E-Paper
Advertisement

iBomma : ఐ బొమ్మ నిర్వాహకుడికి భారీ శిక్షలు.. జీవితాంతం జైలు.. కోట్లల్లో ఫైన్

iBomma : ఐ బొమ్మ నిర్వాహకుడికి భారీ శిక్షలు.. జీవితాంతం జైలు.. కోట్లల్లో ఫైన్
Advertisement

iBomma : గత కొంతకాలంగా సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న పైరసీకి అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పెద్ద ఎత్తున నడుం బిగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమేరా పైరసీ నేరగాళ్లను పట్టుకున్న పోలీసులు.. ప్రధాన పైరసీ నేరగాడిగా పేరు దక్కించుకున్న ఐ బొమ్మ నిర్వాహకులను పట్టుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే 5000 కోట్ల మేరా సినీ పరిశ్రమకు నష్టం కలిగించిన దొంగ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి (ఇమ్మడి రవి) ఎట్టకేలకు అరెస్టయ్యాడు.

ఐ బొమ్మ నిర్వాహకుడు అరెస్ట్..

నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కి వచ్చిన అతడిని కూకట్పల్లిలో సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భార్యతో విడిపోయిన రవి.. ఒంటరిగా కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మను నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాదు ఆయన అకౌంట్లో ఉన్న 3వేల కోట్ల రూపాయల డబ్బును కూడా పోలీసులు ఫ్రీజ్ చేశారు. దీంతో పోలీసుల అదుపులో ఉన్న రవి పై ఏ ఏ సెక్షన్ల కింద కేసు ఫైల్ చేస్తారు అనే విషయం ఇప్పుడు ఉత్కంఠ గా మారగా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Advertisement

ఇదిలా ఉండగా సినిమాలను విడుదల చేసిన తొలి రోజే పైరసీ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు ఐబొమ్మపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అప్రమత్తమైన పోలీసులు కాపు కాసి మరీ అసలు దొంగను పట్టుకున్నారు.

జీవితాంతం జైలు శిక్ష..

ఇకపోతే ఇటీవల 2025 జూలైలో సినిమాటోగ్రఫీ యాక్ట్ కి అమెండ్ మెంట్స్ రాగా.. అందులో ఫిలిం పైరసీకి కఠిన శిక్షలను అమలు చేశారు. ఎవరైనా సినిమాను పైరసీ చేస్తే.. ఇలా చేసిన వారికి మూడు నెలల నుండి మాక్సిమం మూడు సంవత్సరాల వరకు ఇల్లీగల్ రికార్డింగ్, స్ట్రీమింగ్ లేదా డిస్ట్రిబ్యూషన్ కింద జైలు శిక్ష వేస్తారు. అయితే ఇందులో రవి ఇల్లీగల్ రికార్డింగ్ తో పాటు స్ట్రీమింగ్ చేసినట్లు సమాచారం. జరిమానా విషయానికి వస్తే.. 3 లక్షల రూపాయలు మినిమం ఉంటుంది. అలాగే మూవీ బడ్జెట్లో 5% వరకు ఫైన్ విధించే అవకాశాలు ఉన్నాయి. రిలీజ్ అయిన ప్రతి సినిమాను అక్రమంగా రికార్డు చేశాడు. స్ట్రీమింగ్ చేశాడు కాబట్టి ఈ జరిమానా కోట్లల్లో ఉండే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

ALSO READ:Film industry: పిల్లలకు ఫీజు కట్టలేని స్థితిలో స్టార్ హీరోయిన్.. అసలేం జరుగుతోంది?

పలు సెక్షన్ల కింద కేస్ ఫైల్..

సినిమాటోగ్రఫీ యాక్ట్ లో సెక్షన్ 6AA (అనధికారిక రికార్డింగ్ & ట్రాన్స్మిషన్ నిషేధం) , సెక్షన్ 7 (స్ట్రీమింగ్/ డిస్ట్రిబ్యూషన్ పెనాల్టీలు).. వీటితోపాటు కాపీ రైట్ యాక్ట్ సెక్షన్ 63 కింద 7 నెలల నుంచి 3 సంవత్సరాలు జైలు శిక్ష .. 2 లక్షల వరకు ఫైన్ ఉంటుంది. అయితే ఇదంతా ఒకటి, రెండు సినిమాలను పైరసీ చేస్తేనే.. కానీ ఇమ్మడి రవి మాత్రం వేల సంఖ్యలో సినిమాలను పైరసీ చేశాడు. కాబట్టి శిక్ష మరింత ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఫైన్ కూడా కోట్ల రూపాయలు ఉండవచ్చు.. ముఖ్యంగా సినీ పరిశ్రమకు రూ.5,000 కోట్లకు పైగా నష్టం చేసినట్లు సమాచారం. కాబట్టి ఈయనకు జీవితాంతం జైలు శిక్ష.. కోట్లల్లో ఫైన్ పడే అవకాశం ఉన్నట్లు సమాచారం..

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×