E-Paper
Advertisement

Heroism: హీరో అంటే గడ్డం, కోపమేనా.. గన్స్ & గులాబ్స్ నటుడి షాకింగ్ కామెంట్స్

Heroism: హీరో అంటే గడ్డం, కోపమేనా.. గన్స్ & గులాబ్స్ నటుడి షాకింగ్ కామెంట్స్
Advertisement

Heroism: ఇండియన్ సినిమాల్లో ఇటీవలి కాలంలో ఒకే తరహా ట్రెండ్ బాగా పెరిగింది. అదేమిటంటే హీరో అంటే తప్పకుండా గడ్డం.. రఫ్ లుక్.. కోపంగా చూసే ముఖం, దూకుడైన బాడీ లాంగ్వేజ్ ఉండాలనే భావన ఎక్కువైంది. ఈ విషయంపై నటుడు గుల్షన్ దేవయ్య తాజాగా తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ఈ ట్రెండ్‌ను ఆయన ..అల్ట్రా మాచిజ్మో.. అని పేర్కొన్నారు.

గుల్షన్ దేవయ్య మాట్లాడుతూ, ఈ రోజుల్లో దాదాపు ప్రతి హీరో ఒకే లుక్‌ను ఫాలో అవుతున్నాడని అన్నారు. గడ్డం లేకపోతే పవర్ కనిపించదా? ఆగ్రెషన్ చూపించకపోతే హీరో అనిపించడా? అని ప్రశ్నించారు. ముఖ్యంగా పుష్ప సినిమాను ఉదాహరణగా తీసుకుంటూ..ఒక స్టైల్ హిట్ అయిందని అందరూ అదే కాపీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. క్లీన్ షేవ్‌లో ఉండటం తప్పు కాదని.. ప్రతి పాత్ర డామినెంట్‌గా కనిపించాల్సిన పనిలేదని అన్నారు.

Advertisement

తాను కూడా గతంలో గన్స్ అండ్ గులాబ్స్ లో అల్ట్రా మాచో పాత్ర చేశానని గుల్షన్ గుర్తు చేశారు. అయితే అలాంటి పాత్రలను ప్రేక్షకులు అంధంగా అభిమానించకూడదని చెప్పారు. ఎందుకంటే ఆ పాత్రలు చాలా సార్లు లోపాలు ఉన్న వ్యక్తిత్వాలను మాత్రమే చూపిస్తాయని తెలిపారు.

ఇటీవల రా యాక్షన్ సినిమాల.. సంఖ్య పెరిగింది. దాదాపు అన్ని స్టార్ హీరోలు ఒకే రకమైన రఫ్ లుక్‌లో కనిపిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం యానిమల్ సినిమా విడుదలకు ముందే పెద్ద వివాదాలు సృష్టించింది. అయినప్పటికీ ఆ సినిమా భారీ విజయం సాధించింది. ఆ తర్వాత ఆగ్రెసివ్ హీరోల ట్రెండ్ మరింత బలపడింది.

Advertisement

ఈ ట్రెండ్‌ను పాపులర్ చేయడంలో రణవీర్ సింగ్ పాత్ర కూడా ఉందని కొందరు భావిస్తున్నారు. ఆయన తాజాగా ధురంధర్ సినిమాలో కూడా ఇలాంటి రఫ్ లుక్‌తో కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కొంతమంది నెటిజన్లు కుటుంబ విలువలు, ఎమోషనల్ కథలు చూపించే సినిమాలు రావాలని అంటున్నారు. అలా అయితే అతి మాచిజ్మో తగ్గుతుందని వారి అభిప్రాయం. అయితే స్టార్ హీరోలు లేకుండా ఇలాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమని మరో వర్గం చెబుతోంది. మొత్తానికి గుల్షన్ దేవయ్య వ్యాఖ్యలు మరోసారి హీరోల ఇమేజ్.. కథల దిశపై చర్చను మొదలుపెట్టాయి. ఈ మాటలు భవిష్యత్తు కథనాలపై ప్రభావం చూపుతాయా? లేక చర్చకే పరిమితమవుతాయా? అన్నది వేచి చూడాల్సిందే.

ALSO READ: The Raja Saab Advance Bookings: విడుదలకు ముందే రికార్డులు.. షాక్‌కు గురిచేస్తున్న ది రాజా సాబ్ అడ్వాన్స్ కలెక్షన్స్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×