E-Paper
Advertisement

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఇదేనా? సాంగ్ తో హింట్ ఇచ్చిన జక్కన్న!
Advertisement

SSMB 29: మహేష్ బాబు(Magesh Babu), రాజమౌళి (Rajamouli)కాంబినేషన్ లో రాబోతున్న సినిమా కోసం ఇండియన్ సినీ ఇండస్ట్రీ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా సక్సెస్ అందుకున్నారు. రాజమౌళి డైరెక్షన్లో నుంచి సినిమా వస్తుంది అంటే ఈ సినిమాపై హాలీవుడ్ స్థాయిలో కూడా అంచనాలు ఏర్పడి ఉంటాయి. ఇక ప్రస్తుతం మహేష్ బాబుతో రాజమౌళి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతూ రాజమౌళి షూటింగ్ పనులను పూర్తి చేస్తున్నారు.

గ్లోబ్ ట్రాటర్ ..

ఈ సినిమా టైటిల్ కి సంబంధించి గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ సినిమాకు వారణాసి అనే టైటిల్ పెట్టబోతున్నారని అందరూ భావించారు కానీ తాజాగా ఈ సినిమా కోసం మరో టైటిల్ వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా టైటిల్ లాంచ్ కార్యక్రమాన్ని రామోజీ ఫిలిం సిటీలో ఎంతో ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. గ్లోబ్ ట్రాటర్ (Globe Trotter)గా ఈ కార్యక్రమం ఇప్పటివరకు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే జరగని విధంగా నిర్వహించబోతున్నారు. అయితే తాజాగా గ్లోబ్ ట్రాటర్ కు సంబంధించి పాటను విడుదల చేయగా ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంచారి టైటిల్ పెట్టబోతున్నారా?

Advertisement

ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా ఈ పాటను విడుదల చేయడంతో అభిమానులు ఎంతో సర్ప్రైజ్ అయ్యారు. ఈ పాట సంచారి అంటూ మొదలు కావడంతో ఈ సినిమాకు రాజమౌళి “సంచారి”(Sanchari) అనే టైటిల్ పెట్టబోతున్నారా? అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఓ అడ్వెంచరస్ మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సంచారి టైటిల్ సరిగ్గా సరిపోతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. అయితే ఈ టైటిల్ కి సంబంధించి ఊహగానాలు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

ట్రెండింగ్ లో SSMB 29సాంగ్..

Advertisement

గ్లోబ్ ట్రాటర్ కు సంచారి కాస్త దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇదే టైటిల్ పెట్టవచ్చని అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే నవంబర్ 15వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టైటిల్ తో పాటు మూడు నిమిషాల వ్యవధితో ఒక గ్లింప్ వీడియోని కూడా విడుదల చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇక తాజాగా విడుదలైన సంచారి అనే పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. కీరవాణి సంగీత సారథ్యంలో నటి శృతిహాసన్(Shruthi Hassan) ఆలపించిన ఈ పాట అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇలా ఎలాంటి అనౌన్స్మెంట్ లేకుండా సినిమా నుంచి బిగ్ అప్డేట్ రావడంతో మహేష్ బాబు అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక ఈ ఐదు రోజుల వ్యవధిలో రాజమౌళి ఇంకా ఎలాంటి సర్ ప్రైజ్ లు ఇవ్వబోతున్నారు తెలియాల్సి ఉంది.

Also Read: Mowgli: సుమ కొడుకు కోసం రంగంలోకి ఎన్టీఆర్.. టీజర్ ముహూర్తం ఫిక్స్ !

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×