E-Paper
Advertisement

Hrithik Roshan: గ్రీస్‌లో గ్రీక్ గాడ్‌ను గుర్తుపట్టలేదట… పాపం హృతిక్‌ని ఇన్ని రోజులు మోసం చేశారా ?

Hrithik Roshan: గ్రీస్‌లో గ్రీక్ గాడ్‌ను గుర్తుపట్టలేదట… పాపం హృతిక్‌ని ఇన్ని రోజులు మోసం చేశారా ?
Advertisement

Hrithik Roshan: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ హీరో హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం. తను చేసిన కొన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. ముఖ్యంగా అప్పట్లో క్రిష్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్రియేట్ చేసిన సంచలనం మామూలుది కాదు. చాలామంది చిన్న పిల్లలకు ఆ సినిమా అప్పట్లోనే విపరీతంగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ కూడా సినిమాను వెతుక్కుని మరి చూస్తుంటారు.

దానికంటే ముందు కోయి మిల్ గయా సినిమా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ధూమ్ 2 సినిమా కూడా మంచి హిట్ అయింది. ఇలా ప్రేక్షకులకు హృతిక్ రోషన్ చేసిన సినిమాలు ఎన్నో ఎక్స్పీరియన్స్ ను ఇచ్చాయి. ప్రస్తుతం హృతిక్ రోషన్ ఆగస్టు 14న వార్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాడు.

Advertisement

హృతిక్ రోషన్ ను మోసం చేశారా.?

హృతిక్ రోషన్ అందం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం హృతిక్ రోషన్ పర్సనాలిటీకి ఎప్పుడో ఫిదా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా అవ్వడానికి ఏముంది. అయితే హృతిక్ రోషన్ ను గ్రీస్ గాడ్ పిలుస్తూ ఉంటారు. దానిని హృతిక్ రోషన్ కూడా బహుశా బలంగా నమ్మి ఉంటారు. ఈ విషయంలో హృతిక్ రోషన్ కు ఒక చేదు అనుభవం ఎదురైంది. హృతిక్ రోషన్ గ్రీస్ వెళ్లాడంట. విమానం దిగి నడుచుకుంటూ వెళ్తే ఎవరు కూడా గుర్తు పట్టలేదట. అందరు నన్ను గ్రీక్ గాడ్ అంటారు. కానీ, ఆ గ్రీస్ లో నన్ను ఎవరూ కనిపెట్టలేదు అని రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.

Advertisement

ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు 

ఇక ప్రస్తుతం తెలుగు ఫిలిం హీరోలు భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు. అలానే మిగతా ఇండస్ట్రీ హీరోలు కూడా తెలుగులో హీరోలుగా సినిమాలు చేసి ప్రూవ్ చేసుకుంటున్నారు. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్థాయి సినిమాలు రావడం ఆనవాయితీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో పాటు వార్ 2 సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమా మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు ఉన్నాయి. యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ ఈ సినిమాను ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ అతి త్వరలో ఇవ్వనున్నాడు.

Also Read: Coolie : క్లైమాక్స్ కాదు, ఇంట్రడక్షన్ కాదు… హైలైట్ సీన్ ఇదే.. రివీల్ చేసిన లోకి

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×