E-Paper
Advertisement

Harish Shankar: హరీష్ శంకర్ అంత కసితో ఇండస్ట్రీకి వచ్చారా?.. బాలయ్య బాబుతో సినిమా పక్కా..

Harish Shankar: హరీష్ శంకర్ అంత కసితో ఇండస్ట్రీకి వచ్చారా?.. బాలయ్య బాబుతో సినిమా పక్కా..
Advertisement

Harish Shankar: తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్, కేవలం కమర్షియల్ సినిమాలే కాకుండా సాహిత్యంపై కూడా తనకున్న మక్కువను ఈ వీడియోలో వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ, తాను సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందే చలం రాసిన ప్రసిద్ధ నవల ‘మైదానం’ను సినిమాగా తీయాలనే ఆశయంతో అని చెప్పారు. చలం రచనలు, ముఖ్యంగా స్త్రీత్వాన్ని ఆయన చిత్రించే విధానం హరీష్ శంకర్‌ను బాగా ప్రభావితం చేసింది. చలం ‘మైదానం’తో పాటు ఎండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘ప్రేమ లేఖలు’ వంటి పుస్తకాలను సినిమాలుగా రూపొందించాలనేది ఆయన తొలి కోరిక. తెలుగు సాహిత్యం, పద్యాలు ఇంగ్లీష్ లిటరేచర్ పట్ల ఉన్న అభిరుచే తన సినిమాల్లోని సంభాషణలకు, పాత్రల చిత్రణకు బలాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.

Read also-Oscars 2026: ఆస్కార్ అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రభంజనం.. 13 విభాగాల్లో..

నందమూరి బాలకృష్ణతో

Advertisement

చాలా కాలంగా సోషల్ మీడియాలో హరీష్ శంకర్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌లో సినిమా రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందిస్తూ, బాలకృష్ణ గారితో సినిమా చేసే అవకాశం ఖచ్చితంగా ఉందని, అయితే అది ఇంకా ప్రారంభ దశలోనే ఉందని తెలిపారు. “బాలయ్య బాబుతో సినిమా ఉంటుంది, కానీ దీని గురించి ఇప్పుడే అధికారికంగా అన్నీ చెప్పడం కాస్త తొందరపాటు అవుతుంది. సరైన సమయం వచ్చినప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తాం” అని ఆయన వివరించారు. బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు తన స్టైల్ మేకింగ్ తోడైతే ఒక అద్భుతమైన సినిమా వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Read also-Ashwini Sree: ముఖం నిండా గాయాలు .. భరించలేకపోతున్న అంటూ బిగ్ బాస్ బ్యూటీ ఎమోషనల్ వీడియో!

మారబోతున్న మేకింగ్ స్టైల్

Advertisement

గబ్బర్ సింగ్ వంటి మాస్ సినిమాల తర్వాత, తన తదుపరి చిత్రాల్లో కొత్తదనం చూపించబోతున్నట్లు హరీష్ శంకర్ చెప్పారు. రాజమౌళి గారు ‘ఈగ’ సినిమాతో తన రూటు మార్చుకున్నట్లుగా, తాను కూడా తన ఆలోచనా విధానాన్ని (Thought Process), స్క్రీన్ ప్లేని, కథల ఎంపికను అప్‌డేట్ చేస్తున్నట్లు వెల్లడించారు. గద్దలకొండ గణేష్‌తోనే ఆ మార్పు మొదలైందని, భవిష్యత్తులో తన నుంచి ప్రేక్షకులు ఊహించని సరికొత్త సినిమాలను చూస్తారని ఆయన భరోసా ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారితో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా పట్ల ఆయన చాలా ధీమాగా ఉన్నారు. ఇది కేవలం ఫ్యాన్స్‌కే కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్‌కు కూడా నచ్చేలా ఉంటుందని, థియేటర్లలో పండగ వాతావరణం కనిపిస్తుందని హరీష్ శంకర్ ముగించారు.

Related News

కూతురికి మంత్రాలు నేర్పిస్తున్న ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్!

అక్క రెడీ అంటోంది… మరి నువ్వెక్కడ మోక్షజ్ఞ?

ఇంకా ఆమె మాటే వింటున్నావా..? తమ్ముడిని ఆటాడేసుకున్న సల్మాన్!

ఈ హీరోయిన్ల బ్యాగ్‌ల రేట్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

రష్మిక హెల్త్‌పై బిగ్ అప్‌డేట్.. గాయం తర్వాత మొదటిసారి స్పందన!

మళ్లీ అదే కథేనా… ‘ఫౌజీ’ రిలీజ్‌పై ఫ్యాన్స్ టెన్షన్!

నేనో దొంగనాకొడుకు అంటున్న లిటిల్ హార్ట్స్ మౌళి !

బేబీ బంప్‌తో కనిపించిన సమంత.. ఫొటో వైరల్!

Big Stories

Advertisement
×