// // BaahubaLi Movie - బాహుబలి టైటిల్ లోగోను గమనించారా.. 'L' ఎందుకు క్యాపిటల్ పెట్టారో తెలుసా ? -->
E-Paper
Advertisement

BaahubaLi Movie: బాహుబలి టైటిల్ లోగోను గమనించారా.. ‘L’ ఎందుకు క్యాపిటల్ పెట్టారో తెలుసా ?

BaahubaLi Movie: బాహుబలి టైటిల్ లోగోను గమనించారా.. ‘L’ ఎందుకు క్యాపిటల్ పెట్టారో తెలుసా ?
Advertisement

BaahubaLi Movie: సోషల్ మీడియా వచ్చాకా ఎవరైనా ఏదైనా మాట్లాడొచ్చు.. ఒక సినిమా చూస్తే.. అది ఒకరికి ఒకలా అర్ధమవుతుంది .. ఇంకొకరికి ఇంకోలా అర్ధమవుతుంది. కొందరికి నచ్చుతుంది.. కొందరికి నచ్చదు. ఒకరు ఒక కోణంలో చూస్తారు.. ఇంకొకరు మరో కోణంలో చూస్తారు. వారి అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకున్నప్పుడు.. అవును ఇది కూడా నిజమే కాదు . ఈ విధంగా మనమెందుకు ఆలోచించలేదు అని అనిపిస్తుంది. ఓర్నీ ఇది మనం గమనించలేదే.. వీరు. భలే గమనించారు అని కూడా అనిపిస్తుంది.

ప్రస్తుతం ఇదంతా దేనికి అంటే.. ఒక నెటిజన్ సోషల్ మీడియాలో బాహుబలి లోగోలోనో L అక్షరం ఎందుకు క్యాపిటల్ లో ఉంది.. అని ప్రశ్నించింది. ఏంటి.. బాహుబలి లోగోలో L అక్షరం క్యాపిటల్ లో ఉందా.. ఇది మేము గమనించలేదే అని కొందరు ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా ప్రతి టైటిల్ వెనుక ఏదో ఒక అర్ధం లేకుండా ఉండదు. అది టైటిల్ లోనే కాదు.. అక్షరాలు రాసే విధానాన్ని బట్టి, వాటి కలర్స్, వెనుక బ్యాక్ గ్రౌండ్ అన్నింటి వెనుక ఏదో ఒక అర్ధం అయితే ఉంటూనే ఉంటుంది. అందులో రాజమౌళీ సినిమా అయితే మరీ ఉంటుంది అని చెప్పొచ్చు.

Advertisement

ఇక బాహుబలి ఇంగ్లిష్ టైటిల్ తీసుకుంటే.. baahubaLi అని ఉంటుంది. ఇందులో అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. ఒక్క L మాత్రమే క్యాపిటల్ లెటర్ ఉంటుంది. దీన్ని ఎవరు గుర్తుండకపోవచ్చు. దీనివెనుక కూడా ఏదైనా కారణం ఉందా.. ? అంటే, నెటిజన్స్ ఒక కొత్త స్ట్రాటజీ చెప్పుకొస్తున్నారు. రాజమౌళీ తన ప్రతి సినిమాలో ఒక మార్క్ ఉండాలని చూస్తాడు. అలాగే ఈ పేరులో Li అంటే లీ.. తన పేరు రాజమౌళీలోని చివరి పదం ళీ కాబట్టి.. టైటిల్ లో తన పేరు వచ్చేలా L ని క్యాపిటల్ పెట్టి ఉండొచ్చు అని చెప్పుకొస్తున్నారు.

అందులో నిజమెంత అనేది తెలియదు కానీ, అసలు నిజం అయితే ఇదే అని మరికొందరు చెప్పుకొస్తున్నారు. baahubaLi అనే పదాన్ని మొత్తం స్మాల్ లెటర్స్ లో రాస్తే baahubali అని వస్తుంది. అంటే ఎల్, ఐ పక్క పక్కన ఒకేలా కనిపిస్తాయి. అప్పుడు టైటిల్ చదివేవారు కన్ఫ్యూజ్ అవ్వొచ్చు. అందుకని ఎల్ ని మాత్రం క్యాపిటల్ పెట్టి ఐ ని స్మాల్ లెటర్ లో పెట్టారు అని చెప్పుకొస్తున్నారు. ఏదిఏమైనా ఎప్పుడో వచ్చిన సినిమా టైటిల్ లో ఉన్న ఎల్ క్యాపిటల్  ఎందుకు ఉందని ఇప్పుడు అడిగిన ఆ నెటిజన్ ని మాత్రం అభిమానులు సరదాగా ఆటపట్టిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×