E-Paper
Advertisement

IBomma Ravi Case: తప్పుచేశాను, ఇక పైరసీ చేయను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం

IBomma Ravi Case: తప్పుచేశాను, ఇక పైరసీ చేయను.. పోలీసుల ఎదుట ఐబొమ్మ రవి పశ్చాత్తాపం
Advertisement

IBomma Ravi Case: పైరసీ కింగ్‌, ఐబొమ్మ ఇమ్మడి రవి ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. అరెస్ట్అయినప్పటి నుంచి విచారణలో అతడు సహకరించడం లేదని ఆరోపిస్తూ పోలీసులకు రవి కస్టడీని పెంచుకుంటుపోతున్నారు. మరో మూడు రోజుల గడువు కావాలని ఇటీవల కోర్టును పోలీసులు కోరిన సంగతి తెలిందే. రోజుతో ఐబొమ్మ రవి మూడు రోజుల కస్టడీ గడువు ముగించింది. మూడు రోజుల కస్టడీలో రవి పోలీసుల ఎదుట ప్రశ్చాత్తాపానికి లోనయ్యాడట. ఇక తాను మారిపోతానని, ఇకపై పైరసీ జోలికి వెళ్లనంటూ పోలీసుల ఎదుట తగ్గడినట్టు సమాచారం.

విదేశీ పౌరసత్వం ఉన్న ధీమతోనే

Advertisement

కాగా విదేశీ పౌరసత్వం వల్ల తాను పోలీసులకు పట్టుబడననే నమ్మకంతో ఉన్నానని, ఐదారు సంవత్సరాలుగా తనని ఎవరూ పట్టుకోలేదు కాబట్టి, ఇకపై కూడా పట్టుకోరనే ధీమాతోనే పోలీసులకు సవాలు విసిరినట్టు చెప్పాడు. కానీ ఇప్పుడు తను బయటపడటంతో నిర్ణయం తీసుకున్నాని, ఇకపై సినిమాలు పైరసీ చేయనని పోలీసుల ఎదుట ప్రశ్చాత్తాప పడినట్టు తెలుస్తోందిఏపీకి చెందిన ఇమ్మడి రవి కొంతకాలంగా ఐబొమ్మ, బప్పం టీవీ వైబ్సైట్ల ద్వారా కొత్త సినిమాలను పైరసీకి పాల్పడుతూ పోలీసులకు, సినీ పరిశ్రమకు సమస్యగా మారాడు. దాదాపు ఐదారేళ్లుగా పైరసీకి పాల్పడుతూ కోట్లలో డబ్బు సంపాదించాడు.

మొత్తం 5 కేసులు

Advertisement

కొంకాలంగా అతడిపై నిఘా పెట్టిన పోలీసులు ఇండియాకు వచ్చిన అతడిని మెయిల్ద్వారా గుర్తించి పట్టుకున్నారు. అతడు అరెస్టై దాదాపు నెల రోజుల అవుతుంది. దాదాపు అతడిపై ఐదు కేసులు నమోదవ్వడా మొదటి కేసు కోసం ఐదు రోజుల కస్టడీ, రెండో కేసులో మూడు రోజుల కస్టడీకి అనుమతి తీసుకున్నారు పోలీసులు. విచారణలో అతగడి నుంచి కీలక వివరాలు సేకరించారు. ఐబొమ్మ, బప్పంలో సినిమాలను పైరసీ చేసేందుకు మూవీరూల్జ్‌, టెలిగ్రామ్ ద్వారా కొనుగొలు చేసి వాటిని హెచ్డీ చేసి ఐబొమ్మ, బప్పంలో సినిమా పెట్టినట్టు ఒప్పుకున్నాడు. హై టెక్కాలజీతో సర్వర్లను మెయింటెన్చేస్తూ కోట్ల రూపాలు దండుకున్నాడు.

మొత్తం రూ. 30 కోట్ల వరకు లావాదేవీలు

అయితే ఇప్పటి వరకు రూ. 30 కోట్ల వరకు లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తించారు. అతడి బ్యాంక్లావాదేవీలు, ఇంటర్నేషనల్స్థాయి జరిగిన ట్రాన్స్క్షన్స్‌, ఇతర లావాదేవీలపై లోతుగా విచారణ జరపాల్సి ఉందట. అదే విధంగా ఐబొమ్మ రవికి సినీ ఇండస్ట్రీలో కూడా ఏమైనా పరిచయాలు ఉన్నాయా? ఇంకా అతడి నెట్వర్క్ఎంతవరకు ఉంది.. ఇందులో ఇంకా ఎవరెవరూ ఉన్నారనే దానిపై పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారు. అయితే భారీ బడ్జెట్‌, పాన్ఇండియా చిత్రాలను విడుదలైన ఒక్క రోజులోనే ప్రీగా బప్పం, ఐబొమ్మ ద్వారా ప్రజలకు అందించిన అతడికి బయటక పెద్ద ఎత్తున మద్దతు లభిస్తున్న సంగతి తెలిసిందే. పీవీఆర్‌, ఐనాక్స్ వంటి మల్టీప్లెక్స్లో సినిమాలు చూసే అవకాశం లేని సామాన్య ప్రజలు మా దేవుడంటూ రవికి సపోర్టు చేస్తున్నారు. ఇంత ఎత్తున్న సపోర్టు వస్తున్న రవి కేసు ఇక ముందు ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×