E-Paper
Advertisement

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 లో మాధవన్ .. ఒక్క పోస్టుతో లీక్ చేసిన హీరో?

SSMB 29: ఎస్ఎస్ఎంబి 29 లో మాధవన్ .. ఒక్క పోస్టుతో లీక్ చేసిన హీరో?
Advertisement

SSMB 29: ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీ మొత్తం రాజమౌళి(Rajamouli) మహేష్ బాబు (Mahesh Babu)కాంబోలో రాబోతున్న సినిమా గురించే చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టైటిల్ రివిల్ చేయబోతున్న నేపథ్యంలో ఎంతో ఘనంగా గ్లోబ్ ట్రాటర్(Globe Trotter) వేడుకను నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15వ తేదీ ఈ కార్యక్రమం రామోజీ ఫిలిం సిటీలో ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇక ఈవెంట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి సినిమాకి సంబంధించిన వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి పృథ్వీరాజ్ సుకుమారన్(Pruthvi Raj Sukumaran) కుంభ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

పృథ్వీరాజ్, ప్రియాంక పోస్టర్ల పైప్ మాధవన్ కామెంట్స్..

ఇకపోతే ఇటీవల ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మందాకిని పాత్రను పరిచయం చేస్తూ ఆమె పస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇలా ఈ సినిమా నుంచి వీరిద్దరి పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల కావడంతో ఈ పోస్టర్లపై కోలీవుడ్ స్టార్ హీరో మాధవన్ (Madhavan)స్పందించారు. ఈ సందర్భంగా ఆయన కుంభ పోస్టర్ పై స్పందిస్తూ…” ఈ లుక్ చాలా అద్భుతంగా ఉంది బ్రదర్ ఈ ప్రపంచం మిమ్మల్ని ఈ పాత్రలో చూసే వరకు వేచి ఉండలేకపోతున్నాను” అంటూ కుంభ పాత్ర పై ఈయన స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇక తాజాగా ప్రియాంక చోప్రా మందాకిని పోస్టర్ పై కూడా ఈయన స్పందించారు.

నమ్మశక్యంగా లేదు..

Advertisement

ఈ సందర్భంగా ప్రియాంక చోప్రా ఫస్ట్ పోస్టర్ పై స్పందిస్తూ..”వావ్వావ్వావ్వావ్వావ్ ఆండీ బ్రిలియంట్.. వాట్ ఎ లుక్ , ఇంపాక్ట్ రోజురోజుకు మీరు నమ్మలేని విధంగా మారిపోతున్నారు” అంటూ ప్రియాంక చోప్రా పోస్టర్ పై కూడా ఈయన స్పందించారు. ఇలా ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఈ రెండు పోస్టర్లపై మాధవన్ స్పందించడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడమే కాకుండా సరికొత్త అనుమానాలకు బీజం పోతుంది. గత కొద్దిరోజులుగా రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో మాధవన్ కూడా నటించబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి.

మహేష్ బాబుకి తండ్రిగా మాధవన్?

Advertisement

ఈ సినిమాలో మాధవన్ మహేష్ బాబుకి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఈ వార్తల పై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడ లేదు. తాజాగా ఈ రెండు పోస్టర్లపై మాధవన్ స్పందించడంతో ఈయన ఈ సినిమాలో భాగం కాబోతున్నారని స్పష్టంగా తెలుస్తోందని అభిమానులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక సినిమాలో ఎవరైనా నటిస్తేనే ఆ సినిమాకు సంబంధించిన అంశాలపై స్పందిస్తారు . ఈ తరుణంలోనే మాధవన్ కూడా స్పందించడంతో ఈయన ఈ సినిమాలో భాగం కాబోతున్నారనే విషయాన్ని ఈ విధంగా లీక్ చేశారు అంటూ అభిమానులు భావిస్తున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే చిత్ర బృందం అధికారకంగా ప్రకటించాల్సి ఉంటుంది.

Also Read: Thalaivar173: షాకింగ్ ట్విస్ట్.. రజిని సినిమా నుంచి తప్పుకున్న డైరెక్టర్ సుందర్ ..ఏమైందంటే?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×