E-Paper
Advertisement

Hrithik Roshan: బాబీ కొల్లి పాన్ ఇండియా సినిమాపై క్లారిటీ ఇచ్చిన హృతిక్ టీం.. అదంతా..

Hrithik Roshan: బాబీ కొల్లి పాన్ ఇండియా సినిమాపై క్లారిటీ ఇచ్చిన హృతిక్ టీం.. అదంతా..
Advertisement

Hrithik Roshan: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సినిమా చేయబోతున్నారంటూ నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ముఖ్యంగా ‘వాల్తేరు వీరయ్య’, ‘డాకు మహారాజ్’ వంటి సినిమాలతో మంచి ఫామ్‌లో ఉన్న బాబీ, హృతిక్‌ను కలిసి కథ వినిపించారని, హృతిక్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ వార్తల్లో నిజం లేదని హృతిక్ రోషన్ టీం క్లారిటీ ఇచ్చింది. అంతే కాకుండా ఇదంతా కొందరు కావాలనే ప్రచారం చేస్తున్నారని, వారు చెప్పుకొచ్చారు.

Read also-Janhvi Kapoor: రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి జాన్వీ కపూర్ బర్త్‌డే గ్లింప్స్..

హృతిక్ టీమ్ వివరణ

Advertisement

మీడియా వర్గాల సమాచారం ప్రకారం, హృతిక్ రోషన్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. డైరెక్టర్ బాబీ, కోన వెంకట్ బృందం హృతిక్‌ను కలిసి ఒక లైన్ వినిపించిన మాట వాస్తవమే అయినప్పటికీ, సినిమాను ఖరారు చేయడం (Sign చేయడం) జరగలేదని స్పష్టం చేశారు. కేవలం ఒక ప్రాథమిక చర్చ మాత్రమే జరిగిందని, దానిని సినిమా ఫిక్స్ అయినట్లుగా ప్రచారం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. కొందరు సినీ విశ్లేషకులు నెటిజన్లు అభిప్రాయపడుతున్నట్లుగా, ఈ వార్తలు కేవలం ‘పబ్లిసిటీ స్టంట్’ కోసమే పుట్టించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పెద్ద హీరోల పేర్లు వాడటం ద్వారా ప్రాజెక్టుకు అనవసరమైన హైప్ తీసుకురావడం. మైత్రీ మూవీ మేకర్స్ వంటి పెద్ద నిర్మాణ సంస్థలు బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్న క్రమంలో ఇలాంటి లీకులు మార్కెట్‌లో చర్చకు దారితీస్తాయి. హృతిక్ ప్రస్తుతం ‘క్రిష్ 4’ పై దృష్టి పెట్టనున్నారు. ఇంత బిజీ షెడ్యూల్‌లో మరో సినిమాకు కమిట్ అవ్వడం ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ప్రస్తుతానికి హృతిక్ రోషన్ – బాబీ కాంబినేషన్ కేవలం చర్చల దశలోనే ఉంది. సోషల్ మీడియాలో వస్తున్నట్లుగా సినిమా ఖరారు కాలేదని హృతిక్ టీమ్ స్పష్టం చేయడంతో ఈ రూమర్లకు చెక్ పడినట్లయింది.

Read also-Dhurandhar Trailer: రణ్‌వీర్‌ సింగ్ ‘ధురంధర్: ద రివేంజ్’ ట్రైలర్ డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

బాబీ నెక్స్ట్ ప్లాన్ ఇదే..

Advertisement

అయితే బాబి మాత్రం తన తర్వాతి సినిమా మెగా స్టార్ చిరంజీవితో ‘మెగా158’ తీయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఏప్రిల్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన ప్రియమణి నటించనున్నారు. ముందుగా ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడిగా అనుకున్నప్పటికీ తర్వాత థమన్ అనుకుంటున్నట్లు సమాచారం. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ అందుకున్న మెగాస్టార్ మరో సారి బ్లాక్ బాస్టర్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×