E-Paper
Advertisement

The Raja Saab Heroines: హీరోయిన్లు ముగ్గురు కాదు… 8 మంది.. అయినా నో యూజ్

The Raja Saab Heroines: హీరోయిన్లు ముగ్గురు కాదు… 8 మంది.. అయినా నో యూజ్
Advertisement

The Raja Saab Heroines:టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధిక పాన్ ఇండియా చిత్రాలలో నటించి.. పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు సంపాదించిన ప్రభాస్(Prabhas).. తాజాగా డైరెక్టర్ మారుతి (Maruthi) దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమాతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హర్రర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా అటు ఆడియన్స్ నే కాదు ఇటు అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించగా.. అంతే స్థాయిలో నటీనటులు కూడా భాగమయ్యారు. ప్రభాస్ కి జోడిగా నిధి అగర్వాల్, రిద్దీ కుమార్, మాళవిక మోహనన్ నటించిన విషయం తెలిసిందే.

ముగ్గురు కాదు ఏకంగా 8 మంది..

ఇకపోతే ఈ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఇందులో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారని చెప్పారు కానీ.. మిగతా సినిమాల చిన్న హీరోయిన్స్ ని కూడా యాడ్ చేస్తున్నట్లు ఎక్కడా రివీల్ చేయలేదు.. కానీ సడన్గా ఏకంగా ఈ ముగ్గురితో పాటు మరో ఐదు మంది హీరోయిన్స్ ని కూడా ఇందులో నటింపచేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇకపోతే మిగిలిన 5 మంది హీరోయిన్స్ విషయానికొస్తే.. ఇందులో నానమ్మ పాత్రలో ఒకప్పటి హీరోయిన్ జరీనా వహాబ్ నటించారు. ఈమె తోపాటు ప్రముఖ తమిళ హీరోయిన్ అమ్ము అభిరామి, ఇనయా సుల్తానా, ఆనంది, మనీషా కందుకూర్ ఈ సినిమాలో ఫ్రెండ్ క్యారెక్టర్ లో కనిపించారు. ఇలా మొత్తంగా ముగ్గురు కాదు ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు ఈ సినిమాలో భాగమయ్యారు.

8 మంది హీరోయిన్స్ అయినా నో యూజ్ ..

Advertisement

ఇకపోతే ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది హీరోయిన్లు ఇందులో నటించారు. కానీ ఏ ఒక్కరు కూడా సినిమాను పీక్స్ కి తీసుకెళ్లే ప్రయత్నం చేయలేకపోయారు. మొత్తానికైతే మారుతీ ప్లాన్ ఏమాత్రం వర్కౌట్ కాలేదని స్పష్టం అవుతుంది.

ALSO READ:Jana Nayagan: హైకోర్టు తీర్పు ఇచ్చినా.. మళ్లీ చిక్కుల్లో జన నాయగన్‌

ది రాజాసాబ్ పార్ట్ 2 కూడా..

Advertisement

ఇకపోతే ఎన్నో అంచనాల మధ్య భారీ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షో తోనే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని.. ఈ సినిమాతోనే టాలీవుడ్ సేఫ్ జోన్ లోకి వెళ్తుందని సినీ విశ్లేషకులు కూడా ఎంతగానో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. కానీ మొదటి సినిమానే ఇలా మిక్స్డ్ తెచ్చుకోవడంతో అందరూ డీలా పడిపోతున్నారు. దీనికి తోడు సంక్రాంతికి విడుదలైన మొదటి సినిమా అయినప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. పైగా ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంటుందని క్లైమాక్స్ లో రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి రాజాసాబ్ సర్కస్: 1935 అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు. ఇందులో ప్రభాస్ జోకర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఇది సీక్వెల్ లేక ప్రీక్వెల్ అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×