E-Paper
Advertisement

ట్రోలింగ్‌పై జగపతి బాబు సీరియస్.. అందుకు తారక్ ఏడుస్తున్నట్లు క్రియేట్ చేసి..

ట్రోలింగ్‌పై జగపతి బాబు సీరియస్.. అందుకు తారక్ ఏడుస్తున్నట్లు క్రియేట్ చేసి..
Advertisement

Social Media Trolls: టాలీవుడ్ సీనియర్ నటుడు, జగ్గూభాయ్ జగపతి బాబు ఎల్లప్పుడూ ముక్కుసూటిగా, ఓపెన్‌గా మాట్లాడటంలో ముందుంటారు. ఇంటర్వ్యూ ఏదైనా సరే.. దాపరికం లేకుండా నిజాలను పంచుకోవడం ఆయన శైలి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. సోషల్ మీడియా ట్రోలింగ్, గతంలో తనపై వచ్చిన ఫేక్ డెత్ రూమర్స్, అలాగే సినీ పరిశ్రమలో నటీనటుల ప్రవర్తనపై చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read also-వేల కోట్ల స్కామ్ లో సన్నీ లియోన్.. కర్ణాటక సీఐడీ నోటీసులు..

పనిలేని వాళ్లే ట్రోల్స్ చేస్తారు..!

Advertisement

ప్రస్తుత డిజిటల్ కాలంలో సెలబ్రిటీలపై జరుగుతున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జగపతి బాబు ఘాటుగా స్పందించారు. “సోషల్ మీడియాలో కూర్చొని ట్రోల్స్ చేసేవాళ్లంతా పనిలేని వాళ్లు. అలాంటి వాళ్లకు వేరే పనేమీ ఉండదు” అంటూ తనదైన శైలిలో విమర్శించారు. తాను ఇలాంటి వాటిని అస్సలు పట్టించుకోనని, వాటికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని తేల్చి చెప్పారు.

‘నేను చనిపోయినట్లు ఎడిట్ చేశారు..’
గతంలో తనపై వచ్చిన ఒక భయంకరమైన ఫేక్ న్యూస్‌ను ఈ సందర్భంగా జగపతి బాబు గుర్తు చేసుకున్నారు. “ఒకానొక సమయంలో నేను చనిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. అంతటితో ఆగకుండా.. నా భౌతికకాయాన్ని చూసి జూనియర్ ఎన్టీఆర్ (తారక్)తో పాటు మరికొందరు సినీ ప్రముఖులు వెక్కివెక్కి ఏడుస్తున్నట్లు కొన్ని ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ (ఎడిట్) చేసి పోస్ట్ చేశారు” అని చెప్పారు. అయితే, ఆ ఒక్క చేదు అనుభవం మినహాయిస్తే.. ఆ తర్వాత లక్కీగా తనపై ఎలాంటి నెగిటివ్ ట్రోల్స్ రాలేదని, ప్రేక్షకులు తనను ఎప్పుడూ గౌరవిస్తూనే ఉన్నారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Read also-Godavari Serial : ‘గోదావరి’ శంకర్ నారాయణ రియల్ లైఫ్.. ఒక్కరోజు రెమ్యూనరేషన్..?

సినిమాల్లో నటిస్తే చాలు..

సినీ సెలబ్రిటీల లైఫ్ స్టైల్, రియల్ లైఫ్ ప్రవర్తనపై కూడా జగ్గూభాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మనం సినిమాల్లో ఎలాగూ నటిస్తూనే ఉంటాం. మళ్లీ బయటి ప్రపంచంలో, నిజ జీవితంలో కూడా నటించాల్సిన అవసరం ఏముంది? చాలామంది ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ముసుగులు వేసుకుంటారు, అబద్ధాలు చెప్తారు. కానీ నిజం చెప్పి కూడా సమాజంలో ధైర్యంగా బతకొచ్చు. నేను ఎప్పుడూ నిజాలనే మాట్లాడుతాను” అని స్పష్టం చేశారు.

ఏదేమైనా, నెగిటివిటీని లైట్ తీసుకుంటూ, ముక్కుసూటిగా నిజాయితీగా బతకడమే తన ఫిలాసఫీ అని జగపతి బాబు మరోసారి నిరూపించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అటు సినీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×