// // Jr NTR - ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే... ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ? -->
E-Paper
Advertisement

Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?

Jr NTR: ఎన్టీఆర్ కాలర్ కథ ఇదే… ఎత్తిన ప్రతిసారి రిజల్ట్ ఎలా ఉందంటే ?
Advertisement

Jr NTR Collar Sentiment: ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ తర్వాత వార్‌ 2పై ఒక్కసారిగా బజ్‌ పెరిగింది. దీనికి కారణం ఎన్టీఆర్‌. ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ చేసిన సందడి అంత ఇంత కాదు. ముఖ్యంగా ఆయన కాలర్‌ ఎత్తిన జెస్చర్‌ ప్రతిఒక్కరి ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఫ్యాన్స్‌ మాత్రం వార్‌ 2 ఇక డబుల్‌ బ్లాక్‌బస్టర్‌ అంటున్నారు. మొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న వార్‌ 2 టీం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ఒక్కసారిగా హైప్‌ క్రియేట్‌ చేసింది. నువ్వా–నేనా అంటూ ఎన్టీఆర్, హృతిక్ రోషన్‌ ట్విటర్‌ వార్‌ కు దిగారు. ఒకరికి ఒకరు సవాలు చేసుకుంటున్న వినూత్నంగా ప్రమోషన్స్‌ చేశారు. దీంతో అంతా అభిమానులు వార్‌ 2 ఏంటీ ఇలాంటి ప్రమోషన్స్‌ చేస్తోందని, ఈవెంట్స్ ఏం లేవా? అనుకున్నారు. కానీ, సైలెంట్‌ గా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ పెట్టి తెలుగులో ఒక్కసారిగా బజ్‌ పెంచారు.

Advertisement

తారక్ కాలర్ కథ ఇది..

ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ రెండు కాలర్లు ఎత్తి ఫ్యాన్స్‌లో జోష్ నింపాడు. దీంతో ఫ్యాన్స్‌ అంతా తారక్‌ కౌంటర్‌ మామూలుగా లేదంటూ మురిసిపోతారు. మా తారక్‌ అన్న ఎప్పుడు కాలర్‌ ఎత్తిన మూవీ హిట్‌.. ఈసారి రెండు కాలర్లు ఎత్తాడంటూ వార్‌ 2 ఇండస్ట్రీ హిట్టే అంటూ అభిమానులు కాలర్‌ ఎగిరేస్తున్నారు. నిజానికి ఎన్టీఆర్‌ ఏ సినిమా రిలీజ్‌ అయినా యాంటీ ఫ్యాన్స్‌ నుంచి సోషల్‌ మీడియాలో విపరితీమైన ట్రోల్స్‌ వస్తుంటాయి. ఆర్‌ఆర్ఆర్ తర్వాత ఇది మరి ఎక్కవైంది. కానీ, తారక్ సైలెంట్‌గా ఉంటూ మూవీ ఈవెంట్స్‌ కాలర్‌ ఎత్తి ట్రోలర్స్‌ కి గట్టి కౌంటర్‌ ఇస్తుంటాడు. అలా కాలర్‌ ఎత్తిన ప్రతిసారి ఎన్టీఆర్‌ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టాడు. ఇంతకి ఈ కాలర్‌ కథేంటి, ఏ సినిమా నుంచి ఈ ట్రెండ్‌ మొదలైందో చూద్దాం. 

Advertisement

జనతా గ్యారేజ్ తో స్టార్ట్

కాగా గతంలో ఎన్టీఆర్‌ జనతా గ్యారేజ్ మూవీ టైంలో కాలర్‌ ఎత్తారు. 2016లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్‌ హిట్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఎన్టీఆర్‌ ఫస్ట్‌టైం కాలర్‌ ఎత్తాడు. అప్పట్లో అది హాట్‌ టాపిక్‌ అయ్యింది. తారక్‌ కాలర్‌ ఎత్తడంతో ఈవెంట్‌ మొత్తం ఫ్యాన్స్‌ అరుపులు, ఈళలతో మారుమోగింది. అయితే దీనిపై యాంటి ఫ్యాన్స్‌ నుంచి విపరీతమైన ట్రోల్స్‌ వచ్చాయి. తీరా ట్రోలర్స్‌ నోళ్లకు మూతపడింది. మూవీ సూపర్‌ హిట్‌గా నిలిచింది.

ఆర్ఆర్ఆర్,దేవరకు రిపీట్

అదే సేమ్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్’‌ మూవీకి రిపీట్‌ అయ్యింది. ఈ మూవీ ఎన్టీఆర్‌పై ఎంతగా ట్రోల్స్‌, విమర్శలు వచ్చాయో తెలిసిందే. రాజమౌళి దర్శత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌లు ప్రధాన పాత్రలో మల్టీస్టారర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదల టైంలో తారక్‌పై ట్రోల్స్‌ వచ్చాయి. ఈ ఇద్దరు హీరోల ఫ్యాన్స్‌ మధ్య వార్‌ కూడా నడించింది. మా హీరో లీడ్‌ హీరో అంటే మా హీరో లీడ్‌ హీరో అంటూ వాదించుకున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్‌ తారక్‌ను విపరీతంగా ట్రోల్‌ చేశారు. అయితే ఈ మూవీ బెంగళూరు, హైదరాబాద్‌లో జరిగిన ఈవెంట్‌లో తారక్‌ తన ఎనర్జీ, పవర్ఫుల్‌ స్పీచ్‌తో ఫ్యాన్స్‌లో జోష్‌ నింపాడు. అయితే ఈవెంట్‌లో ఎక్కడ ఎన్టీఆర్‌ కాలర్‌ ఎగిరేసినట్టుగా ఎక్కడ కనిపించలేదు. కానీ, అభిమానులు మాత్రం ఆయన సిగ్నేచర్‌ జెస్చర్‌తో ఫ్యాన్స్‌ ఈవెంట్స్‌లో హంగామా చేశారు.

అలాగే దేవర పార్ట్‌ మూవీ ప్రమోషన్స్‌ టైంలో కూడా తారక్‌ కాలర్‌ ఎత్తడంపై పెద్ద చర్చ జరిగింది. దేవర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ సెప్టెంబర్ 22, 2024, హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో తారక్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి అభిమాని కాలర్‌ ఎత్తి గర్వపడతారని హైప్‌ పెంచాడు. అయితే ఈ ఈవెంట్‌లో తారక్‌ ఎక్కడ కాలర్‌ ఎగిరేసినట్టు లేదు. కానీ, తన స్టేట్‌మెంట్‌తో మూవీపై ఫుల్‌ హైప్‌ పెరిగింది. దీనికి ఎన్టీఆర్‌ కాలర్‌ ఎత్తాడు అనేంతగా ప్రచారం జరిగింది. ఫైనల్‌గా దేవర కూడా మంచి విజయం సాధించింది. తాజాగా వార్‌ 2లో తారక్‌ ఒక్క చేతితో కాదు రెండు చేతులతో కాలర్‌ ఎత్తి వార్‌ 2పై భారీ హైప్‌ పెంచాడు. తారక్‌ మాత్రమే కాదు.. హృతిక్ రోషన్ కూడా ఎన్టీఆర్‌తో కలిసి కాలర్‌ ఇద్దరు. ఇద్దరి హీరో సిగ్నేచర్‌ జెస్చర్‌తో స్టేడియం మొత్తం మారుమ్రోగింది. ఇక వార్‌ 2 కూడా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అంటూ అభిమానులంత కాలర్‌ ఎగిరేస్తున్నారు. ఇలా ఎన్టీఆర్‌ ప్రతి మూవీ రిలీజ్‌ సమయంలో కాలర్‌ ఎగిరేయడం, కాలర్‌ ఎత్తడం అభిమానులకు సెంటిమెంట్‌గా మారింది.

Also Read: Coolie Ticket Rates: రజనీకాంత్ కూలీ క్రేజ్… ఒక్క టికెట్ ధర రూ.4500

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×