E-Paper
Advertisement

Mowgli First ticket: మోగ్లీ ఫస్ట్ టికెట్ కొన్న స్టార్ హీరో.. ధర ఎంత అంటే?

Mowgli First ticket: మోగ్లీ ఫస్ట్ టికెట్ కొన్న స్టార్ హీరో.. ధర ఎంత అంటే?
Advertisement

Mowgli First Ticket: డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదల అవుతూ ఈ సంవత్సరానికి గుడ్ బై చెప్పబోతున్నాయి. అయితే డిసెంబర్ 12వ తేదీ చిన్న సినిమాలన్నీ విడుదలకు సిద్ధమయ్యాయి కానీ అదే రోజు అఖండ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిన్న సినిమాలన్నీ కూడా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక డిసెంబర్ 12వ తేదీ విడుదల కావాల్సిన సినిమాలలో సుమా కనకాల కుమారుడు రోషన్ కనకాల(Roshan Kanakala) కూడా ఒకరు. కలర్ ఫోటో ఫేమ్ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj)దర్శకత్వంలో తెరకెక్కిన మోగ్లీ(Mowgli) సినిమా డిసెంబర్ 12న విడుదల కావాల్సి ఉండగా అఖండ 2 కారణంగా 13వ తేదీ విడుదల కాబోతోంది.

మొదటి టికెట్ కొన్న నాని..

డిసెంబర్ 13వ తేదీ ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో 12వ తేదీ సాయంత్రమే ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి. ఈ క్రమంలోనే చిత్ర బృందం కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్లను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా టికెట్ ధరలు కూడా చాలా తక్కువగా ప్రేక్షకులకు అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మొదటి టికెట్ నేచురల్ స్టార్ నాని(Nani) కేవలం 99 రూపాయలకే కొనుగోలు చేశారు. ఇటీవల కాలంలో సినిమా టికెట్ల రేట్లనో అధికంగా పెంచడం వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడంలేదని చిన్న సినిమాల నిర్మాతలు పూర్తిగా టికెట్ల రేట్లు తగ్గించిన సంగతి తెలిసిందే.

మోగ్లీ కోసం స్టార్స్..

Advertisement

ఈ క్రమంలోనే మోగ్లీ సినిమాకి కూడా అత్యంత తక్కువ ధరకే టికెట్లు అందుబాటులోకి రాబోతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం స్టార్ హీరోలు అందరూ కూడా రంగంలోకి దిగి ప్రమోషన్లను నిర్వహించారు. ఈ సినిమా గ్లింప్స్ కోసం నాని వాయిస్ ఓవర్ ఇవ్వగం టీజర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ట్రైలర్ రామ్ చరణ్ విడుదల చేయగా, తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు రానా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .

విలన్ గా బండి సరోజ్..

Advertisement

ఈ విధంగా ఒక చిన్న సినిమాకు స్టార్స్ అందరూ కూడా మద్దతుగా నిలబడారని చెప్పాలి. ఇక ఈ సినిమా ఫారెస్ట్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కగా రోషన్ సరసన సాక్షి హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బండి సరోజ్ విలన్ పాత్రలో నటిస్తుండటం విశేషం. ఇక ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. మరి సుమ కుమారుడు తన రెండో సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది. ఇదివరకే రోషన్ బబుల్ గమ్ అనే సినిమా ద్వారా హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మొదటి సినిమాతో మెప్పించ లేకపోయిన రోషన్ రెండవ సినిమా ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.

Also Read: Sobhita: నవీన్ పోలిశెట్టికి షాక్ ఇచ్చిన శోభిత.. సామ్ గుర్తులను పూర్తిగా చెరిపేస్తోందిగా?

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×