E-Paper
Advertisement

Hero Suhas: ‘హే భగవాన్’ టైటిల్ మార్చడానికి కారణం ఏంటంటే?

Hero Suhas: ‘హే భగవాన్’ టైటిల్ మార్చడానికి కారణం ఏంటంటే?
Advertisement

Hero Suhas: సుహాస్ హీరోగా నటించిన ‘హే బల్వంత్’ (Hey Balwanth) చిత్రం ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం.. తమ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్‌పై ఈ ఫుల్‌లెంగ్త్‌ అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సుహాస్ (Suhas) సరసన శివానీ నగరం (Shivani Nagaram) హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి కీలక పాత్రలను పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి. నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా విశేషాలను, మరీ ముఖ్యంగా ఈ సినిమా టైటిల్‌ను (ముందు ‘హే భగవాన్’ (Hey Bhagavan) అని పెట్టారు) ఎందుకు మార్చాల్సి వచ్చిందో.. తాజాగా హీరో సుహాస్ మీడియాకు వివరించారు.

Also Read- Soubin Shahir Movie: ఓటీటీలోకి సౌబిన్ షాహిర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అందుకే ‘హే బల్వంత్’గా మార్చాం

Advertisement

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఈ మధ్య భగవంతుడి పేరుతో ఏదైనా సన్నివేశం ఉన్నా, టైటిల్ అయినా కాంట్రవర్సీ అవుతుంది. ‘హే భగవాన్‌’ టైటిల్‌ను ‘హే బల్వంత్’గా మార్చడానికి కారణం సెన్సార్ వారి అభ్యంతరమే. ‘భగవాన్‌’ అంటే భగవంతుడు అనే అర్థం వస్తుంది కాబట్టి టైటిల్‌ మార్చాలని సెన్సారు వారు సూచించడంతో ‘హే బల్వంత్’గా మార్చాం. సినిమాలో నరేష్‌ పాత్ర పేరు కూడా మార్చాం. సినిమా టైటిల్‌తో పాటు సినిమా కాన్సెప్ట్‌ను కూడా సెన్సారు వాళ్లు పరిగణనలోకి తీసుకుని, ఈ సూచన చేశారు. అందుకే వారి సూచనను పాటిస్తూ ఈ సినిమా టైటిల్ మార్చడం జరిగింది. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే. చిన్నప్పటి నుంచి మంచి బిజినెస్‌ చేయాలని ఆలోచించే కుర్రాడి పాత్రలో కనిపిస్తాను. నాన్న బిజినెస్‌ను టేకప్‌ చేయాలని అనుకుంటాను. అప్పుడు నా పాత్రకు ఎదురైన పరిణామాలు ఏమిటి? నాన్న బిజినెస్‌ ఏమిటి? ఇలా సినిమా పూర్తి ఎంర్‌టైన్‌మెంట్‌గా, నా పాత్ర కూడా వినోదాత్మకంగా ఉంటుంది.

Also Read- Spirit Leaked Photo: స్పిరిట్ నుంచి ప్రభాస్ ఫోటో లీక్.. చూస్తే ఫ్యూసులు ఎగిరిపోతాయి..!

వందరెట్లు బెటర్‌గా వచ్చింది

Advertisement

నా కెరీర్‌లో సినిమా ఓకే కాగానే పూర్తి చేసి చాలా త్వరితగతిన విడుదల చేస్తున్న సినిమా ఇదే. సినిమా కూడా ఎంతో క్వాలిటీగా వచ్చింది. నా కెరీర్‌లో మళ్లీ ఇంత ఫాస్ట్‌గా సినిమా జరుగుతుందా? అనిపించింది. అసలు ఈ కథ వినగానే బాగా నచ్చేసింది. ముఖ్యంగా ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌గా కనెక్ట్‌ అయ్యే కంటెంట్ ఇందులో ఉంది. సినిమా మేము అనుకున్నదాని కంటే వందరెట్లు బెటర్‌గా ఉంది. నేను నా కెరీర్ పట్ల పూర్తి శాటిస్‌ఫ్యాక్షన్‌గానే ఉన్నాను. ఈ సినిమా హిట్‌ అయితే, అది ఇంకా పెరుగుతుంది. అందరూ సినిమా మీద ఫుల్‌ కాన్పిడెంట్‌గా ఉన్నాం. పెద్ద విజయం రాబోతుంది. ఈ సినిమా మా వైఫ్‌ కూడా చూసి ఫుల్‌ ఎంజాయ్‌ చేసింది. ఇలాంటి సినిమాలు కదా నువ్వు చేయాల్సింది అని కితాబిచ్చింది. ఈ సినిమాతో పాటు ‘మందాడి’ అనే చిత్రం చేశాను. అందులో విలన్‌గా కనిపిస్తాను. ఇవి కాకుండా, కార్తీక్‌ సుబ్బరాజు బ్యానర్‌లో ఓ సినిమా చేస్తున్నాను. ఆయన కథ అందిస్తున్నాడు. వాళ్ల అసోసియేట్‌ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. తెలుగులో కొన్ని కథలు వింటున్నాను. త్వరలోనే ఫైనల్ అవుతాయి’’ అని సుహాస్ చెప్పుకొచ్చారు.

Also Read- Amritha Aiyer : చీరకట్టులో కోమలమైన మోముతో ఆకట్టుకుంటున్న అమృత!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×