E-Paper
Advertisement

Sreeleela : తెలుగులో ఏం వర్క్ అవుట్ కావడం, ఇంక తమిళ్ కి షిఫ్ట్ అయిపోతుందా? 

Sreeleela : తెలుగులో ఏం వర్క్ అవుట్ కావడం, ఇంక తమిళ్ కి షిఫ్ట్ అయిపోతుందా? 
Advertisement

Sreeleela : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పెళ్లి సందడి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రీ లీల. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఈ సినిమా సక్సెస్ సాధించక పోయినా కూడా వరుసగా అవకాశాలు వచ్చాయి. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ నటించిన ధమాకా సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు శ్రీలీల నటించిన ఏ సినిమా కూడా ఊహించిన స్థాయిలో ఆడలేదు.

తను చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కాకపోయినా కూడా వరుసగా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. చాలామంది స్టార్ హీరోలతో కలిసి నటించే అవకాశం ఆమె పొందుతుంది. మహేష్ బాబుతో గుంటూరు కారం, పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలు శ్రీలీల నటించింది. భాను భోగవరపు దర్శకుడుగా పరిచయమైన మాస్ జాతర సినిమాలో కనిపించింది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేదు.

తమిళ్ కు షిఫ్ట్ అవుతుందా?

Advertisement

ఎన్నో అంచనాలతో చేస్తున్న సినిమాలేవి వర్క్ అవుట్ అవ్వడం లేదు. మరోవైపు తమిళ్లో మాత్రం వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

శివ కార్తికేయన్ తో డాన్ అనే సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు శిబి చక్రవర్తి. ఆ తర్వాత నాని హీరోగా అతను సినిమా ఉంటుంది అని అందరూ భావించారు. దానికి సంబంధించి అప్పట్లో చర్చలు కూడా జరిగాయి. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయినట్లు కూడా కన్ఫర్మ్ అయిపోయింది.

Advertisement

ఇప్పుడు శిబి చక్రవర్తి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీలను తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి కొన్ని రోజుల్లో అధికారిక ప్రకటన కూడా రావాల్సి ఉంది.

అక్కడైనా సక్సెస్ సాధిస్తుందా?

శ్రీ లీలాకు విపరీతమైన టాలెంట్ ఉంది అనేది వాస్తవం. ముఖ్యంగా తాను డాన్స్ చేస్తే చూడముచ్చటగా ఉంటుంది. అందుకే పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో కూడా తనతో ఒక ఐటెం నెంబర్ డిజైన్ చేశారు సుకుమార్.

తెలుగులో సినిమాలు వర్కౌట్ కావడం లేదు ఇక తమిళ్లో సక్సెస్ సాధిస్తుందా అని అందరికీ ఒక రకమైన డౌట్ ఏర్పడుతుంది. అయితే సుధా కొంగర ఇప్పటివరకు తీసిన రెండు సినిమాలు కూడా మంచి సక్సెస్ సాధించాయి. తను సూర్యతో చేసిన ఆకాశమే హద్దురా సినిమా డైరెక్ట్ ఓటిటిలో విడుదలైంది. ఆ సినిమాకి మంచి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా వచ్చాయి. ఇప్పుడు పరాశక్తి పైన మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా సక్సెస్ అయితే శ్రీ లీల హిట్ కొట్టినట్లే.

Also Read: Thalaivar 173 : లీగ్ లోకి కార్తీక్ సుబ్బరాజ్, ఇది ఇంకా పెద్ద రిస్క్

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×