E-Paper
Advertisement

IBomma Ravi: తప్పు ఒప్పుకున్న ఐ బొమ్మ రవి… విచారణలో ఏం చెప్పాడంటే?

IBomma Ravi: తప్పు ఒప్పుకున్న ఐ బొమ్మ రవి… విచారణలో ఏం చెప్పాడంటే?
Advertisement

I Bomma Ravi: ఐబొమ్మ రవి ప్రస్తుతం చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. కోర్టు ఈయనకు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. సినిమా పైరసీలో భాగంగా రవి నుంచి మరింత కీలక సమాచారం రాబట్టడం కోసం పోలీసులు ఐదు రోజులపాటు విచారణ కోరుతూ కోర్టు అనుమతి తీసుకున్నారు. ఇక రెండవ రోజు విచారణ పూర్తి అయింది. రెండవ రోజు విచారణలో భాగంగా రవి కొని కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం. ఈ విచారణలో భాగంగా రవి పోలీసులకు పెద్దగా సహకరించలేదని తెలుస్తోంది. రవి కొన్ని విషయాల గురించి మాట్లాడటానికి నిరాకరించినట్టు సమాచారం.

డబ్బుల కోసమే బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్..

ఈ రెండవ రోజు విచారణలో భాగంగా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. అయితే తాను డబ్బు కోసమే బెట్టింగ్ యాప్ (Betting App) ప్రమోట్ చేశానని ఈయన అసలు విషయాన్నీ ఒప్పుకున్నారు. ఇక రవి ప్రమోట్ చేసిన 1X బెట్టింగ్ యాప్ నిర్వాహకుల వివరాలను ఈయన వెల్లడించకపోవడం గమనార్హం. రెండో రోజు విచారణలో భాగంగా సీసీఎస్ పోలీసులు రవి నుంచి కొంతపాటి సమాచారాన్ని మాత్రమే సేకరించారని తెలుస్తుంది. ఈ కస్టడీ విచారణలో రవి ఎలాంటి విషయాలను తెలియచేశారన్న అంశాలను సైబర్ క్రైమ్ పోలీసులు చాలా రహస్యంగా ఉంచారు.

బ్యాంకు వివరాలను కోరిన పోలీసులు..

Advertisement

ఎలాంటి లీకేజీ లేకుండా విచారణ కొనసాగుతోంది. ఐ బొమ్మ రవి నెట్వర్క్ గురించి పోలీసులు చాలా లోతుగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈయన ఆరు సంవత్సరాల పాటు బ్యాంకు ఖాతా వివరాలను అందించాలని బ్యాంక్ అధికారులకు సిసిఎస్ పోలీసులు లేఖ రాశారు. అయితే ఈయన పెద్ద ఎత్తున వివిధ అకౌంట్ల నుంచి లావాదేవీలను జరిపినట్టు తెలుస్తుంది. రవి ఒక్కడు మాత్రమే కాదు ఈయన వెనుక పెద్ద నెట్వర్క్ ఉందని గుర్తించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మూవీ పైరసీ మాత్రమే కాకుండా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు కూడా ఈయనపై పలు సెక్షన్ల కింద కేసులో నమోదు అయ్యాయి.

కొనసాగుతున్న మూడవరోజు విచారణ..

Advertisement

ఇలా కేసులు నమోదు చేయడమే కాకుండా వాటిని లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఒకవేళ ఈయన నేరం చేసినట్లు రుజువైతే మాత్రం శిక్ష కూడా భారీగా పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే మరోవైపు సోషల్ మీడియా వేదికగా రవికి పూర్తిస్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇక రవిని జైలు నుంచి బయటకు తీసుకురావడం కోసం సీనియర్ న్యాయవాది సలీం(Saleem) కూడా రంగంలోకి దిగారు. అయితే ఇప్పటికే ఈయన రవి తండ్రిని కలిసి మాట్లాడారు అనంతరం జైలులో ఉన్న రవిని కూడా లాయర్ సలీం కలిసినట్టు సమాచారం. ఇక తనని బయటకు తీసుకురావడం కోసం ఫ్రీగా ఈ కేసు వాదిస్తానని సలీం చెప్పిన సంగతి తెలిసిందే. మరోవైపు సిసిఎస్ పోలీసులు మూడో రోజు విచారణను కూడా కొనసాగిస్తున్నారు. మరి మూడవరోజు విచారణలో భాగంగా రవి నుంచి ఎలాంటి సమాచారం రాబడతారు అనేది తెలియాల్సి ఉంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×