E-Paper
Advertisement

Tollywood Hero: కోలీవుడ్ కి ఆ లోటు తీర్చే టాలీవుడ్ హీరో ఎవరంటే..?

Tollywood Hero: కోలీవుడ్ కి ఆ లోటు తీర్చే టాలీవుడ్ హీరో ఎవరంటే..?
Advertisement

Allu Arjun Tamil Movies: ఇప్పటి కోలీవుడ్ పరిస్థితి చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇండస్ట్రీలో పెద్ద స్టార్‌ల కొరత బాగా ఉంది. ఒకప్పుడు విజయ్, అజిత్, సూర్య లాంటి స్టార్ హీరోలు ఉండగా నిర్మాతలకు పెద్ద బడ్జెట్ సినిమాలు చేయడానికి ధైర్యం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా తలపతి విజయ్ రాజకీయాల్లోకి వెళ్లడం కోలీవుడ్‌కు పెద్ద షాక్‌లా మారింది.
విజయ్ పూర్తిగా రాజకీయాల్లోకి వెళ్లిపోయిన తర్వాత, నిర్మాతలు “ఈ హీరో మీద 300-400 కోట్ల బడ్జెట్ పెట్టొచ్చా?” అని ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది.

కోలీవుడ్ లో ఈ కొరత తీరుతుందా..

అజిత్ ఇంకా సినిమాలు చేస్తున్నారు కానీ ఒకేసారి అన్ని రకాల కథలు చేయడం అజిత్ వల్ల కూడా కాదు. ఇక సూర్యని కూడా కమర్షియల్‌గా పూర్తిగా సేఫ్ ఆప్షన్‌గా నిర్మాతలు భావించడం లేదు. ఇక్కడే కోలీవుడ్‌లో ఒక కొరత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ వినపడుతున్న ఒకే ఒక్క పేరు రజినీకాంత్. క్రేజ్ ఇప్పటికీ తగ్గని హీరో రజినీ. కానీ వయసు కారణంగా ఆయన అన్ని జానర్స్‌లో, అన్ని రకాల కథల్లో కనిపించడం కష్టమే. ఒకప్పుడు లాగా వరుసగా సినిమాలు చేయడం కూడా సాధ్యం కాదు. అందుకే కోలీవుడ్‌కు ఒక బలమైన స్టార్ అవసరం ఉంది.
కోలీవుడ్‌లో ఖాళీగా ఉన్న ఈ స్థానాన్ని ఇప్పుడు టాలీవుడ్ హీరో ఒకరు ఆక్రమించనున్నారు. అదే అల్లు అర్జున్.

తమిళనాడు లో పుష్ప మోత మాములుగా ఉండదు..

Advertisement

‘పుష్ప’ సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు తమిళనాడులో వచ్చిన క్రేజ్ మామూలుగా లేదు. క్లాస్ థియేటర్ల దగ్గర నుంచి మాస్ ప్రాంతాల వరకూ బన్నీకి ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. “పుష్ప రాజ్” అనే పేరు తమిళ యువతలో ఒక ట్రెండ్‌లా మారిపోయింది.
ఇప్పుడైతే తమిళ్ డైరెక్టర్లు పెద్ద బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తే ఫస్ట్ ఛాయిస్‌గా అల్లు అర్జున్ పేరు వినిపిస్తోంది. ఇది చిన్న విషయం కాదు. ఓ తెలుగు హీరోకి కోలీవుడ్‌లో ఇలాంటి క్రేజ్ రావడం అరుదైన విషయం. బన్నీ స్టైల్, డాన్స్, మాస్ అప్పీల్, పాన్ ఇండియా రేంజ్ ఫేమ్ ఇవన్నీ నిర్మాతలకు పెద్ద ప్లస్‌గా మారాయి.

ఇప్పుడు అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ విషయానికి వస్తే, అంచనాలు ఇంకా పెరిగిపోతున్నాయి. బన్నీ ఇకపై చేయబోయే సినిమాలు పూర్తిగా పాన్ ఇండియా ఫోకస్‌తోనే ఉంటాయని స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీతో అల్లు అర్జున్ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా పాన్ ఇండియా రేంజ్‌లో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాలనే ప్లాన్ నడుస్తోంది. అట్లీ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ స్టైల్ కలిస్తే కోలీవుడ్ టాలీవుడ్ బౌండరీలు కూడా పూర్తిగా చెరిగిపోతాయనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది.

Advertisement

అదే సమయంలో టాలీవుడ్‌లో బన్నీ త్రివిక్రమ్‌తో మరో సినిమా కూడా లాక్ అయ్యిందనే టాక్ ఉంది. ఒకవైపు తమిళ డైరెక్టర్‌లతో, మరోవైపు తెలుగులో కూడా భారీ ప్రాజెక్ట్ లతో అల్లు అర్జున్ తన కెరీర్‌ను చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. కోలీవుడ్ నిర్మాతలు కూడా బన్నీ వైపే చూస్తున్నారు. రాబోయే సంవత్సరాల్లో తమిళనాడులో కూడా అల్లు అర్జున్ పేరు ఇంకా గట్టిగా వినిపించడం ఖాయం అనడం అతిశయోక్తి కాదు.

ALSO READ: Prabhas: రాజా సాబ్ హైప్ కోసం పెద్ద లెవెల్ ప్లాన్ వేసిన ప్రభాస్..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×