E-Paper
Advertisement

Mahesh Babu : సూపర్ స్టార్ ఫ్యామిలీ పిక్.. అప్పుడు.. ఇప్పుడు..ఏమున్నాడ్రా బాబు ప్రిన్స్..!

Mahesh Babu : సూపర్ స్టార్ ఫ్యామిలీ పిక్.. అప్పుడు.. ఇప్పుడు..ఏమున్నాడ్రా బాబు ప్రిన్స్..!
Advertisement

Mahesh Babu : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నారు.. అందులో ఒక్కొక్కరికి అభిమానులు లక్షల్లో ఉన్నారు.. కొందరు అభిమానులు తమ అభిమాన హీరోతో పాటుగా తన ఫ్యామిలీని కూడా చూడాలని అనుకుంటారు.. ఆ హీరో ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు గూగుల్లో ఉన్నాయేమో అని తెగ వెతికేస్తుంటారు.. ఈమధ్య స్టార్ హీరోల గతంలో ఫోటోలు ఇప్పుడు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను తమ అభిమానులు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ మరింత ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఆ ఫోటోలో మహేష్ బాబు అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం మారలేదు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.. ఆ పిక్ ఎలా ఉందో ఒకసారి మనం కూడా తెలుసుకుందాం..

మహేష్ ఫ్యామిలీ పిక్.. అప్పుడు.. ఇప్పుడు..

టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం.. సూపర్ స్టార్ కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి, తన టాలెంట్ తో ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగాడు.. ప్రస్తుతం వరసగా బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే ఆయన ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది.. గతంలో సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మలతో పాటుగా అక్క మంజుల, అన్న, సుధీర్ బాబుతో ఫ్యామిలీ లు కూడా ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. అప్పటి ఫోటోలో నమ్రత కనిపించలేదు.. ఆ తర్వాత ఫోటోలో కృష్ణ, విజయ నిర్మల, జయకృష్ణ తప్ప మిగిలిన మూడు ఫ్యామిలీలు కనిపిస్తున్నారు. ఫ్యామిలీలో తమ పిల్లలు కూడా ఉన్నారు. అయితే అప్పటికి ఇప్పటికీ ఉన్న ఫోటోలో మహేష్ బాబు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు. అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Also Read :టీవీ సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. కొత్త ఏడాది టాప్ రేటింగ్ సీరియల్ ఇదే..?

మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే..

సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. స్టార్ హీరోగా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తూ దూసుకుపోతున్నాడు.. గత కొన్ని లుగా మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతున్నాయి. గత ఏడాది వచ్చినా గుంటూరు కారం సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న సరే కలెక్షన్ల పరంగా వసూళ్ల సునామీ సృష్టించింది. ప్రస్తుతం మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళితో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాకు వారణాసి అనే టైటిల్ని ఫిక్స్ చేశారు.. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. వచ్చేయడాది మార్చిలో సినిమా థియేటర్లలోకి రాబోతుంది.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×