E-Paper
Advertisement

Andrea Jeremiah: టాలెంట్ ఉన్న వారిని బ్రతకనివ్వరు.. కోలీవుడ్ పై హీరోయిన్ కామెంట్!

Andrea Jeremiah: టాలెంట్ ఉన్న వారిని బ్రతకనివ్వరు.. కోలీవుడ్ పై హీరోయిన్ కామెంట్!
Advertisement

Andrea Jeremiah: ఏ సినీ ఇండస్ట్రీలో అయినా సరే ఎక్కువగా సిండికేట్ లు ఉంటాయి అని.. అందులో తమకు నచ్చిన వారికి మాత్రమే అవకాశాలు ఇస్తారు అని అటు వెండితెర అయినా ఇటు బుల్లితెర అయినా టాలెంట్ ఉన్న వారిని తొక్కేయడంలో చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారని.. ఇప్పటికే ఎంతోమంది నిరూపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన వ్యక్తులు.. తమ టాలెంట్ తో పైకి ఎదిగే క్రమంలో ఇలాంటి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు ఈ విషయాలను వారే స్వయంగా ప్రకటించారు కూడా..

టాలెంట్ ఉన్న వారిని బ్రతకనివ్వరు..

ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీని చూసుకుంటే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ (Sushanth Singh Rajput) హార్ట్ ఎటాక్ తో చనిపోయారని మొదట నిర్ధారించినా.. ఆ తర్వాత ఆయనది హత్య అని వైద్యులు నిరూపించారు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయనకు సొంత టాలెంట్ తో ఎదిగే ప్రయత్నంలో అవకాశాలు రాకుండా చేశారు అనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి. కానీ అందులో ఎంత నిజం ఉందో తెలియదు.ఇప్పుడు ఒక హీరోయిన్ ఏకంగా కోలీవుడ్ సినీ పరిశ్రమపై సంచలన కామెంట్లు చేయడమే కాకుండా టాలెంట్ ఉన్న వారిని తొక్కేస్తారు అంటూ ఆరోపణలు చేసింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ కోలీవుడ్ బ్యూటీ ఆండ్రియా జెరేమియా (Andrea Jeremiah).

ఆ విషయం కోలీవుడ్లో స్పష్టంగా కనిపిస్తుంది..

Advertisement

ఆండ్రియా మాట్లాడుతూ..’వడ చెన్నై’ సినిమాలో నా నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి. అయితే ఈ సినిమా తర్వాత నాకు ఎలాంటి ఆఫర్లు రాలేదు. చాలామంది నటులు తమ సినిమాలలో బలమైన మహిళా పాత్రలు ఉండడాన్ని అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఇక టాలెంట్ ఉన్నవారికి అవకాశాలు అసలే ఇవ్వరు. అందుకే ఆ సినిమా తర్వాత నాకు వేరే ఆఫర్లు రాలేదు. ఇది నేను కోలీవుడ్లో స్పష్టంగా గమనించిన విషయం” అంటూ తన అభిప్రాయాన్ని, తాను అనుభవించిన పరిస్థితులను చెప్పుకొచ్చింది ఆండ్రియా. ప్రస్తుతం ఆండ్రియా చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ALSO READ:#Globe Trotter: ఫ్యాన్స్ కి మహేష్ బాబు రిక్వెస్ట్..వీడియో వైరల్!

ఆండ్రియా కెరియర్..

Advertisement

ఆండ్రియా కెరియర్ విషయానికొస్తే.. 2005లో ‘కందా నాల్ ముదల్’ అనే తమిళ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టి.. తమిళ్ తో పాటు తెలుగు,హిందీ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 1985 డిసెంబర్ 21న చెన్నైలోనే అరక్కోణంలో ఆంగ్లో ఇండియన్ కుటుంబంలో జన్మించిన ఈమె.. నుంగంభాక్కంలోని మహిళా క్రిస్టియన్ కాలేజీలో చదువుకుంది. పదేళ్ల నుంచి యంగ్ ఇసాదర్సు అనే బృందంలో చేరి పాటలు పాడుతూ గాయనిగా మంచి పేరు సొంతం చేసుకుంది. అలా గాయనిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత నటిగా తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకుంది. ముఖ్యంగా 2017లో వచ్చిన ‘యుగానికి ఒక్కడు’ అనే తమిళ చిత్రం ద్వారా ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది. 2013లో వచ్చిన తడాఖా అనే సినిమాతో తొలిసారి నేరుగా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆండ్రియా.. మళ్లీ ఆ తర్వాత తెలుగులో నటించలేదు.
తమిళ్, హిందీ చిత్రాలు చేస్తూ కెరియర్ను కొనసాగిస్తోంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×