E-Paper
Advertisement

టాక్సిక్ స్టోరీ చెప్పేసిన హీరో యశ్..ఈ ట్విస్ట్ ఏంటి గురూ!

టాక్సిక్ స్టోరీ చెప్పేసిన హీరో యశ్..ఈ ట్విస్ట్ ఏంటి గురూ!
Advertisement

Yash:కేజీఎఫ్ 1,2 చిత్రాలతో సంచలనం సృష్టించి, నటుడిగా పాన్ ఇండియా స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్న కన్నడ స్టార్ హీరో యశ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. విలక్షణ నటుడిగా పేరు గడించిన ఈయన.. తాజాగా కొంతకాలం గ్యాప్ తీసుకొని ‘టాక్సిక్’ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ప్రముఖ లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కియారా అద్వానీ హీరోయిన్గా.. నయనతార, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగినా..మరొకవైపు అంతే స్థాయిలో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి.

యశ్ టాక్సిక్ అడల్ట్ మూవీనా?

ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన ప్రచార చిత్రాలతో పాటు లేడీస్ అండ్ లేడీస్ గ్లింప్స్ కూడా విమర్శలు ఎదుర్కొంది. ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ , తబాహీ పాట లోని సన్నివేశాలు చూశాక.. కొంతమంది ఇది అడల్ట్ మూవీ అంటూ ఫైర్ అయ్యారు. అంతేకాదు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. మరి కొంతమంది అయితే ఇదొక అడల్ట్ మూవీ అని, ఫ్యామిలీస్ తో చూడడం కష్టమే అనే రేంజ్ లో ఫిక్స్ కూడా అయిపోయారు. ఈ నేపథ్యంలోనే వీటన్నింటికీ చెక్ పెడుతూ.. అసలు స్టోరీ ఇది అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో అంచనాలు పెంచేస్తున్నాయి.

బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అంటూ అంచనాలు పెంచిన హీరో..

Advertisement

ఇటీవల బాలీవుడ్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. “మీరందరూ అనుకుంటున్నట్టు ఇది అడల్ట్ మూవీ కాదు.. 1947లో స్వతంత్రం వచ్చినా.. మన ఇండియాలో ఇంకా కొన్ని ప్రాంతాలు 1961 వరకు పోర్చుగీస్ ,ఫ్రాన్స్ వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయి. ఆ సమయంలో జరిగిన ఒక బిజినెస్ కి సంబంధించిన కథ ఇది. ఇందులో పోర్చుగీసు వాళ్ళు, ఇండియన్స్ ఉంటారు. అధికారం కోసం జరిగే గ్యాంగ్ స్టర్ కథ ఇది. అంతేకాదు బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ తో పాటు తండ్రి కొడుకు రివేంజ్ కథ.. ఒక మంచి లవ్ స్టోరీ కూడా ఉంది” అంటూ సినిమా స్టోరీ గురించి అంచనాలు పెంచేశారు.

also read:హీరోగా లోకేష్ కనగరాజ్..DC కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్!

సిస్టర్ పాత్రలో నటించేది ఎవరు?

Advertisement

ఇకపోతే బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అని చెప్పడంతో ఈ సినిమాలో హీరోయిన్ కియారా అద్వానీ కాకుండా మిగిలిన నలుగురు హీరోయిన్లలో ఎవరు ఈయనకి సోదరి పాత్రలో నటిస్తున్నారు? అనే విషయం సస్పెన్స్ గా మారింది. మొత్తానికైతే ఇన్ని రోజులు అడల్ట్ సినిమా అనుకున్న టాక్సిక్ బ్రదర్ సిస్టర్ సెంటిమెంటు, తండ్రి కొడుకుల రివేంజ్ కథ అని చెప్పడంతో ఆడియన్స్ లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇకపోతే ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా కన్నడ, ఇంగ్లీష్ భాషలో ఒరిజినల్ వెర్షన్లో రిలీజ్ అవుతుండగా.. ఈ సినిమా తమిళ్, హిందీ ,తెలుగు, మలయాళం భాషల్లో డబ్బింగ్ వెర్షన్ లో రిలీజ్ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×