార్ ఫైర్ అండ్ యాష్ ను ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నాతోపాటు నా టీం కూడా చాలా ఆత్రుతగా ఉన్నామని తెలిపారు. ఇక ఈ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో లైట్ లెవెల్ ఆడియో కాన్ఫిగరేషన్ సరైన ప్రేమింగ్ గురించి కొన్ని సలహాలు ఇస్తూ ఈయన లేఖ రాశారు ఈ సినిమా సౌండ్ సిస్టంకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈయన థియేటర్ టెక్నీషియన్లకు సలహాలు ఇచ్చారు. ఇటీవల కాలంలో అధిక సౌండ్ కారణంగా స్పీకర్లు పగిలిపోవడం థియేటర్లలో స్క్రీన్స్ చినిగిపోవడం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని జేమ్స్ కామెరున్ ముందుగానే ఇలాంటి సలహా ఇచ్చారని తెలుస్తోంది.

Advertisement

అవతార్ ఫ్రాంచైజీ హాలీవుడ్ మూవీ అయినప్పటికీ భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమా ఏకంగా 3 గంటల 15 నిమిషాల నిడివితో రన్ టైం లాక్ చేయబడిందని తెలుస్తోంది. ఇక అవతార్ ఫ్రాంచైజీలో రెండవ భాగం 29వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 16 సంవత్సరాల తర్వాత మూడో భాగం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.

Also Read: Balakrishna: సింగర్‌గా మారబోతున్న నందమూరి నటసింహం… బాహుబలి రేంజ్‌లో ప్లానింగ్?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×