E-Paper
Advertisement

Akira Nandan: ఢిల్లీ హైకోర్టులో అకీరాకు ఊరట.. వెంటనే తొలగించాలంటూ ఉత్తర్వులు!

Akira Nandan: ఢిల్లీ హైకోర్టులో అకీరాకు ఊరట.. వెంటనే తొలగించాలంటూ ఉత్తర్వులు!
Advertisement

Akira Nandan: ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన తర్వాత ఎంత మంచి జరుగుతుందో అంతే చెడు కూడా జరుగుతుంది. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో ఏఐ టెక్నాలజీ వారికి తలనొప్పిగా మారింది. సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలు, వారి వీడియోలను అలాగే వాయిస్ కూడా ఉపయోగిస్తూ కొంతమంది ఆర్థికంగా లాభ పొందుతున్నారు. ఇలా సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలను ఉపయోగించిన నేపథ్యంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఈ విషయంపై ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కుమారుడు అకీ రా నందన్(Akira Nandan) సైతం తన అనుమతి లేకుండా సోషల్ మీడియాలో తన ఫోటోలు వీడియోలను ఉపయోగిస్తూ వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడంతో చర్యలు తీసుకోవాలంటూ ఢిల్లీ హైకోర్టు(Delhi High Court)ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

నోటీసులు జారీ చేసిన హైకోర్టు..

ఈ నేపథ్యంలోనే ఢిల్లీ కోర్టులో అకిరా నందన్ పిటిషన్ దాఖలు చేస్తూ.. ఏఐ టెక్నాలజీ ద్వారా రూపొందించిన సినిమాలో తన ముఖ కవలికలతో పాటు, తన వాయిస్ ఉపయోగించారని, ఇది తన వ్యక్తిత్వ, గోప్యత హక్కులను ఉల్లంఘించినట్టేనంటూ ఈయన పిటిషన్ దాఖలు చేశారు. కేవలం ఏఐ టెక్నాలజీ ద్వారా మాత్రమే కాకుండా, ఫేస్ బుక్ , ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి తదితర సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లో కూడా తన ఫోటోలు వీడియోలను ఉపయోగించారని ఈ పిటిషన్ లో పేర్కొన్నారు.

AI సినిమాపై నిషేధం..

Advertisement

ఇలా అకిరా నందన్ దాఖలు చేసిన ఈ పిటీషన్ నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ విచారణ అనంతరం కోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది. ఏఐ టెక్నాలజీ ద్వారా అకిరా నందన్ అనుమతి లేకుండా ఆయన ముఖ కవళికలు, వాయిస్ తో నిర్మించిన సినిమాని వెంటనే నిషేధించాలని ఉత్తర్వులు జారీ చేసింది.AI, డీప్‌ఫేక్ ద్వారా అకిరా నందన్ పేరు, ఇమేజ్, పోలిక, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించడం అంటే దోపిడీ చేయడమేనని హైకోర్టు తెలిపింది. ఈ విధంగా అకిరా ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా రూపొందించిన కంటెంట్ అతని గోప్యత హక్కును ఉల్లంఘించినట్లు అవుతుందని హైకోర్టు తెలిపింది.

ఫోటోలు వెంటనే తొలగించాలి..

Advertisement

ఏ సోషల్ మీడియా ఖాతాలలో అయితే అకిరా అనుమతి లేకుండా ఆయన ఫోటోలు వీడియోలను ఉపయోగించారో వెంటనే వాటన్నింటిని తొలగించాలని అలాగే, ఐపి వివరాలను కూడా బహిర్గతం చేయాలి అంటూ హైకోర్టు మెటా ,యూట్యూబ్,ఇన్ స్ఠాగ్రామ్, ఫేస్ బుక్ , ఎక్స్ సంస్థలకు నోటిసులు జారీ జారీ చేశారు. ఈ విచారణ జస్ఠిస్ తుషార్ రావు గేదెల సమక్షంలో జరగగా అకీరా నందన్ తరుపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది జె సాయి దీపక్, గూగుల్ తరుపున ఆదిత్యా గుప్తా, మెటా తరుపున న్యాయవాది వరుణ్ పాఠక్ వాదనలు వినిపించారు. ఇలా కోర్ట్ తీర్పుతో అకిరా నందన్ కు కాస్త ఊరట కలిగిందని చెప్పాలి.

Also Read: Gandhi Talks Trailer: మూకీ సినిమాగా ‘గాంధీ టాక్స్’.. ఒక్క డైలాగ్ లేకుండా ట్రైలర్ రిలీజ్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×