E-Paper
Advertisement

Peddi Movie: పెద్ది – దేవర మూవీలు ఒకటేనా?

Peddi Movie: పెద్ది – దేవర మూవీలు ఒకటేనా?
Advertisement

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు కలయికలో వస్తున్న ‘పెద్ది’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ, ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక వింత చర్చ మొదలైంది. ఈ సినిమా కథకు, ఎన్టీఆర్ నటించిన ‘దేవర’కు దగ్గరి పోలికలు ఉన్నాయంటూ గాసిప్స్ వినిపిస్తున్నాయి. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయాలని చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు ఈ పోలికలు ఇప్పుడు పెద్ద టెన్షన్‌గా మారాయి. అసలు ఈ రెండు సినిమాల మధ్య ఉన్న ఆ కామన్ పాయింట్స్ ఏంటో చూద్దాం.

రెండు ఊర్ల గొడవ.. మళ్లీ అదే కథా?:

దేవర సినిమాలో మనం ఇప్పటికే సముద్ర తీరంలోని రెండు ఊర్ల మధ్య జరిగే భీకర పోరాటాన్ని చూశాం. ఇప్పుడు ‘పెద్ది’ సినిమాలో కూడా దాదాపు అదే తరహాలో రెండు గ్రామాల మధ్య నడిచే గొడవలే ప్రధాన ఇతివృత్తం అని టాక్ నడుస్తోంది. ఇక అయితే దేవరలో సముద్రపు వేట చుట్టూ కథ తిరిగితే, పెద్దిలో మాత్రం మట్టి వాసన కొట్టే కుల రాజకీయాలు, ఆధిపత్య పోరు హైలైట్‌గా ఉండబోతున్నాయట. ఈ పాత మసాలాను మళ్లీ ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

సమస్య పరిష్కారానికి క్రికెట్.. కొత్తగా ఉందా?:

Advertisement

పెద్ది సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఊర్ల మధ్య ఉన్న గొడవలను సెటిల్ చేయడానికి ‘క్రికెట్’ మ్యాచ్‌ను వాడుకుంటారట. మ్యాచ్ గెలిచిన ఊరికే నీటి వనరులపై అధికారం ఉంటుందనే పాయింట్‌తో కథ నడుస్తుందని ప్రచారం జరుగుతోంది. వినడానికి ఇది కొత్తగా ఉన్నా, గతంలో ‘లగాన్’ వంటి సినిమాల్లో ఇలాంటి స్పోర్ట్స్ డ్రామా చూసేసి ఉన్నాం. బుచ్చిబాబు ఈ పాత ఫార్ములాను ఎంత కొత్తగా ప్రెజెంట్ చేస్తారో అని ఫ్యాన్స్ భయపడుతున్నారు.

రెహమాన్ మ్యూజిక్.. క్లాస్ వర్కౌట్ అవుతుందా?:

ఈ పీరియాడికల్ రూరల్ యాక్షన్ డ్రామాకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటల్లో ఒకటి సూపర్ హిట్ అవ్వగా, మరొకటి పర్వాలేదనిపించింది. అయితే, ఊర మాస్ యాక్షన్ సీక్వెన్స్‌లకు రెహమాన్ ఇచ్చే క్లాస్ మ్యూజిక్ సెట్ అవుతుందా లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక మాస్ ఆడియన్స్‌ను ఉర్రూతలూగించే బీట్స్ పడకపోతే, సినిమా ఫలితంపై ప్రభావం పడే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

గేమ్ ఛేంజర్ భయం.. బుచ్చిబాబు ఏం చేస్తాడో?:

Advertisement

రామ్ చరణ్ ఫ్యాన్స్‌ను వేధిస్తున్న మరో పెద్ద టెన్షన్ ‘గేమ్ ఛేంజర్’ అనుకున్న స్థాయి లో ఆడలేదు.ఇక ‘పెద్ది’ అయినా సాలిడ్ హిట్‌గా నిలవాలని వారు కోరుకుంటున్నారు. బుచ్చిబాబు తన ఫస్ట్ మూవీ ‘ఉప్పెన’తో మ్యాజిక్ చేసినా, ఇలాంటి భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాను ఎలా డీల్ చేస్తారో చూడాలి. కథలో పాత వాసనలు ఉన్నా, టేకింగ్‌లో కొత్తదనం ఉంటేనే చరణ్ బాక్సాఫీస్ రికార్డులు ఇరగదీయడం సాధ్యమవుతుంది.

సినిమా విడుదలయ్యే వరకు ఈ పోలికలు, టెన్షన్లు తప్పవు. ఒకవేళ దేవర ఛాయలు ఉన్నా, బుచ్చిబాబు తనదైన శైలిలో రామ్ చరణ్‌ను చూపిస్తే మాత్రం థియేటర్లు దద్దరిల్లడం ఖాయం. మరి ‘పెద్ది’ మెగా ఫ్యాన్స్ ఆశలను నిజం చేస్తుందో లేదో వేచి చూడాలి!

 

also read: Niharika Konidela: అకీరా ఎంట్రీపై నిహారిక క్లారిటీ.. రూమర్స్ కి చెక్.. షాక్ లో ఫ్యాన్స్!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×