E-Paper
Advertisement

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఇంత సాహసం అవసరమా..!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో మరో సినిమా ప్లాన్ చేస్తున్న హరీష్ శంకర్.. ఇంత సాహసం అవసరమా..!
Advertisement

Pawan Kalyan:దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్ రెస్పాన్స్ అందుకుంది. కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ సీన్స్‌ను ఎంజాయ్ చేశారు. అయితే మరికొందరు మాత్రం కథ పాత ఫార్మాట్‌లో ఉందని అంటున్నారు. ఈ కారణంగా కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని కూడా వ్యక్తం చేశారు.

ఈ పరిస్థితుల్లోనే హరీష్ శంకర్ తాజాగా ఒక షాకింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. అభిమానులతో మాట్లాడిన సమయంలో ఆయన మరోసారి పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ వార్తతో ఫ్యాన్స్‌లో ఒకవైపు ఆనందం పెరిగినా, మరోవైపు కొన్ని సందేహాలు కూడా మొదలయ్యాయి.

Advertisement

గతంలో హరీష్ శంకర్.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పటికీ ఆ సినిమా టాలీవుడ్‌లో ఒక క్లాసిక్ హిట్‌గా గుర్తింపు పొందింది. అందుకే ఈ కాంబినేషన్ మళ్లీ వస్తోందంటే అభిమానుల్లో అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.

మళ్లీ పవన్ కళ్యాణ్ తో సినిమా..!

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ చూసిన తర్వాత కొంతమంది అభిమానులు హరీష్ శంకర్ స్టైల్‌పై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ అదే పాత కథ, అదే ఫార్మాట్ రిపీట్ అవుతుందేమో అని వారు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై మిక్స్‌డ్ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతలా ట్రోల్స్ వస్తున్న సమయంలో.. హరీష్ శంకర్ మరో సినిమా అనదం సాహసం అనే చెప్పాలి.

Advertisement

ఈ క్రమంలో ఈ చిత్రం గురించి హరీష్ శంకర్ మరికొన్ని విషయాలు కూడా చెప్పుకొచ్చారు. కొత్త సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుందని చెప్పారు. ఈసారి కథలో కొత్తదనం ఉండేలా చూసుకుంటానని, మాస్ ప్రేక్షకులతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమా రూపొందిస్తానని తెలిపారు. అయితే కథ లేదా ఇతర వివరాల గురించి ఇంకా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయినా ఈ సినిమా జరుగుతుంది అని మాత్రం ప్రస్తుతం ఎవరికీ నమ్మకం లేదు. ముఖ్యంగా నిన్న మొన్నటి వరకు హరీష్ శంకర్ తో పవన్ సినిమా ఎప్పుడు ఎప్పుడు వస్తుంది అని ఎదురుచూసిన అభిమానులు.. ఇక హరీష్.. పవన్తో సినిమా చేయకపోతేనే మేలు అనే నిర్ణయానికి వచ్చేసారు.

ఇక ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించగా, ప్రముఖ సంగీత దర్శకులు సంగీతం అందించారు.

ALSO READ: Lavanya Tripathi:ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ పేరు బయటపెట్టిన లావణ్య త్రిపాఠి.. ఎక్కువ మెసేజ్లు చేసేది అతనే..!

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×