E-Paper
Advertisement

Allari Naresh : హీరో అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన మరణం తీరని లోటు..

Allari Naresh : హీరో అల్లరి నరేష్ ఇంట తీవ్ర విషాదం.. ఆయన మరణం తీరని లోటు..
Advertisement

Allari Naresh : టాలీవుడ్ స్టార్ హీరో అల్లరి నరేష్ ఇంత తీవ్ర విషాదం నెలకొంది. నరేష్ వాళ్ళ తాతగారు మరణించారు. అల్లరి నరేష్ తండ్రి ఇవివి సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు గారు కన్నుమూశారు. ఈరోజు తెల్లవారుజాము తుది శ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 90 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా గత కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.. ఆయన భార్య వెంకట రత్నం 2019 లో అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. అల్లరి నరేష్ తండ్రి మరణించారు. ఇప్పుడు తాత కూడా మరణించడంతో ఎమోషనల్ అవుతున్నాడు. ఆయన మరణం కుటుంబంలో తీరని లోటుగా మిగిలింది. ఈ వార్త ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు, ఇవివి సత్యనారాయణ సన్నిహితులు, కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.. ఇక ఆయన స్వగ్రామం అయిన నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి… ఈ కార్యక్రమానికి అల్లరి నరేష్ తో పాటుగా ఆయన కుటుంబ సభ్యులు, సినీ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు హాజరు కానున్నారని సమాచారం..

అల్లరి నరేష్ కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన తాతయ్య, దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ తండ్రి ఈదర వెంకట్రావు ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించారు. వృద్ధాప్య సమస్యలతో పాటు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు.. 2019లో ఆయన భార్య అనారోగ్య సమస్యల కారణంగానే మృతి చెందిన విషయం తెలిసిందే. వెంకట్రావుకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ 2011లో మృతి చెందారు. ప్రముఖ నటులు అల్లరి నరేశ్‌, ఆర్యన్‌ రాజేశ్‌ ఆయన కుమారులే.. తాత మరణంతో అల్లరి నరేష్ బాగా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తన తాతతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆయన మరణ వార్త విన్న పలువురు కుటుంబ సభ్యులు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పిస్తున్నారు. ఇప్పటికే ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. నేడు సాయంత్రం నాలుగు గంటలకు అల్లరి నరేష్ తాత వెంకట్రావు అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరగనున్నాయి.

అల్లరి నరేష్ సినిమాల విషయానికొస్తే..

Advertisement

ఇవివి సత్యనారాయణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు హీరో నరేష్.. అల్లరి మూవీ తర్వాత అతని పేరు అల్లరి నరేష్ గా మారింది. హీరో అల్లరి నరేష్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ నిరూపించుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే కామెడీ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఈ మధ్య యాక్షన్ హీరో అయ్యాడు. నాంది సినిమాతో నరేష్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×