E-Paper
Advertisement

హీరో విజయ్ దళపతికి తప్పిన ప్రమాదం!

హీరో విజయ్ దళపతికి తప్పిన ప్రమాదం!
Advertisement

Vijay Thalapathy: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి (Vijay Thalapathy) ప్రస్తుతం ‘టీవీకే’ పార్టీని ఎన్నికల బరిలో దింపి అధికారంలోకి తీసుకురావడానికి విస్తృతంగా ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే టీవీకే పార్టీ అధినేత విజయ్ కి ఊహించని పరిణామం ఎదురయింది. ఆయన కంటికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇక ఈ విషయం తెలిసి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు..అసలు విషయంలోకి వెళ్తే.. పార్టీ మేనిఫెస్టో రిలీజ్ కార్యక్రమంలో ఒక రైతు వేదికపైకి విజయ్ దగ్గరకు వచ్చారు.. ఆ సందర్భంగా వరి పైరుతో పాటు వేల్ లాంటి దాన్ని ఆయనకు ఇవ్వబోయారు. దానిని పైకి ఎత్తిన నేపథ్యంలో విజయ్ కన్నుకు తగిలినంత పనైంది.. వెంటనే విజయ్ అలర్ట్ అయ్యారు. లేకపోతే పెను ప్రమాదం జరిగి ఉండేది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

విజయ్ అధికారంలోకి వస్తారా?

ఒకవైపు తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23 జరగనున్న విషయం తెలిసిందే. 234 స్థానాలలో ఒకే విడతలో పోలింగ్ నిర్వహించేందుకు అటు అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మే 4వ తేదీన ఓట్ల లెక్కింపు కూడా ఉంటుంది. ఇక తమిళనాడు రాష్ట్రంలో డీఎంకె , అన్నాడీఎంకే పార్టీలతో పాటు ఈసారి విజయ్ టీవీ కే పార్టీ గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పోటీలో ఎవరు గెలుస్తారు ? అసలు విజయ్ అధికారంలోకి వస్తారా ? అనే కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏదేమైనా విజయ్ కి పెను ప్రమాదం తప్పిందని తెలిసి అభిమానులు సైతం ఊపిరి పీల్చుకుంటున్నారు.

విజయ్ దళపతి సినిమా కెరియర్..

Advertisement

1984లో వెట్రి అనే తమిళ చిత్రం ద్వారా బాల నటుడిగా సినీ అరంగేట్రం చేశారు.. ఈయన తండ్రి ఎవరో కాదు ప్రముఖ దర్శకుడు ఎస్ ఏ చంద్రశేఖర్. తండ్రి దర్శకత్వం వహించిన కొన్ని చిత్రాలలో బాలనటుడిగా నటించి, ఆ తర్వాత 18 సంవత్సరాల వయసులో నాలయ్య తీర్పు అనే చిత్రంతో 1992లో హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఇక ఆ తర్వాత కొన్ని ప్రధాన పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్న విజయ్ స్నేహితులు సినిమాతో వాణిజ్యపరంగా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక అలా ఒక్కో సినిమాతో అద్భుతమైన నటన కనబరుస్తూ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు.

ALSO READ:Kissik Talks: కర్మ ఎవరిని వదిలిపెట్టదు – సుమన్ శెట్టి కామెంట్స్!

విజయ్ వ్యక్తిగత జీవితం..

Advertisement

విజయ్ ఒకవైపు కెరియర్ పరంగా దూసుకుపోతుంటే మరొకవైపు వ్యక్తిగతంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రముఖ సినీనటి త్రిషతో రిలేషన్ లో ఉన్నారని ఆయన భార్య సంగీత.. పేరును ప్రస్తావించకుండా విడాకులు కోరిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఒక సినీనటి వల్లే విజయ్ తనకు దూరమయ్యాడని, ఆవేదన వ్యక్తం చేసింది సంగీత. అయితే త్రిష మాత్రం తనకు విజయ్ తో ఎటువంటి రిలేషన్ లేదు అన్నట్టుగానే కామెంట్ చేస్తూ వార్తలలో నిలుస్తోంది ఏది ఏమైనా విజయ్ మాత్రం వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనడంలో సందేహం లేదు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×